విమానాశ్రయంలో‘ట్రూజెట్’కు పూజలు
రేణిగుంట: ఆదివారం నుంచి హైదరాబాద్-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించేందుకు తన కుమారుడు రామ్‌చరణ్ డెరైక్టర్‌గా ఉన్న ట్రూజెట్ విమాన సర్వీసులకు ఎంపీ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబసభ్యులతోపాటు సంస్థ డెరైక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి చిరంజీవి కుటుంబ సభ్యులు వెళ్లారు. అనంతరం ట్రూజెట్ విమానంలో చిరంజీవి హైదరాబాద్ వెళ్లారు.