రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు | President's 13-day south tour concludes | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

Published Wed, Jan 1 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగిం చుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు ఘనంగా వీడ్కో లు పలికారు. వీరిలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిర ణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు పితాని సత్యనారాయణ, గీతారెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి, డీజీపీ ప్రసాదరావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులున్నారు. డిసెంబర్ 19న శీతాకాల విడిదికోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్న రాష్ట్రపతి.. మధ్యలో చెన్నై, కొచ్చి, అలహాబాద్, ముంబై, ఆగ్రా, పుణే, పుట్టపర్తి తదితర నగరాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం తెలిసిందే. నగరంలో ఉన్న రోజుల్లో రాష్ట్ర విభజనకు సంబంధించి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి తమ వాదనలు వినిపించడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement