Ichata Vaahanamulu Nilupa Raadhu Movie
-
ఆహాలో స్ట్రీమింగ్ కానున్న మరో సూపర్ హిట్ మూవీ, ఎప్పుడంటే..?
సూపర్ హిట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలను సైతం టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చెస్తోంది. ఇలా వరుస సినిమాలు, వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ దూసుకెళ్తున్న ఆహా.. తాజాగా మరో సూపర్ హిట్ మూవీని విడుదల చేయబోతుంది. (చదవండి: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ రివ్యూ) టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ నటించిన తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఎస్. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. జెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17న ఆహాలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. -
ఇచ్చట వాహనములు నిలుపరాదు టీం తో సరదా ముచ్చట్లు
-
ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ టీం తో ముచ్చట్లు
-
Ichata Vahanamulu Nilupa Radu Review: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రివ్యూ
-
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇచ్చట వాహనములు నిలుపరాదు జానర్ : రొమాంటింగ్ యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : సుశాంత్, మీనాక్షి చౌదరి,వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం తదితరులు నిర్మాణ సంస్థలు :ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ నిర్మాతలు : రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల దర్శకత్వం : ఎస్. దర్శన్ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్ ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్ విడుదల తేది : ఆగస్ట్ 27,2021 టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం కాలం దాటింది. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడనే చెప్పాలి. తొలి సినిమా కాళిదాసుతో పాటు కరెంట్, అడ్డా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా, సుశాంత్‌కు మాత్రం స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయాయి. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో.. ‘చిలసౌ’తో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు సుశాంత్ నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ సుశాంత్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. హీరోగా చేసినా రాని గుర్తింపు ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడంతో ద్వారా వచ్చింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అక్కినేని హీరో.. తాజాగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. కరోనా వైరస్ కారణంగా దాదాపు పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(ఆగస్ట్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సుశాంత్ అందుకున్నాడా? లేదా?, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన సుశాంత్‌ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారు? సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సుశాంత్‌కు మరో హిట్‌ని తనఖాతాలో వేసుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే హైదరాబాద్‌కు చెందిన అరుణ్ (సుశాంత్) ఒక ఆర్కిటెక్ట్. అతను పనిచేసే ఆఫీస్‌లోనే మీనాక్షి అలియాస్ మీను (మీనాక్షి చౌదరి) కూడా ఎంప్లాయ్‌గా జాయిన్ అవుతుంది. తొలి చూపులోనే మీనాక్షితో ప్రేమలో పడిపోతాడు అరుణ్. ఆమె కోసం డ్రైవింగ్ నేర్చుకొని మరీ కొత్త బైక్‌ని కొంటాడు. ఒక రోజు మీనాక్షి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని, కొత్త బైక్ వేసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు అరుణ్. అదే సమయంలో ఆ ఏరియాలో ఓ సీరియల్ నటిపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఇది అరుణే చేశాడని భావించి ఆ ఏరియా జనాలంతా అరుణ్ కోసం వెతకడం ప్రారంభిస్తారు. వారిని నుంచి అరుణ్ ఎలా తప్పించుకున్నాడు? అరుణ్‌ని కాపాడడం కోసం మీనాక్షి ఏం చేసింది? అసలు సీరియల్ నటిపై హత్యాయత్నం చేసిందెవరు? పులి(ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందులోకి నర్సింహ యాదవ్(వెంకట్) ఎలా ఎంటర్ అయ్యాడు? ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’అనే టైటిల్‌కి ఈ కథకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? అరుణ్ పాత్రలో సుశాంత్ అద్భుత నటనను ప్రదర్శించాడు. డాన్స్‌తో పాటు ఫైటింగ్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. గత తన సినిమాల్లో కంటే ఇందులో సుశాంత్ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. ఇక మీను పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఓ ఏరియా కార్పొరేటర్‌గా వెంకట్ పర్వాలేదనించాడు. హీరో ప్రాణ స్నేహితుడు పులి పాత్రలో ప్రియదర్శి అద్భుత నటనను కనబర్చాడు. బైక్ షోరూం ఎంప్లాయ్‌గా వెన్నెల కిశోర్ తనదైన కామెడితో నవ్వించే ప్రయత్నం చేశాడు.అభినవ్ గోమతంతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’అనే కొత్త టైటిల్ పెట్టి సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు దర్శన్.. కథనంలో మాత్రం కొత్తదనం లేకుండా, సాదాసీదాగా నడిపించాడు. కథలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో కొన్ని అనవసరపు సీన్స్‌ని అతికించి అతి కష్టం మీద రెండున్నర గంటల పాటు సినిమాను లాగాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అసలు సస్పెన్స్‌ని ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక సెకండాఫ్‌లో అయినా ఆకట్టుకునే అంశాలేమైనా ఉంటాయకునే ప్రేక్షకుడికి అక్కడా నిరాశే ఎదురవుతుంది. సినిమాలో చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. కానీ, నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్న దర్శకుడి ఆలోచనను ప్రశంసించాల్సిందే. ఇక ఈ సినిమా ప్రధాన బలం ఏదైనా ఉందంటే అని ప్రవీణ్ లక్కరాజు సంగీతమనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ చాలా చోట్ల తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకం ఉంది: సుశాంత్
సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకత్వంలో లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సుశాంత్ మీడియాతో ముచ్చటించారు. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ మూవీ గురించి ఆయన మాటల్లో విందాం.. ⇔ చిలసౌ సినిమాను బన్నీ ఫస్ట్ చూశారు.. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. ఆయన ఆ సినిమాను చూసిన వెంటనే ఫోన్ చేశారు. అలా అప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు చాన్స్ ఇచ్చారు. అలా చిలసౌ ద్వారా అల వైకుంఠపురములో వచ్చింది.. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన వాటిని చేస్తూ ఉన్నాను. ⇔ చిలసౌ విడుదలకంటే ఓ రెండు నెలల ముందే ఈ కథను డైరెక్టర్ దర్శన్ వినిపించారు. నూటొక్క జిల్లాల అందగాడు సాగర్.. హరీష్ ప్రొడ్యూసర్ ద్వారా దర్శన్‌ను పంపించారు. కాలనీలో జరిగే సంఘటనలు.. తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన సంఘటనలు అని కథను నెరేట్ చేశారు. చిలసౌ కంటే ముందే ఈ కథను చేస్తాను అని చెప్పాను. కానీ మధ్యలో అల వైకుంఠపురములో చేశాను. నాకోసం చాలా వెయిట్ చేశారు. ఈ కథకు నిరంజన్ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఆయన బిజీగా ఉండటం వల్ల అది సెట్స్ మీదకు వెళ్లలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వింటాను అని నిరంజన్ రెడ్డి గారిని నేను అడిగాను. ఈ కథ నాకైతే బాగుంటుందని ఆయన కూడా చెప్పారు. అలా ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇంతకు ముందు విన్నట్టు ఎక్కడా అనిపించలేదు. కాంప్లికేటెడ్ కథ అయితే కాదు.. ఎంతో రియలిస్టిక్ ఉంటుంది. ఎంటర్టైనింగ్గానూ ఉంటుంది. కమర్షియల్ టచ్ కూడా ఉంటుంది. ⇔ ఫిబ్రవరి 1న ప్రారంభించినా.. మార్చి 15 వరకు చాలానే పూర్తి చేసేశాం. జూన్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. కృష్ణా నగర్లో ఒక్కరోజు షూటింగ్ మాత్రమే మిగిలింది. కానీ లాక్డౌన్ ముగిసిన తరువాత వెళ్తే అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. సినిమా మీదున్న పాజిటివ్ వైబ్ మమ్మల్ని నడిపించింది. ఫస్ట్ లాక్డౌన్ మామూలుగా గడిచింది. అయితే జనవరిలో వద్దామని అనుకున్నాం కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది. ఆ తరువాత మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. అది చాలా కష్టంగా గడిచింది. ఓటీటీ ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఓపెన్ అవుతాయో లేదో.. జనాలు వస్తారో లేదో అనే అనుమానాలు వచ్చాయి. నిర్మాతలను కూడా ఎక్కువగా ఒత్తిడి పెట్టలేం. వాళ్లు కూడా సినిమాను నమ్మి.. థియేటర్లోనే చూడాల్సిన సినిమా అని వెయిట్ చేశారు. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఆఫర్‌తోనే నిర్మాతలు సేఫ్ అయ్యారు. అందుకే మేం కూడా విడుదలకు సిద్దమయ్యాం. ⇔ సినిమా సక్సెస్ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ వర్క్. ఈ సినిమాను దాదాపు 50 మందికి చూపించాం. అందరూ బాగానే ఉందని అన్నారు. డిజిటల్ ఆఫర్ ఇచ్చిన వారు కూడా సినిమాను చూసే తీసుకున్నారు. కొన్ని సీన్స్ గుర్తుండిపోయాయని అందరూ అన్నారు. ఈ చిత్రంలో ప్రతీ ఒక్క క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. మా వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ఇక జనాలు తీర్పునివ్వాలి. ⇔ ముందు తమిళ్లో టైటిల్ చెప్పారు. నో పార్కింగ్ అని అనుకున్నాం. కానీ తెలుగులో ఉండాలని.. ఇచ్చట వాహనములు నిలుపరాదు అని అనుకున్నాం. అందరూ కూడా టైటిల్ బాగా ఉందని అన్నారు. తెలుగు వచ్చినా, రాకపోయినా కూడా అందరికీ అర్థం అవ్వాలని నో పార్కింగ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టేశాం. ⇔ రుహానీ శర్మ ఓ వర్క్ షాప్ గురించి చెప్పారు. అప్పుడు ముంబైకి వెళ్తే అక్కడ మీనాక్షి చౌదరి కనిపించారు. ఆమె మిస్ ఇండియా అని నాకు తెలీదు. నేను యాక్టర్ అని ఆమెకు కూడా తెలీదు. అయితే అక్కడ క్లాస్‌లో ఓ టఫ్ సీన్ చేశారు. తెలుగు సినిమాలో చాన్స్ వస్తే చేస్తారా? అని అడిగాను. అలా మీనాక్షి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె టాలెంట్‌కు కచ్చితంగా బిజీ అవుతుందని అనుకున్నాను. కానీ ఈ మూవీ విడుదల కాకముందే.. తమిళ, తెలుగు, హిందీలో ఆఫర్లు వచ్చేశాయి. ⇔ నేను ఎప్పుడూ సినిమాలు త్వరగానే పూర్తి చేయాలని అనుకుంటాను. అల వైకుంఠపురములో సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల ఈ మూవీ లేట్ అయింది. అల వైకుంఠపురములో, ఇచ్చట వాహనములు రెండు కూడా ఒకే సంవత్సరంలో వస్తాయని అనుకున్నాను. కానీ పాండమిక్ వల్ల అది మిస్ అయింది. *ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్ ఇవన్నీ ఎంత ముఖ్యమో ఈ పాండమిక్ వల్ల తెలుసుకున్నాను. ఒత్తిడిగా ఫీలవ్వడం కంటే.. మనం మన వాళ్లతో, మనం ప్రేమించే వాళ్లతో ఉన్నామని అనుకోవడం బెటర్. మెడిటేషన్ చేయడం ప్రారంభించాను. పియానో నేర్చుకున్నాను. కుకింగ్ కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అలా అని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కుతుంది. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. ⇔ త్రివిక్రమ్, బన్నీ ఇద్దరి కెమిస్ట్రీ, ర్యాపో బాగుంటుంది. ఆయన ఒకటి చెబుతారు.. ఈయన ఇంకోటి యాడ్ చేస్తారు. సీన్లు ఇంప్రూవ్ చేస్తుంటారు. నాకు సరదాగా అనిపిస్తుంటుంది. సెట్ అంతా కూడా సందడిగా ఉంటుంది. పెళ్లిపై సుశాంత్ ఏమన్నాడంటే.. ⇔పెళ్లి కూడా సినిమాలానే నేను ఏదీ ప్లాన్ చేయలేదు. అలాంటి వాళ్లను ఇలాంటి వాళ్లను చేసుకోవాలని అనుకోలేదు. కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకోవాలని అనుకున్నాను. నా ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి చేయరు. ⇔ ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని, చాలా నవ్వుకున్నామని అన్నారు. ఎంటర్టైనింగ్గా ఉందని చెప్పారు. చాలా ఓపెన్ అయ్యావని అన్నారు. కామెడీ టైమింగ్, స్పాంటేనిటీ బాగుందని అన్నారు ఆఫీస్‌లో ఎవ్వరూ లేనప్పుడు డ్యాన్స్ చేస్తుంటాను. ఇంత వరకు ఏ సినిమాలోనూ అలా చేయలేదు. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడని అన్నారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్. ⇔ చాలా కథలు విన్నాను. కానీ ఓ ద్విభాష కథ బాగా నచ్చింది. ఎన్ని విన్నా కూడా మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. అది చిలసౌ, ఇచ్చట వాహనములు నిలుపరాదకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడే వివరాలేవీ చెప్పలేను. -
ఆగస్ట్ చివరి వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే
కరోనా వల్ల థియేటర్లు పూర్తిక తెరచుకోని కారణంగా పలు చిత్రాలు ఇప్పటికీ ఓటీటీ బాటలోనే ముందుకెళ్తున్నాయి. కొన్ని సినిమాలు దైర్యం చేసి థియేటర్లలోకి వచ్చినప్పటికీ ఓటీటీల హవా తగ్గడంలేదు. వారానికి అరడజనుకు పైగా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. మరి ఈ ఆగస్ట్ చివరివారంలో ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి.ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. ఇచట వాహనములు నిలుపరాదు యంగ్ హీరో సుశాంత్ నటించిన తాజా సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.ఎస్.దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు . కమర్షియల్ అంశాలతో అలరించే పూర్తి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. హౌజ్ అరెస్ట్ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్ కలిసి నటించిన చిత్రం ‘హౌజ్ అరెస్ట్’. శేఖర్ రెడ్డి యర్నా దర్శకుడు. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం ఇది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.ఈ మూవీ కూడా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాహ భోజనంబు హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’ కూడా ఆగస్ట్ 27న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఒటిటి సోనీలైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ ఆహా ఎస్.ఆర్ కల్యాణమండపం (ఆగస్టు 27) అమెజాన్ ప్రైమ్ స్టాండప్ షార్ట్స్ (ఆగస్టు 26) ద కొరియర్ (ఆగస్టు 27) సోనీ లైవ్ వివాహ భోజనంబు (ఆగస్టు 27) కసడా తపరా (ఆగస్టు 27) నెట్‌ఫ్లిక్స్ అన్‌టోల్డ్ (ఆగస్టు 24) పోస్ట్ మార్టమ్ (ఆగస్టు 25) భూమిక (ఆగస్టు 26) హీజ్ ఆల్ దట్ (ఆగస్టు 27) జీ 5 ఇంజినీరింగ్ గర్ల్స్ (ఆగస్టు 27)