డెహ్రాడూన్: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్ట్ చేయనట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న (మంగళవారం) పూజా ఖేద్కర్ అకాడమీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే ఆమె అకాడమీలో రిపోర్టు చేయకుండా డుమ్మాకొట్టారు. ఇక.. ఈ విషయంపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవటం గమనార్హం.
ఇటీవల పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే అకాడమిలో రిపోర్టు చేయాలని పూజా ఖేద్కర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ‘‘మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం ‘జిల్లా శిక్షణ’ నుంచి పక్కనపెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్ చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండండి’’ అని ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు.
చదవండి: పూజా ఖేడ్కర్‌పై కేంద్రం సీరియస్
Comments
Please login to add a commentAdd a comment