సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్సు వానా, చైనా, జింబాబ్వే, మారిషస్, న్యూజిలాండ్, హాంగ్‌కాంగ్, సింగపూర్, ఇజ్రాయెల్‌లను హైరిస్క్ దేశాలుగా కేంద్రం ప్రకటించడంతో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక ఆగమన గదిని అందుబాటులోకి తెచ్చారు. ఇమ్మిగ్రేషన్‌కు ముందే పరీక్షలు చేసుకునే విధంగా ప్రత్యేక కోవిడ్ టెస్టింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
ఆన్‌లైన్‌లో బుకింగ్ సదుపాయం
ప్రయాణికుల సౌలభ్యం కోసం ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షల ఆన్‌లైన్‌లో బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు వెబ్‌సైట్ (www.hyderabad.aero), లేదా పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ ల్యాబ్ వెబ్‌సైట్ (http://covid.mapmygrnome.in) ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment