IAS Training Academy
-
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్
డెహ్రాడూన్: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్ట్ చేయనట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న (మంగళవారం) పూజా ఖేద్కర్ అకాడమీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే ఆమె అకాడమీలో రిపోర్టు చేయకుండా డుమ్మాకొట్టారు. ఇక.. ఈ విషయంపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవటం గమనార్హం.ఇటీవల పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే అకాడమిలో రిపోర్టు చేయాలని పూజా ఖేద్కర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ‘‘మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం ‘జిల్లా శిక్షణ’ నుంచి పక్కనపెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్ చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండండి’’ అని ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు.చదవండి: పూజా ఖేడ్కర్‌పై కేంద్రం సీరియస్ -
ముస్సోరీలో ఇబ్రహీంపూర్ సర్పంచ్
గ్రామాభివృద్ధిపై ప్రసంగం సిద్దిపేట రూరల్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుంబాల లక్ష్మి పాల్గొన్నారు. గురువారం జరిగిన ఆ సమావేశంలో గ్రామాభివృద్ధిపై ఆమె ప్రసంగించారు. ఇటీవల ముస్సోరీ ఐఏఎస్ అకాడమీ. ‘డీసెంట్రలైజేషన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్’పై ప్రసంగించేందుకు రావాల్సిందిగా అక్కడి ప్రభుత్వం సర్పంచ్‌ను ఆహ్వానించిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్పంచ్ లక్ష్మి ఇబ్రహీంపూర్ గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతల విధానం, చెట్ల పెంపకం, పారిశుద్ధ్యంతో పాటు గ్రామ అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలపై ఐఏఎస్ అకాడమీలో ప్రసంగించారు. ఆమె వెంట డీపీవో సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు.