26 వరకు కాలేజీల్లో ఫీజు చెల్లింపు గడువు
ఐసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఐసెట్ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరే గడువును ఈ నెల 26 వరకు పొడిగించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కిందకి రాని వారు కూడా 26లోగానే ఫీజు చెల్లించి కాలేజీల్లో చేరాలని సూచించారు. ప్రతిఒక్కరు ముందుగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ క్లిక్ చేసి, అడ్మిషన్ నంబరు పొందాలని తెలిపారు.