ICC Womens World Cup Qualifier
-
క్యాచ్ పట్టేస్తారని మధ్యలో దూరింది; ఔట్ కాదా.. ఇదెక్కడి రూల్
Canadian Cricketer Blatant Cheating.. క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. తన వికెట్‌ను కాపాడుకోవడానికి ఒక బ్యాటర్ చేసిన పని ఆమెను నవ్వులపాలు చేసింది. ఐసీసీ లాంటి టోర్నీల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సగటు క్రికెట్ అభిమానులను ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. విషయంలోకి వెళితే.. ఐసీసీ వుమెన్స్ టి20 ప్రపంచకప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గతవారం కెనడా, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో తొలుత కెనడా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ దివ్య సక్సేనా ఓవర్ మూడో బంతిని గాల్లోకి లేపింది. ప్రత్యర్థి వికెట్ కీపర్ సిందూ శర్మ క్యాచ్ పట్టుకునే ప్రయత్నం చేయగా.. మధ్యలో దూరి కీపర్‌ను క్యాచ్ తీసుకోకుండా అడ్డుపడింది. క్రికెట్ నిబంధనల్లో లా 37.3 ప్రకారం ఒక బ్యాటర్ తాను ఔట్ కాకూడదని ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్‌కు అడ్డురావడం ''అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్'' కింద పరిగణిస్తారు. అలా చేస్తే సదరు బ్యాటర్ ఔట్ అని క్రికెట్ పుస్తకాల్లో ఉంది. కానీ ఇక్కడ మాత్రం దివ్య సక్సేనా ఔట్ కాదంటూ అంపైర్ నిగిల్ డుగ్డిడ్ ప్రకటించడం అందర్ని ఆశ్చర్యపరించింది. ఆ తర్వాత దివ్య సక్సేనా 40 పరుగులు చేయడం.. అనంతరం బ్యాటింగ్ చేసిన అమెరికా 7 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఒకవేళ దివ్య సక్సేనాను అంపైర్ ఔట్ అని ప్రకటించి ఉంటే మ్యాచ్‌ను అమెరికా గెలిచి ఉండేది. చదవండి: Jasprit Bumrah: ఆరు నెలలుగా బయోబబూల్.. మమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ స్పందించాడు.'' క్రికెట్ రూల్స్ ప్రకారం ఇది చీటింగ్ అని అందరికి తెలుసు.. కానీ ఎందుకో వీడియో చూస్తే ఫన్నీగా అనిపించింది.'' అంటూ కామెంట్ చేశాడు. ఇక వీడియో చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''ఆమె అంత చీటింగ్ చేసినా ఔట్ కాదంటా.. ఇదెక్కడి దిక్కుమాలిన రూల్..'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. From last week in Mexico... @usacricket Women loss by 7 runs to Canada. Blatant obstructing the field by opener Divya Saxena off her first ball in the first over of play. Given not out. She went on to make 40 out of Canada's total of 85. pic.twitter.com/WHRbryODSk — Peter Della Penna (@PeterDellaPenna) October 31, 2021 -
టీ20 క్రికెట్ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదు..
ముర్షియా: టీ20 క్రికెట్ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదవుతున్నాయి. ముర్షియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్(యూరోప్ రీజియన్) పోటీలు ఈ పరమ చెత్త రికార్డులకు వేదికగా నిలిచాయి. ఆగస్ట్ 26న మొదలైన ఈ క్వాలిఫయర్ పోటీల్లో యూరోపియన్ మహిళా క్రికెట్ జట్లు ఒకదాని మించి ఒకటి పోటీపడుతూ.. పొట్టి ఫార్మాట్ పరువును బజారుకీడ్చాయి. నెదర్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టీ20ల్లో జరగకూడని ఘోరాలన్నీ జరిగిపోయాయి. ఓ జట్టేమో(జర్మనీ) 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులు మాత్రమే స్కోర్ చేసి అత్యంత జిడ్డు బ్యాటింగ్‌ను ప్రేక్షకులకు రుచి చూపించగా, మిగతా జట్లు తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీ పడి మరీ జిడ్డు ఆటకు బ్రాండ్ అంబాజిడర్లుగా నిలిచి టీ20ల్లో అత్యల్ప స్కోర్లను నమోదు చేసాయి. ఈ జట్లలో ఫ్రాన్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో వరుసగా 33 ఆలౌట్(నెదర్లాండ్‌పై), 45 ఆలౌట్(ఫ్రాన్స్‌పై), 24 ఆలౌట్(ఐర్లాండ్‌పై), 24 ఆలౌట్(స్కాట్లాండ్పై) స్కోర్లు నమోదు చేసింది. ఈ అత్యల్ప స్కోర్లన్నీ అటుఇటు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సాధించినవే కావడంతో క్రికెట్ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఈ జట్టుకు ఐసీసీ పోటీల్లో అనుమతిచ్చింది ఎవడ్రా అంటూ సోషల్‌మీడియలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక స్కాట్లాండ్తో ఫ్రాన్స్ ఆడిన చివరి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ మహిళా జట్టు 17.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 24 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే నమోదైంది. అనంతరం స్కాట్లాండ్ కేవలం14 బంతుల్లోనే మూడు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధించింది. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి.. -
‘సూపర్ సిక్స్’లో దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ
కొలంబో: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో నేటి నుంచి సూపర్‌సిక్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత జట్టు... దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మిథాలీ సేన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టింది. ఇదే జోరుతో ఇప్పుడు పటిష్టమైన సఫారీలతో పోరు కు సై అంటోంది. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ తన బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. బౌలింగ్‌లో ఏక్తా బిస్త్ విశేషంగా రాణిస్తోంది. మరో వైపు ఐసీసీ మహిళల వన్డే బ్యాట్స్‌విమెన్ ర్యాంకుల్లో మిథాలీ రాజ్ ఒక ర్యాంకును మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకింది.