ICC ODI World Cup 2023
-
హార్దిక్ లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్‌కప్ ఆడాం: రోహిత్
హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుతో లేకపోయినా తాము గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సేవలు తమకు ముఖ్యమేనని.. అయితే, అతడి గైర్హాజరీలో కూడా తమవైన వ్యూహాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ సొంతగడ్డపై టీమిండియా తరఫున పునరాగమనం చేస్తున్నాడు.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లో హిట్‌మ్యాన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా గురించి ప్రశ్న ఎదురైంది. ఒకవేళ పాండ్యా గాయపడితే అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరంటూ విలేకరులు అడిగారు.ప్రతిసారీ నెగటివ్‌గానే ఎందుకు?ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘ప్రతిసారీ ప్రతికూల అంశాల గురించే మనం ఎందుకు మాట్లాడాలి? ‘అతడు గాయపడతాడు.. ఇతడికి గాయమవుతుంది.. అప్పుడెలా? ఇలా జరిగితే జట్టుకు కష్టమే’.. అనే మాటలు ఎందుకు?సెలక్టర్లు, నాయకత్వ దళంలో ఇందుకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ మీకు చెప్పలేం కదా! కానీ మా వ్యూహాలు మాకుంటాయి. పాండ్యా గాయపడ్డా మేము వరల్డ్‌కప్ సజావుగానే పూర్తిచేశాం.అతడు గాయపడితే ఎలా అన్న ఆలోచన నాకు లేదుటోర్నీ మూడు లేదంటే నాలుగో మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడనుకుంటా. ఆ తర్వాత కూడా మేము టోర్నీ ఆసాంతం మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి దాకా అజేయంగా నిలిచాం. కాబట్టి ఇప్పుడు అతడు గాయపడితే ఎలా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఒకవేళ అతడు గాయపడినా ఏం చేయాలో మాకు తెలుసు. జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తే మాకు ఎలాంటీ సమస్యా ఉండదు’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన పాండ్యాతద్వారా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.బ్యాట్‌తో, బంతితో రాణించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వరల్డ్‌కప్-2024లో 144 పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 3/20తో రాణించి టీమిండియాకు విజయం అందించాడు. సౌతాఫ్రికా విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ల వికెట్లు తీసి రోహిత్ సేన చాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ పాండ్యా ప్రధాన భూమిక పోషించాడు.ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ హార్దిక్ పాండ్యా ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా నాలుగో టీ20లో మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం అతడు వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాడు. కాగా ఫిబ్రవరి 6(గురువారం), ఫిబ్రవరి 9(ఆదివారం), ఫిబ్రవరి 12(బుధవారం)న భారత్- ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా. చదవండి: CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’ -
Shreyas Iyer: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ!
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే జట్టులో తాను తప్పక చోటు దక్కించుకుంటాననే ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తాను ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.కాగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఐపీఎల్‌తో పాటు దేశీ క్రికెట్‌కే పరిమితమైన ఈ ముంబై బ్యాటర్.. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు.అదే విధంగా తన కెప్టెన్సీలో ముంబైకి దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ దుమ్ములేపాడు. రెండు భారీ శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి అయ్యర్ ఎంపిక కావడం లాంఛనప్రాయమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ!ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. వన్డే వరల్డ్‌ప్-2023 ప్రదర్శన ఆధారంగా తనకు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను.గత వరల్డ్‌కప్ టోర్నీలో నేను, కేఎల్ రాహుల్(KL Rahul) మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాం. మా ఇద్దరికీ ఆ ఈవెంట్ అద్భుతంగా సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ ఫైనల్లో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ ఆడే టీమిండియాకు ఎంపికైతే నాకు అంతకంటే గర్వకారణం మరొకటి ఉండదు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’’ అని శ్రేయస్ అయ్యర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.రెండు శతకాలు బాదికాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశారు. ఈ టోర్నమెంట్లో మిడిలార్డర్లో బరిలోకి దిగిన అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిపి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ సగటు 66.25తో 530 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.ఫైనల్లో మాత్రం విఫలంఅయితే, అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో(India vs Australia) మాత్రం అయ్యర్ తేలిపోయాడు. ఆసీస్ కెప్టెన్, పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. మరోవైపు.. ఈ మెగా టోర్నీలో కేఎల్ రాహుల్ 452 పరుగులు సాధించాడు. ఫైనల్లో 66 పరుగులు చేసి.. టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.పంజాబ్ కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్‌పై కాసుల వర్షం కురిసిన విషయం తెలిసిందే. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీ అందించిన ఈ ఆటగాడి కోసం పంజాబ్ కింగ్స్ భారీ మొత్తం ఖర్చు పెట్టింది. ఏకంగా రూ. 26.75 కోట్లకు అయ్యర్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఇక అతడిని తమ కెప్టెన్‌గా ప్రకటిస్తూ పంజాబ్ కింగ్స్ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా సూపర్‌స్టార్ రిషభ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ మెగా లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే: బీసీసీఐ ఉపాధ్యక్షుడు