hyderabad international airport
-
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మలేసియా సంస్థ వాటా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ సంస్థ జీఎంఆర్ గ్రూప్.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాను 74 శాతానికి పెంచుకోనుంది. మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ) నుంచి 11 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు జీఎంఆర్ 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 831 కోట్లు) వెచి్చంచనుంది. జీఎంఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కన్సార్షియం.. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)కు జీహెచ్ఐఏఎల్ అనుబంధ సంస్థకాగా.. ఎంఏహెచ్‌బీతో వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కీలక ఆస్తులను కన్సాలిడేట్ చేయడంలో భాగంగా తాజా వాటా కొనుగోలుకి తెరతీసినట్లు జీఎంఆర్ గ్రూప్ తెలియజేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఐఏఎల్‌లో జీఏఎల్‌కు 63 శాతం వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 13 శాతం చొప్పున వాటా ఉంది. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. కొత్తగా మరో టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సదుపాయాల విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టెర్మినల్ మొదటి దశలో భాగంగా తూర్పు వైపు కొత్తగా 15,742 చదరపు మీటర్ల టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. భద్రతా తనిఖీల అనంతరం మరో నెల రోజుల్లో దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అవకాశం ఉంది. తాజాగా పూర్తి చేసిన విస్తరణతో ఎయిర్‌పోర్టు టెర్మినల్ వైశాల్యం 3,79,370 చదరపు మీటర్లకు పెరిగింది. సాలీనా సుమారు 3.4 కోట్ల మంది ప్రయాణీకుల సామర్థ్యానికి వీలుగా ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా తొలి దశ టర్మినల్ విస్తరణలో కొంత భాగం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదనంగా పలు సౌకర్యాలు.. ఏటా కోటి 20 లక్షల మంది ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్‌పోర్టులో 2019 నాటికి ప్రయాణికుల సంఖ్య 2.1 కోట్లకు చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు విస్తరణపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ ఇంటెరిమ్ డిపార్చర్ టెర్మినల్, ఇంటెరిమ్ డొమెస్టిక్ అరైవల్ టెర్మినల్‌ను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. విస్తరించిన ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్‌తో 149 చెక్ఇన్ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషీన్లు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పయర్ భవనాల్లో మరిన్ని లాంజ్‌లు, రిటైల్ అవుట్లెట్లు ఉంటాయి. అలాగే 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపార్చర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. (క్లిక్: ఫలించిన పరి‘శ్రమ’.. టీఎస్ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు) రన్‌వే సామర్థ్యం పెంపు... రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా నాలుగు రాపిడ్ ఎగ్జిట్ టాక్సీ వేలను ఏర్పాటు చేశారు. దీంతో విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుంచి ట్యాక్సీ ఆఫ్ కావడానికి అవకాశం ఉంటుంది. రన్‌వే ఆక్యుపెన్సీ సమయం కూడా తగ్గి, సామర్థ్యం పెరుగనుంది. అలాగే సెకెండరీ రన్ వేను ఉపయోగించుకునే సందర్భంలో సమర్థవంతమైన ఆపరేషన్ కోసం మరో కొత్త సమాంతర ట్యాక్సీవేను కూడా అభివృద్ధి చేశారు. కొత్తగా మూడు ఎయిరోబ్రిడ్జిలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం 6 ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల కోసం అన్ని సదుపాయాలతో కూడిన రెండు బేబీ కేర్ రూములు, 2 ఫ్యామిలీ రూమ్‌లను నిర్మించారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా ఒక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. (క్లిక్: నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు!) -
ఆ పదకొండు దేశాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్సు వానా, చైనా, జింబాబ్వే, మారిషస్, న్యూజిలాండ్, హాంగ్‌కాంగ్, సింగపూర్, ఇజ్రాయెల్లను హైరిస్క్ దేశాలుగా కేంద్రం ప్రకటించడంతో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక ఆగమన గదిని అందుబాటులోకి తెచ్చారు. ఇమ్మిగ్రేషన్‌కు ముందే పరీక్షలు చేసుకునే విధంగా ప్రత్యేక కోవిడ్ టెస్టింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో బుకింగ్ సదుపాయం ప్రయాణికుల సౌలభ్యం కోసం ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షల ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు వెబ్సైట్ (www.hyderabad.aero), లేదా పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ ల్యాబ్ వెబ్సైట్ (http://covid.mapmygrnome.in) ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. -
పారిస్ ఎయిర్‌పోర్టుని మరిపించేలా శంషాబాద్‌లో..
తెలంగాణలో ఉన్న జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టుని సర్వహంగులతో ఆధునీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల ఫ్రాన్స్‌కి చెందిన పారిశ్రామికవేత్తలు, రాయబారులతో కూడిన బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలు, తెలంగాణ ప్రభుత్వం అవంలభిస్తున్న విధానాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే మరో అంశం తెరపైకి వచ్చింది. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తల పర్యటన సందర్భంగా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, హైదరాబాద్ డిప్యూటీ సీఈవో ఆంటోనియో కొంబ్రెజ్ మాట్లాడుతూ.. శంషాబాద్‌లో ఉన్న ఎయిర్‌పోర్టుని రూ. 6,300 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రతీ ఏడు 34 లక్షల మంది ప్రయాణికుల రద్దీ తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు ఆధునీకరించబోతున్నట్టు వెల్లడించారు. ఇదే జరిగితే ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న ఓర్లీ ఎయిర్‌పోర్టుకి ధీటుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మారుతుంది. ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉంటే మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహం అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే జార్జ్ మోనిన్ సంస్థ హైదరాబాద్‌లో ఉన్న తమ ప్లాంటును రూ. 200 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. ఇదే తరహాలో అనేక కంపెనీలు ఉన్నాయి. వారిని ఆకట్టుకునేలా రాకపోకలకు సంబంధించి శంషాబాద్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయనున్నట్టు వెల్లం్లడించారు. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫీజుల మోత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు చేసేవారికి చార్జీలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను పెంచుకునేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్)కు ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతించడం ఇందుకు కారణం. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. 2021 ఏప్రిల్ నుంచి 2026 మార్చి దాకా వర్తించే మూడో కంట్రోల్ పీరియడ్‌కు సంబంధించి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదన ప్రకారం టారిఫ్‌లను సవరిస్తూ ఏఈఆర్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేశీ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ను రూ. 480కి (ప్రస్తుతం రూ. 281), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే దాన్ని రూ. 700కి (ప్రస్తుతం రూ. 393) పెంచుకోవచ్చు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 31 నాటికి దేశీ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 750 దాకా, విదేశీ ప్రయాణికులకు రూ. 1,500 దాకా యూడీఎఫ్ పెరుగుతుంది. -
హైదరాబాద్–లండన్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లయిట్
హైదరాబాద్: ఎయిరిండియా హైదరాబాద్– లండన్ మధ్య నాన్‌స్టాప్ విమాన సరీ్వస్‌ను ప్రారంభించింది. తొలి విమానం గురువారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఇదే విమానం తిరిగి 10వ తేదీన (శుక్రవారం) లండన్ బయల్దేరి వెళుతుంది. 256 సీట్ల సామర్థ్యం (బిజినెస్క్లాస్ 18, ఎకానమీ క్లాస్ 238 సీట్లు) కలిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వారానికి రెండు సరీ్వసుల కింద ఎయిరిండియా నడపనుంది. హైదరాబాద్ నుంచి ప్రతీ సోమవారం, శుక్రవారం లండన్‌కు విమాన సరీ్వస్ ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణ సమయం 10.30 గంటలు. అదే లండన్ నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణ సమయం 9.20 గంటలుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల నుంచి లండన్‌కు ఎయిరిండియా నాన్‌స్టాప్ సరీ్వసులను నిర్వహిస్తోంది. -
ప్రయాణికుడే ‘ప్రథమం’
సాక్షి, హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు పడిగాపులు తప్పనున్నాయి. భద్రతా పరమైన తనిఖీల కోసం ఇక ఏమాత్రం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన కొద్ది సేపట్లోనే భద్రతా తనిఖీలను ముగించుకొని లోనికి వెళ్లిపోవచ్చు. ప్రయాణికుల సదుపాయాలకు అగ్రతాంబూలం ఇస్తూ ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక రకాల సదుపాయాలను కల్పించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో త్వరలో ముఖ కవళికల నమోదు (ఫేస్ రికగ్నైజేషన్) యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. భద్రతా తనిఖీలు సులభతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోప్రయాణికుల భద్రతా తనిఖీలు అతి ముఖ్యమైన ఘట్టం. భద్రతా అధికారులు ఒక్కొక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించేందుకు ఎంతో సమయం పడుతుంది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 3 గంటలు ముందుగా చేరుకోవలసి ఉంటుంది. అలాగే జాతీయ ప్రయాణికులు 2 గంటలు ముందుగా విమానాశ్రయానికి రావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా పరమైన తనిఖీలను మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. పైగా అదే సమయంలో ప్రయాణికుల మొత్తం వివరాలను నిక్షిప్తం చేయడం వల్ల వారు ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు. ఏ సమయం నుంచి ఏ సమయంలో విమానాశ్రయంలో ఉన్నారు వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో ప్రయాణికులకు మరింత పటిష్టమైన భద్రతను కల్పించేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ‘ఫేస్ రికగ్నైజేషన్’ యంత్రాలనుప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రయాణికుల ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డుల్లోని వివరాలతో సరిపోయే విధంగా రెటీనా స్కాన్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కితే చాలు.. ‘సుగమ్య భారత్ అభియాన్’సేవల్లో భాగంగా వృద్ధులు, వికలాంగులు, స్వతహాగా నడవలేని వారి కోసం ప్రస్తుతం వీల్చైర్లను అందుబాటులో ఉంచారు. అంధులైన వారి సమాచారం కోసం బ్రెయిలీ లిపిలో సైన్బోర్డులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన తరువాత టర్మినల్స్‌కు చేరుకొనేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల్లోకి ప్రవేశించేందుకు, ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లేందుకు సహాయకులు, వీల్చైర్ల ద్వారా ప్రయాణికులకు సముచితమైన సేవలను అందజేస్తున్నారు. త్వరలో ఈ ఆటోమేటిక్ వీల్ చైర్ సదుపాయాన్ని పార్కింగ్ ప్రదేశం నుంచే కల్పించనున్నారు. ప్రయాణికులు తమ కారు పార్కు చేసిన చోట నుంచి కాలింగ్ బెల్ నొక్కితే చాలు. ప్రయాణికుల సహాయకులు నేరుగా కారు వద్దకే వచ్చి వీల్‌చైర్ సదుపాయాన్ని కల్పిస్తారు. అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ఎక్స్‌ప్రెస్ సేవలు కేవలం ఒక హ్యాండ్ బ్యాగ్‌తో బయలుదేరే 40 శాతం డొమెస్టిక్ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ ఇన్ సదుపాయాన్ని త్వరలో అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించనున్నారు. టర్మినల్ ఎంట్రీ వద్ద ఉండే సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల ద్వారా హ్యాండ్ బ్యాగ్ ప్రయాణికులు వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం సుమారు 18,000 మంది డొమెస్టిక్ హ్యాండ్ బ్యాగ్ ప్రయాణికులకు ఈ సదుపాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. హ్యాండ్‌బ్యాగ్ ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కూడా దీనిని వర్తింపజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ‘క్యూ’కట్టాల్సిన పనిలేదు కొంతకాలంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎయిర్‌పోర్టు సిబ్బందికి మాత్రం ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా సత్ఫలితాలు లభించడంతో ప్రయాణికుల భద్రతకు కూడా వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు సెక్యూరిటీ గేట్ వద్ద ఎక్కువ సమయం క్యూలో నించోవలసిన అవసరముండదు. పైగా రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వారి ట్రావెల్ హిస్టరీ సమోదై ఉంటుంది. దీంతో వారు అడుగడుగునా సెక్యూరిటీ తనిఖీల కోసం సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. నేరుగా వెళ్లిపోవచ్చు. బేబీ రూమ్స్ భేష్ ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ కార్యక్రమాల్లో భాగంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బేబీ రూమ్స్ ప్రయాణికులకు ఎంతో సంతృప్తికరమైన సేవలందజేస్తున్నాయి. పిల్లలకు పాలు పట్టేందుకు, డైపర్లు మార్చేందుకు ఉపయోగపడుతున్నాయి. మహిళా ప్రయాణికుల కోసం ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శానిటరీ న్యాప్కిన్స్ వెండింగ్ మిషన్లను వాష్‌రూమ్‌లలో 26 చోట్ల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో విమానాశ్రయంలో పర్యావరణ హితమైన బయో టాయిలెట్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. -
జీఎంఆర్ కు షాక్!
హైదరాబాద్ విమానాశ్రయంలో యూడీఎఫ్ రద్దు ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 దాకా అమలు ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయం ఏటా రూ. 630 కోట్ల మేర నష్టం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌నకు విమానాశ్రయాల నియంత్రణ సంస్థ ఏఈఆర్ఏ షాకిచ్చింది. గ్రూప్ సారథ్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్మెంట్ ఫీజులు (యూడీఎఫ్) రద్దు చేయాలని నిర్ణయించింది. ఏరోనాటికల్ టారిఫ్‌లపై సంబంధిత వర్గాలతో సంప్రదింపుల అనంతరం ఏఈఆర్ఏ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 దాకా అమల్లో ఉంటాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి దేశీ రూట్లలో చేసే ప్రయాణాలకు రూ. 430, విదేశీ ప్రయాణాలకు రూ. 1,700 చొప్పున ప్రయాణికుల నుంచి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) యూడీఎఫ్ కింద వసూలు చేస్తోంది. ఈ చార్జీలకు పన్నులు కూడా కలిపితే రూ. 484/1,910 దాకా అవుతోంది. ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలంటే ఈ ఫీజులు వసూలు చేయడం తప్పనిసరని కంపెనీ చెబుతున్నప్పటికీ.. ఈ భారీ ఫీజులపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే యూడీఎఫ్‌ను ‘సున్నా’ స్థాయికి తగ్గించాలన్న ఏఈఆర్ఏ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఏఈఆర్ఏ ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, దీనిపై ప్రస్తుతం వ్యాఖ్యానించలేమని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాల అభివృద్ధికి చేసిన పెట్టుబడులను, నిర్వహణ వ్యయాలను రాబట్టుకునేందుకు ఎయిర్‌పోర్టు ఆపరేటింగ్ సంస్థలు.. ప్రయాణికుల నుంచి యూడీఎఫ్ వసూలు చేస్తుంటాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగే ప్రయాణికుల నుంచి కూడా చార్జీలు వసూలు చేయాలని కూడా జీఎంఆర్ గ్రూప్ గతంలోప్రతిపాదించినా అది సాధ్యపడలేదు. జీహెచ్‌ఐఏఎల్‌లో జీఎంఆర్ గ్రూప్‌నకు 63%, కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలకు చెరి 13%, మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కి 11% వాటాలు ఉన్నాయి. 2008 మార్చిలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2012-13లో సుమారు 63 లక్షల మంది దేశీయ ప్రయాణికులు, 21లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 32 లక్షల మంది దేశీ, 12 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. 2012-13లో యూడీఎఫ్‌ల ద్వారా సంస్థకు రూ.630 కోట్ల ఆదాయం లభించింది.