‘సూపర్‌ సిక్స్‌’లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ | India take on South Africa in ICC Women's World Cup Qualifiers | Sakshi
Sakshi News home page

‘సూపర్‌ సిక్స్‌’లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ

Published Wed, Feb 15 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

India take on South Africa in ICC Women's World Cup Qualifiers

కొలంబో: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో నేటి నుంచి సూపర్‌సిక్స్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత జట్టు... దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మిథాలీ సేన క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టింది. ఇదే జోరుతో ఇప్పుడు పటిష్టమైన సఫారీలతో పోరు కు సై అంటోంది. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ తన బ్యాటింగ్‌ బలాన్నే నమ్ముకుంది. బౌలింగ్‌లో ఏక్తా బిస్త్‌ విశేషంగా రాణిస్తోంది. మరో వైపు ఐసీసీ మహిళల వన్డే బ్యాట్స్‌విమెన్‌ ర్యాంకుల్లో మిథాలీ రాజ్‌ ఒక ర్యాంకును మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement