
సూపర్ హిట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలను సైతం టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చెస్తోంది. ఇలా వరుస సినిమాలు, వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ దూసుకెళ్తున్న ఆహా.. తాజాగా మరో సూపర్ హిట్ మూవీని విడుదల చేయబోతుంది.
(చదవండి: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ రివ్యూ)
టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ నటించిన తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఎస్. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. జెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17న ఆహాలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment