ICC titles
-
WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు
తాజాగా ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్‌లో విజేతగా నిలవడం ద్వారా మూడు ఫార్మాట్ల ఐసీసీ టైటిల్స్ సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా టీమ్ చరిత్ర పుటల్లోకెక్కిన విషయం తెలిసిందే. జట్టుగా ఆసీస్ ఈ రికార్డు సాధించగా.. వ్యక్తిగతంగా ఐదుగురు ఆటగాళ్లు కూడా ఈ ఘనత సాధించారు. పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లు మూడు ఫార్మాట్ల ఐసీసీ టైటిల్స్ (2015 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్, 2023 డబ్ల్యూటీసీ) గెలిచిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు. ఈ ఐదుగురు వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, డబ్ల్యూటీసీ టైటిల్స్ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ క్రికెట్లో ఈ ఐదుగరు మినహా మరెవ్వరూ ఈ ఘనత సాధించలేకపోయారు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
‘హీరో’కు ఏమాత్రం తీసిపోడు! ఏం మాట్లాడుతున్నారు? నిజంగానే..
MS Dhoni New Look Viral: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఈ మిస్టర్ కూల్‌కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నప్పటికీ అతడికి ఉన్న ఫాలోయింగ్ ఇసుమంత కూడా తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ధోని.. ఇప్పటికీ తన ఆటతో అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల రాంచిలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా అక్కడికి రాగా తలా.. తన ఎంట్రీతో భారత ఆటగాళ్లను సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన సతీమణి సాక్షితో కలిసి సొంతమైదానంలో జరుగుతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. దీంతో కెమెరాలన్నీ ధోనిపైనే ఫోకస్ అయ్యాయంటే అతడి మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్ డ్రెస్‌లో పోలీస్ డ్రెస్‌లో లాఠీ చేతబట్టి సహచరులతో కలిసి ధోని నడుస్తున్నట్లుగా ఉన్న ఆ చిత్రం అభిమానులను కట్టిపడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘సినీ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాడు. సింగం సిరీస్‌లో తదుపరి నువ్వే కథానాయికుడివి. రోహిత్ శెట్టి కన్ను నీపై పడటం ఖాయం భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. MS Dhoni as a police officer in an ad. pic.twitter.com/nleS9DR8bh — Johns. (@CricCrazyJohns) February 2, 2023 అయితే, ధోని ఫ్యాన్స్ మాత్రం.. ‘‘ఏం మాట్లాడుతున్నారు.. హీరోలా ఉండటమేంటి.. నిజ జీవితంలో హీరో తను’’ అని అభిమానం చాటుకుంటున్నారు. కాగా ఈ ఫొటో ఓ టీవీ యాడ్‌కు సంబంధించినదిగా సమాచారం. ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. సైనికుడిగానూ.. ఇక టీమిండియా తరఫున 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన జార్ఖండ్ డైనమైట్ ధోని 17 వేల పరుగులు సాధించాడు. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తలా.. సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కాగా క్రీడా రంగంలో.. ధోని సేవలను గుర్తించిన కేంద్రం అతడికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. సినీ రంగంలో.. ఇదిలా ఉంటే.. ధోని ఇటీవలే సినిమా రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. తమ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను ఇటీవలే విడుదల చేశారు. ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్స్ మ్యారీడ్) పేరిట కోలీవుడ్ సినిమా నిర్మించనున్నారు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న తలా ఇలా అక్కడి సినీ పరిశ్రమపై దృష్టి పెట్టడం గమనార్హం. చదవండి: Joginder Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్ హీరో Ind Vs Aus: నాలుగురన్నరేళ్ల పైనే అయింది.. టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు -
క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు ఇండియాలో లేరు.. అందుకే ఇలా: పాక్ ప్లేయర్
Team India- BCCI: టీమిండియాపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవనంత మాత్రాన తక్కువ చేయాల్సిన పనిలేదని.. ఇప్పటికీ భారత్ గొప్ప జట్టేనని వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలే టీమిండియా విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రధాన కారణమని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! మిగతా బోర్డులకు.. బీసీసీఐకి ఉన్న తేడా అదేనంటూ పీసీబీ అధికారుల తీరును ఉద్దేశించి విమర్శలు చేశాడు. పాక్‌టీవీతో మాట్లాడిన కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదంటూ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఐసీసీ టైటిల్ గెలవడమే ప్రధానం అనుకుంటే.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి జట్లను ఇప్పటికే నిషేధించాల్సింది. ప్రతిసారి మేజర్ ఈవెంట్లలో విజేతగా నిలవాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనా ఇండియా ఇప్పటికీ గొప్ప జట్టే. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్లు వివిధ ఫార్మాట్లలో సత్తా చాటుతూనే ఉన్నారు. భ్రష్టు పట్టించేవాళ్లు లేరు నిజానికి ఇండియాలో దేశవాళీ క్రికెట్‌ను భ్రష్టు పట్టించే వాళ్లు ఎవరూ లేరు. అయితే, గత 7-8 ఏళ్లుగా పాకిస్తాన్లో మాత్రం కొంతమంది పనిగట్టుకుని డొమెస్టిక్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పనితీరుపై ఘాటు విమర్శలు చేశాడు. కాగా 1983, 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్, 2002, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై -
కెప్టెన్సీ అందుకే వదులుకున్నా: ధోని
సాక్షి, స్పోర్ట్స్: క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి సముచిత స్థానం ఉంటుంది. సారథిగా, ఆటగాడిగా ఎన్నొ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కూల్ కెప్టెన్సీతో, బెస్ట్ ఫినిషింగ్‌తో జట్టుకు ఎన్ని చిరస్మరణీయ విజయాలు అంధించాడు. 2014 మెల్బోర్న్ టెస్టు అనంతరం లాంగ్ ఫార్మట్ క్రికెట్ నుంచి తప్పుకున్న ఈ రాంచీ డైనమెట్.. హఠాత్తుగా 2017లో వన్డే, టీ20 క్రికెట్ ఫార్మట్ల సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే అప్పట్లో తీసుకున్న సంచలన నిర్ణయంపై ధోని తాజాగా స్పందించాడు. ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లికి బాధ్యతలు ఆగమేఘాల మీద అప్పజెప్పింది కాదని మిస్టర్ కూల్ వివరించాడు. ‘2019 ప్రపంచ కప్‌కు బలమైన జట్టును తయారు చేసుకోవడానికి కొత్త కెప్టెన్‌కు సమయం కావాలి. ముందు సారథిగా అతను కుదురుకోవాలి. ఆ తర్వాత తన వ్యూహాలకనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాడు. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను సరైన సమయంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాను’ అంటూ ధోని పేర్కొన్నాడు. గతంలో కూడా ధోని ముందు చూపు నిర్ణయాలు భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసాయని, నిజమైన నాయకుడి లక్షణాలు ధోనిలో ఉన్నాయని నెటిజన్లు మాజీ సారథిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ఒక్క చెడ్డ రోజు...!
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి,వెనకటికి ఎవడో సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడ్డాడని సామెత. ప్రతి టోర్నీలోనూ ఎన్ని విజయాలు సాధించిన జట్టుకైనా ఏదో ఒక దశలో ఒక చెడు రోజు ఉంటుంది. దురదృష్టం ఏంటంటే భారత్‌కు అది ఫైనల్ అయింది. టి20 ప్రపంచకప్ మొదటి నుంచి అన్ని లీగ్ మ్యాచ్‌లు, సెమీస్‌లో చెలరేగి ఆడిన భారత్... కీలకమైన ఫైనల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. రెండో ఓవర్లోనే రహానే వికెట్ కోల్పోవడంతో టి20లకు అవసరమైన మెరుపు ఆరంభం దొరకలేదు. దీనికితోడు రోహిత్, కోహ్లి ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడారు. చేతిలో వికెట్లు ఉంటే చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. గతంలో ఈ వ్యూహం భారత్‌కు బాగా పనికొచ్చింది. కానీ ఫైనల్లో యువరాజ్ పుణ్యమాని తేలిపోయాం. ఇక బౌలర్లను పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. లక్ష్యం చిన్నదే కావడంతో వాళ్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లారు. ముఖ్యంగా అశ్విన్ మీద బాగా ఒత్తిడి పెంచారు. అలాగే ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ధోని తొలిసారి విఫలమయ్యాడు. శభాష్ విరాట్... భారత్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి తన క్లాస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. చక్కగా ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధం చేశాడు. ఒక దశలో కోహ్లి సెంచరీ కూడా చేయొచ్చనిపించింది. కానీ యువీ, ధోని కలిసి కోహ్లికి కనీసం సరిగా స్ట్రయికింగ్ కూడా ఇవ్వలేకపోయారు. ఓవరాల్‌గా టోర్నీలో భారత ప్రదర్శన పేలవంగా ఏమీ లేదు. ఒక్క ఫైనల్‌ను మినహాయిస్తే చాంపియన్ తరహా ఆటతీరునే ప్రదర్శించింది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన ధోని... ఈసారి మాత్రం విఫలమయ్యాడు. అయితే ఏమాత్రం అంచనాలు లేకుండా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరడం ద్వారా కాస్త గౌరవంగానే స్వదేశానికి బయల్దేరుతోంది.