ల్యాండింగ్ ట్రబుల్.. గాలిలో హైదరాబాద్ విమానం!
గన్నవరం: భారీగా పొగమంచు కమ్ముకోవడంతో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఉదయం పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా వాతావరణం తీవ్ర ప్రతికూలంగా ఉండటంతో విమానాల ల్యాండింగ్ కష్టంగా మారింది.
దీంతో ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరిన హైదరాబాద్ ట్రుజెట్ విమానం ల్యాండింగ్ సమస్యతో గాలిలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్ ట్రబుల్ ఎదురవ్వడంతో గాలిలోనే తిరుగుతోంది.