మొసలి కన్నీటి వ్యాధి...!
మెడిక్షనరీ
మొసలి కన్నీటి వ్యాధి అనే పేరు చూడగానే ఇదేదో మనసులో లేని సానుభూతిని కురిపించే వ్యాధిగా పొరబడే అవకాశం ఉంది. అయితే ఏదైనా తినే పదర్థాలు చూసినా లేదా తింటున్నప్పుడు కళ్లలో నీళ్లు వచ్చే కండిషన్‌కు పెట్టిన పేరు. కొందరికి తాగుతున్నప్పుడు కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది.
ఇంగ్లిష్‌లో ‘క్రోకడైల్ టియర్స్ సిండ్రోమ్’గా పిలిచే ఈ వ్యాధి ఉన్నవారికి నోట్లో నీళ్లతో పాటు కళ్లలోనూ నీరు ఉబుకుతుంది. దీన్నే బోగోరాడ్స్ సిండ్రోమ్ అనీ, గస్టేటో లాక్రిమల్ రిఫ్లక్స్ లేదా గస్టేటరీ హైపర్ లాక్రిమేషన్ అని కూడా అంటారు. దీనికి కంటినిపుణులు లేదా ఈఎన్టీ నిపుణులు, న్యూరాలజిస్ట్లు బొటాక్స్ ఇంజెక్షన్‌తో చికిత్స చేస్తారు.