పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-3 ఫైనల్ లిస్ట్
‘‘కొత్త దర్శకులను ప్రోత్సహించడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ - పూరి జగన్నాథ్ నిర్వహించిన ఈ లఘుచిత్రాల పోటీ అద్భుతమైన ప్రయత్నం. ఐడియా-3కి నేను న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. ఇందులో 90 కి పైగా పోటీకి వచ్చాయి. వాటిని మూడు విభాగాలుగా చేసి, ఫైనల్‌గా మూడింటిని సెలక్ట్ చేశాను. కానీ ఇవి చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కళకు సంబంధించిన ఏ అంశం అయినా జనరంజకంగా తీయాలి. లేకపోతే ఫెయిలవుతాయి. ఈ లఘుచిత్రాలు చూసేటప్పుడు నాకు అదే అనిపించింది. ఎడిటింగ్, డబ్బింగ్, డైలాగ్ డెలివరీ... ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో కొంత మంది జాగ్రత్తలు పాటించలేదు. ఈ కాన్సెప్ట్‌లో మెరుపుతీగ లాంటి అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలి. కానీ కాస్టింగ్‌లో చాలా మంది శ్రద్ధ చూపించలేదు. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలి. లేకపోతే ఎంత పెద్ద సినిమాకైనా భంగపాటు తప్పదు. ఈ లఘు చిత్రాలు చూస్తున్నప్పుడు మళ్లీ అదే విషయం నిరూపణ అయింది. కొంత మంది టెక్నికల్‌గా చాలా బాగా తీశారు. డైలాగ్ చెప్పేటప్పుడు టైమింగ్, వెరైటీ ఉండాలి. ఈ విభాగంలో చాలా సినిమాలు అస్సలు నాణ్యతతో తీయలేదు. కొన్ని సినిమాలైతే చాలా పేలవంగా ఉన్నాయి.
మనం ఏమైతే ఇప్పటిదాకా సినిమాలు చూశామో, వాటన్నిటి అనుభవం మనం తీయబోయే సినిమాల్లో కనబడాలి. కానీ చాలా అపరిపక్వతతో తీసిన సినిమాల్లా అనిపించాయి. ‘యాపిల్‌తో నా ప్రేమకథ’ అయితే చాలా బాగా తీశారు. కథను ఊహకు అతీతంగా తెరకెక్కించారు. హీరో, హీరోయిన్లు చాలా బాగున్నారు. ‘ఇప్పుడే మొదలైంది’, పూరి ఐడియా-3 చాలా బాగున్నాయి. ఇవి కాక, మరో రెండింటిని స్పెషల్ కేటగిరీ కింద ఎంపిక చేశాను. అందరికీ అభినందనలు.’’
- వి.ఎన్. ఆదిత్య, దర్శకులు
ఐడియా నం.3
జ్యూరీ మెంబర్: వి.ఎన్. ఆదిత్య
1) ఆపిల్‌తో నా ప్రేమకథ
దర్శకుడు: శ్రీనివాస్ పుప్పాల
sri.puppala@gmail.com
2) ఇప్పుడే మొదలైంది
దర్శకుడు: రాజా. జె
csensemovies@gmail.com
3) పూరి ఐడియా-3
దర్శకుడు: నాని వూళ్ల
voola99@gmail.com
స్పెషల్ జ్యూరీ
1) టాప్ సీక్రెట్
దర్శకుడు: భాగ్యరాజు. జి
bhagyaraju.gowdara@gmail.com
2) వార్ లాక్ టార్గెట్
దర్శకుడు: ఎన్వీఆర్ సాయికిరణ్
saikishore0007@gmail.com
ఈ లఘు చిత్రాలను
sakshi.comలో వీక్షించండి.