Hyuderabad
-
నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో ‘గోదావరి జల దీక్ష’
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను టీపీసీసీ నేతలు శనివారం సందర్శించనున్నారు. వాటి పురోగతి, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ’గోదావరి జల దీక్ష’పై డీసీసీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో గాంధీభవన్ నుంచి ఫోన్ లో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు వారి పరిధులలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి శనివారం దీక్షలు చేయాలని, స్థానిక మీడియాతో మాట్లాడి ప్రాజెక్టు వివరాలు తెలియజేయాలని ఉత్తమ్ పార్టీ నేతలను కోరారు. -
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శీతాకాల విడిది ముగిం చుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు ఘనంగా వీడ్కో లు పలికారు. వీరిలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిర ణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు పితాని సత్యనారాయణ, గీతారెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి, డీజీపీ ప్రసాదరావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులున్నారు. డిసెంబర్ 19న శీతాకాల విడిదికోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్న రాష్ట్రపతి.. మధ్యలో చెన్నై, కొచ్చి, అలహాబాద్, ముంబై, ఆగ్రా, పుణే, పుట్టపర్తి తదితర నగరాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం తెలిసిందే. నగరంలో ఉన్న రోజుల్లో రాష్ట్ర విభజనకు సంబంధించి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి తమ వాదనలు వినిపించడం తెలిసిందే.