Hyderabad IT Hub
-
రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ. 2.20 లక్షల కోట్లు!
రాష్ట్ర ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.2 లక్షల కోట్లు దాటుతున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరగగా.. 2022–23లో ఇది 20 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించినట్టు ఐటీశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ రంగం పురోగతికి సంబంధించిన నివేదికను ఆ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి జూన్ మొదటి వారంలో నివేదికను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో వృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనలోనూ మంచి పురోగతి సాధించామని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో 1.53 లక్షల ఉద్యోగాల కల్పన జరగగా.. ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలకు చేరి ఉంటుందని పేర్కొంటున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నుంచే ఉందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను హైదరాబాద్ అధిగమించిందని అంటున్నాయి. ఐటీ రంగ కార్యకలాపాల విస్తరణ వల్లే.. కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్, తద్వారా వచి్చన కొత్త అవకాశాలను అందుకోవడంలో హైదరాబాద్‌లో ముందు వరుసలో ఉందని.. అందువల్లే శరవేగంగా వృద్ధి సాధ్యమవుతోందని ఐటీశాఖ వర్గాలు చెప్తున్నాయి. 1,500కుపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాల కంపెనీలతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా.. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లను ప్రారంభించిందని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో రూపొందించిన గ్రిడ్ పాలసీ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అంటున్నాయి. టీహబ్‌తోపాటు పలు ప్రైవేటు ఇంక్యుబేషన్ సెంటర్ల కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ వృద్ధి ఇదే వేగంతో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి వేగంగా.. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2021–22 నాటికి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. అప్పట్లో 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2021–22 నాటికి 7.78లక్షలకు చేరింది. అంటే ఎనిమిదేళ్లలో కొత్తగా 4.54 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2035 నాటికి రూ.2.09లక్షల కోట్లకు చేరుతాయని గతంలో నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఒక్కటే, 2022–23 నాటికే ఈ అంచనాలను దాటుతుండటం గమనార్హమని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 2026 నాటికి ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అంతకన్నా ముందే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఐటీ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల సంఖ్య ఏడాది ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) ఉద్యోగాలు 2013–14 57,258 3,23,396 2014–15 66,276 3,71,774 2015–16 75,070 4,07,385 2016–17 85,470 4,31,891 2017–18 93,442 4,75,308 2018–19 1,09,219 5,43,033 2019–20 1,28,807 5,82,126 2020–21 1,45,522 6,28,615 2021–22 1,83,569 7,78,121 -
ఐటీ బాట పట్టిన హైదరాబాద్: కొత్తగా వందలాది కంపెనీలు.. వేలాదీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: ముత్యాల నగరం (సిటీ ఆఫ్ పెరల్స్) ఐటీ బాట పట్టింది. మహానగరంలో గత ఏడేళ్లుగా ఐటీ, అనుంబంధ రంగ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నగరం నలుచెరుగులా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు కంకణం కట్టుకోవడంతో వందలాదిగా నూతన కంపెనీలు..వేలాది కొలువులు సిటీజన్లకు వరంగా మారాయి. తాజాగా కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ పార్క్‌తోపాటు.. ఇటీవలే జెన్‌పాక్ సంస్థ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని విస్తరించిన విషయం విదితమే. ఈ సంస్థ రాకతో కేవలం ఉప్పల్ ప్రాంతంలోనే ఏకంగా 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానుండడం విశేషం. నగర ఐటీ సెక్టార్లో ప్రస్తుతం ఉన్న 6 లక్షల కొలువులకు అదనంగా రాబోయే రోజుల్లో మరో లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని ఆశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. వేగంగా విస్తరణ.. ► నార్త్ హైదరాబాద్ కింద పరిగణించే కండ్లకోయ పరిధిలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ► ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ► వెస్ట్ హైదరాబాద్‌కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్‌లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు నూతన ఐటీ పాలసీ దోహదం చేస్తుందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ► నార్త్‌సిటీ పరిధిలో మంచి యూనివర్సిటీలు, సమీపంలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు,అర్భన్పార్క్లు ఉండడం ఈప్రాంతంలో ఐటీ విస్తరణ వేగం పుంజుకుంది. అగ్రశ్రేణి కంపెనీలకు కేరాఫ్.. ► ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. ► అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న, పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.28 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. హై..హై..ఐటీ.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నూతన కంపెనీల వెల్లువ తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం ఏటా రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ.3 లక్షల కోట్ల మార్కును దాటుతాయని ఐటీ వర్గాలు లెక్కలు వేస్తుండడం విశేషం. -
ఐటీ జాబ్స్ డౌన్!
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కొలువుల వృద్ధి శాతం 3 శాతం పెరగ్గా...ఐటీ రంగంలో మాత్రం 12 శాతం కొలువులకు కోత పడినట్లు తాజా సర్వేలో తేలింది. 2017, ఏప్రిల్‌తో పోలిస్తే 2018 ఏప్రిల్ చివరి నాటికి పలురంగాల్లో కొలువులకు కోత పడగా.. మరికొన్ని రంగాల్లో వృద్ధి నమోదైనట్లు నౌక్రి డాట్‌కామ్ వెబ్సైట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐటీ..అనుబంధ రంగాల్లో ఇలా.. 2018, ఏప్రిల్ నెలాఖరునాటికి వివిధ రంగాల్లో కొలువుల వృద్ధిరేటును పరిశీలించి విడుదల చేసిన తాజా జాబ్సీక్ రిపోర్ట్‌లో ఐటీ మినహా ఇతర రంగాల్లో వృద్ధి మూడు శాతం నమోదైందని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. ప్రధానంగా ఆటోమోబైల్, నిర్మాణ రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువుల జోరు కొనసాగుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించడం విశేషం. మెట్రో నగరాల్లో జాబ్ ట్రెండ్స్ ఇలా.. ముంబయి, కోల్‌కతా నగరాల్లో ప్రతీఏటా ఐటీ కొలువుల్లో వృద్ధి నమోదవుతోందని..కానీ బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నాలుగుశాతం తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది. కాగా కోల్‌కతాలో ఏటా ఐదుశాతం వృద్ధి, ముంబయిలో 4 శాతం, చెన్నైలో ఒకశాతం వృద్ధి నమోదవుతోందట. ఇక పుణే నగరంలోనూ కొలువుల్లో ఒక శాతం కోత పడుతున్నట్లు ఈ సర్వే రిపోర్టు వెల్లడించింది. పురోగమిస్తోన్న కొత్త రంగాలు.. ఐటీ రంగంలో కొలువుల వృద్ధిరేటు తగ్గుముఖం పట్టగా...మరోవైపు ఆటోమొబైల్, పారిశ్రామికరంగం, నిర్మాణ రంగాల్లో కొలువుల వృద్ధి గణనీయంగా నమోదవడం విశేషం. ఇక బీపీఓ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫార్మా, బయోటెక్ రంగాల్లోనూ స్వల్పవృద్ధి రేటు నమోదైనట్లు తాజా నివేదికలో వెల్లడైంది. మెట్రో నగరాల్లో ఐటీ కొలువుల్లో పెరుగుదల/తరుగుదల ఇలా ఉంది... నగరం పెరుగుదల/తరుగుదల కోల్‌కతా 5 శాతం వృద్ధి ముంబయి 4 శాతం వృద్ధి చెన్నై 1 శాతం వృద్ధి బెంగళూరు 4 శాతం తరుగుదల హైదరాబాద్ 4 శాతం తరుగుదల వివిధ రంగాల్లో వృద్ధి ఇలా ఉంది. రంగం కొలువుల్లో వృద్ధి ఇలా ఉంది (శాతంలో) ఆటోమొబైల్ 33 పారిశ్రామికరంగం 23 నిర్మాణరంగం 20 బీపీఓ 11 ఇన్సూరెన్స్ 06 బ్యాంకింగ్ 05 ఫార్మా, బయోటెక్ 04 మందగమనం తాత్కాలికమే నగరంలో ఐటీ రంగంలో కొలువుల వృద్ధిరేటు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టినప్పటికీ..త్వరలో కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల రాకతో పుంజుకుంటున్నట్లు అంచనా వేస్తున్నాం. ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్ఐపాస్ రాకతో గ్రేటర్ నగరానికి దేశ, విదేశీ దిగ్గజ కంపెనీల రాక మొదలైంది. – జీఎల్.స్వామి, ఐటీ రంగ నిపుణుడు -
హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా నేనే మార్చా: చంద్రబాబు
విశాఖ : సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌కు ఓ వరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో రెండోరోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్‌లో భారత్ సూపర్ పవర్‌గా మారుతుందని, పెట్టుబడులకు ఇండియా అనుకూలమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీ చాలా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. అయితే ఏపీ వృద్ధి రేటు భారత్ వృద్ధిరేటును అధిగమించిందన్నారు. మత్స్య పరిశ్రమ, ఎగుమతుల్లో ఏపీ టాప్‌లో ఉందని, మరో ఆరు నెలల్లో గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రపద్రశ్లో సహజ వనరులకు కొదవ లేదంటూ... సింగపూర్, హాంకాంగ్ పోర్టుల కంటే ఏపీకి విస్తృత సముద్రం ఓ వరమన్నారు. వచ్చే మూడు,నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో నాలుగు భాగస్వామ్య సదస్సులు నిర్వహించినట్లు చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. మైక్రోసాప్ట్ సంస్థను హైదరాబాద్‌కు ఆహ్వానించింది తానేనని చంద్రబాబు అన్నారు. సీఐఐ సదస్సులో ఏపీ సర్కార్ నేడు ఐటీ, టూరిజనం సంస్థలతో పలు ఒప్పందాలు చేసుకోనుంది. -
హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా నేనే మార్చా