hydrogen gas fuel
-
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా.. లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్ పోటీ!
ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ విమానాల తయారీకి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు సాగిస్తుంటే, స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక కంపెనీ ఏకంగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానానికి రూపకల్పన చేసింది.‘ఈవీటాల్’ పేరుతో రూపొందించిన ఈ బుల్లి విమానం పూర్తిగా ద్రవరూపంలో ఉన్న హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఇందులో పైలట్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు అనుగుణంగా సైరస్జెట్ అనే స్విస్ కంపెనీ దీనిని రూపొందించింది.ఇందులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే, 1850 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 520 కిలోమీటర్లు. ఈ విమానానికి పొడవాటి రన్‌వే కూడా అవసరం లేదు. హెలికాప్టర్ మాదిరిగా ఇది నిలువునా టేకాఫ్ చేసుకుని, ఆకాశంలోకి ఎగిరిపోగలదు. ఈ విమాన సేవలను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సైరస్జెట్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారు..ఇప్పటికే లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు బాగా వినియోగంలోకి వచ్చాయి. తాజాగా జపానీస్ కార్ల తయారీ కంపెనీ హోండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో పనిచేసే కారును రూపొందించింది.హోండా ‘సీఆర్–వీ ఈ:ఎఫ్‌సీఈవీ’ పేరుతో రూపొందించిన ఈ కారు నిరంతారయంగా 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. జనరల్ మోటార్స్ సహకారంతో హోండా కంపెనీ ఈ కారులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ను రూపొందించింది. 92.2 కిలోవాట్ల సామర్థ్యం గల ఈ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్ నుంచి ఇంజిన్‌కు 174 హార్స్ పవర్ విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే సహా పలు అధునాతన సాంకేతిక ఏర్పాట్లు చేయడం విశేషం. హోండా కంపెనీ వచ్చే ఏడాది దీనిని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.ఇవి చదవండి: ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు -
ఐవోసి మాస్టర్ ప్లాన్.. అంబానీ, అదానీలకు పోటీగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్.. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీపై భారీ ప్రణాళికలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపునకు ఈ జాయింట్ వెంచర్ గట్టీ పోటీనివ్వనుంది. సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే, ఐవోసీ, ఎల్అండ్టీ విడిగా మరో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి. ఐవోసీ–ఎల్అండ్టీ–రెన్యూపవర్ ఐవోసీకి చెందిన మధుర, పానిపట్ రిఫైనరీల వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో అవి పేర్కొన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన పునరుత్పాదక ఇంధనాన్ని రెన్యూ పవర్ సరఫరా చేసే అవకాశం ఉంది. ‘‘మూడు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు వల్ల.. ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణంలో ఎల్అండ్టీకి ఉన్న అనుభవం, పెట్రోలియం రిఫైనరీలో ఐవోసీకి ఉన్న అనుభవం, ఇంధన చైన్ పట్ల అవగాహన, పునరుత్పాదక ఇంధనంలో రెన్యూపవర్కు ఉన్న అనుభవం కలసివస్తాయి’’ అని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
కారు నడిపితే నీరు బయటకు వస్తోంది..భారత్‌లో తొలి కారుగా రికార్డు..!
గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా..సంప్రదాయ దహనశీల వాహనాలకు చెక్ పెడుతూ..ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే పనిలో పడ్డాయి పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు. మరికొన్ని కంపెనీలు ఈవీ వాహనాలపైనే కాకుండా హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్‌తో నడిచే వాహనాలను కూడా తయారు చేసేందుకు సిద్దమయ్యాయి. ఈ వాహనాల తయారీలో జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఒక అడుగు ముందుంది. కొద్దిరోజుల క్రితమే హ్రైడోజన్ ఫ్యుయల్‌తో నడిచే కారును టయోటా మిరాయ్‌ను ఆవిష్కరించింది. కాగా తాజాగా హైడ్రోజన్‌తో నడిచే కారును టయోటా భారత్‌లోకి తీసుకొచ్చింది. భారత్‌లోని తొలి కారుగా రికార్డు..! భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ఫ్యుయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను టయోటా మిరాయ్ కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంచ్ చేశారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే టయోటా మిరాయ్ సెడాన్ కారును టయోటా ఆవిష్కరించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టయోటా మిరాయ్ ఎస్యూవీ సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. దీనిలో హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తారు. హైడ్రోజన్ వాయువును విచ్చిన్నం చేయడంతో విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇక ఈ కారు నుంచి నీరు అవశేషంగా బయటకు వస్తోంది. సాధారణంగా సంప్రదాయ ఇంధన వాహనాలు కర్భన ఉద్గారాలను రిలీజ్ చేస్తాయి. ఇంధన ధరలకు చెక్..! సమీప భవిష్యత్తులో టయోటాకు చెందిన క్యామ్రీ కారులో ఫ్లెక్స్ ఇంధనాన్ని ఉపయోగించబోతున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ వాహనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని గడ్కరీ అన్నారు. గ్రీన్ హైడ్రోజన్, ఫ్లెక్స్ ఇంధనంతో పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
పెట్రోల్, డీజిల్, కరెంట్ ఏదీ అక్కర్లేని కారు.. త్వరలో ఇండియాలో
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌తో కూడా కొద్దోగొప్పో కాలుష్యం సమస్య ఉంటుందేమోగానీ.. హైడ్రోజన్‌తో మాత్రం అస్సలు ఉండదు. ఈ విషయం చాలాకాలంగా మనందరికీ తెలుసు. అయితే, మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే. ఇప్పటికే రోడ్ల మీద పెట్రోల్, డీజిల్, సీఎన్'జీ, ఎలక్ట్రిక్ కార్లు తిరుగుతున్నాయి. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే కార్లు కూడా దర్శనం ఇవ్వనున్నాయి. తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐసీఏటీ) భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ కారును మన దేశంలో పరీక్షించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు(మార్చి 16) ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది. దేశంలో ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచడం కోసం ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. గత ఏడాది టయోటా కంపెనీకి చెందిన మిరాయ్ కారు హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత అత్యధిక దూరం ప్రయాణించి ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' కైవసం చేసుకుంది. ఈ విధమైన అత్యధిక మైలేజ్ అందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు ఇదే. కొన్ని నివేదికల ప్రకారం.. హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 1,359 కిమీల దూరం ప్రయాణించింది. ఈ మొత్తం దూరం ప్రయాణించడానికి 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్‌ను వినియోగించింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో విద్యుత్ ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ 1 కేజీ ధర రూ.350-400 వరకు ఉంది. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్... భారత్‌కు ఇదే గోల్డెన్ ఛాన్స్..! అమెరికాకు చెక్..!) -
టయోటా మరో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..!
Toyota Mirai Sets Guinness World Record: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. టయోటా ఒక అడుగు ముందుకేసి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలపై పరిశోధనలను చేపట్టింది. గిన్నిస్ రికార్డు...1360కిమీ ప్రయాణం...! జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టయోటా హైడ్రోజన్‌తో నడిచే వాహనాన్ని‘ మిరై’ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వాహనం ఇంధనం నింపకుండా అత్యధిక దూరం ప్రయాణించినందుకుగాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. హైడ్రోజన్ శక్తితో నడిచే మిరై 1360 కిమీ మేర ప్రయాణించింది. 2021 టయోటా మిరై కార్‌ను ప్రొఫెషనల్ డ్రైవర్ హైపర్మిలర్ నడిపారు. వేన్ గెర్డెస్, బాబ్ వింగర్ అతనికి సహ-పైలట్ డ్రైవర్లుగా ఉన్నారు. టయోటా మిరై 5.65 కేజీల హైడ్రోజన్‌ను మాత్రమే వాడినట్లు టయోటా పేర్కొంది. టయోటా మిరై ఫస్ట్‌జనరేషన్ కారును 2016లో రూపొందించగా దాని తరువాత జనరేషన్ మిరై అత్యధిక దూరం ప్రయాణించి రికార్డులను నమోదుచేసింది. చదవండి: టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్‌లో... అసలు ఏంటీ ఫ్యుయెల్ సెల్ వాహనం...! ఫ్యుయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం ( ఎఫ్‌సీఈవీ ) ఒక ఎలక్ట్రిక్ వాహనం దీనిలో ఇంధనంగా ఫ్యుయెల్ సెల్ , చిన్న బ్యాటరీ లేదా సూపర్ కెపాసిటర్లను ఉపయోగిస్తారు. ఎఫ్‌సీఈవీ వాహానాల్లో సాధారణంగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించి సంపీడన హైడ్రోజన్ని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. చాలా ఫుయెల్ సెల్ వాహనాలు నీరు, వేడిని మాత్రమే ఉద్గారాలుగా వెలువడుతాయి. చదవండి: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..! -
మురికినీటితో ఇంధనం!
వాషింగ్టన్: సూర్యరశ్మిని, మురికినీటిని ఉపయోగించుకుని హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయగలిగే పరికరాన్ని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. సుస్థిర ఇంధన వనరును అందించడమే కాకుండా మురికినీటి శుద్ధికీ ఇది దోహదపడుతుందని వెల్లడించారు. ఈ పరికరంలో సూక్ష్మజీవులతో కూడిన ‘మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్ (ఎంఎఫ్సీ)’, ‘ఫొటోఎలక్ట్రోకెమికల్ సెల్ (పీఈసీ)’ ఉంటాయి. మురికినీటిలోని కర్బనపదార్థాలను ఎంఎఫ్సీలోని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసి కొంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ పీఈసీ భాగానికి చేరి అక్కడ నీటి ఎలక్ట్రోలైసిస్ జరిగి హైడ్రోజన్, ఆక్సిజన్ ఏర్పడతాయి. ఎంఎఫ్సీ, పీఈసీలను రెండింటినీ ఒకేసారి లేదా ఒక్కోదానిని ఒక్కోసారి ఉపయోగించి కూడా హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.