Identical twins
-
ఒకే కాన్పులో జంట కవలలు, కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా!
కవలలను సాకడం తల్లిదండ్రులకు ఎంతో కష్టం. అలాంటిది ఒకేసారి కవలల జంట పుడితే! బాప్రే అనుకుంటున్నారా? అలాంటి అరుదైన ఘటన బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో జరిగింది. యాష్లీ నెస్ అనే మహిళకు ఒకే కాన్పులో ఒకేతీరుగా ఉన్న ఇద్దరు కవలల (ఐడెంటికల్ ట్విన్స్) జంట జన్మించారు. ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు... మొత్తానికి నలుగురు పిల్లలు జూలై 28న పుట్టారు. కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇచ్చిన కాన్పు తేదీ కంటే.. పన్నెండువారాలు ముందుగా పుట్టారు. ఇలాంటి ‘కోటిలో ఒక్కరు’ఇంతకుముందు కూడా జరిగాయి. కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ... 15 నిమిషాల తేడాతో కవలలకు జన్మనిచ్చింది. ముందుగా బాబు 2021 డిసెంబర్ రాత్రి 11.45 గంటలకు జన్మిస్తే... 15 నిమిషాల తరువాత.. అంటే 2022 జనవరి ఒకటిన అర్ధరాత్రి పన్నెండుకు పాప జన్మించింది. ఇండియానాలోనూ 2019 డిసెంబర్ 31న ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది... కాకపోతే పిల్లలిద్దరికి అర్థగంట తేడా అన్నమాట. -
విషాదం: 25వ అంతస్తు నుంచి పడి కవలలు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవల సోదరులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తొమ్మిదవ తరగతి చదువుతున్న సత్యనారాయణ, సూర్యనారాయణ ఇద్దరు కవలలు. వీరికి మరో సోదరి కూడా ఉంది. చెన్నైకి చెందిన వీరు రెండు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఘజియాబాద్ వచ్చారు. అక్కడ సిద్ధార్థ్ విహార్ కాంప్లెక్స్‌లో 25వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం ముగించుకుని.. తల్లి మొబైల్ తీసుకుని ఆన్లైన్ క్లాస్ విన్నారు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి కూర్చుని మొబైల్లో గేమ్స్ ఆడసాగారు. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..?) తల్లి వచ్చి పడుకోమని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లారు కవల సోదరులు. తల్లి నిద్రపోయిన తర్వాత తిరిగి బాల్కనీలోకి వచ్చారు ఇద్దరు సోదరులు. అర్థరాత్రి 1 గంట సమయంలో ఇద్దరు సోదరులు 25వ అంతస్తు నుంచి పడి.. మృతి చెందారు. కాసేపటి తర్వాత తల్లి లేచి పిల్లల కోసం వెతికింది. బాల్కనీ తలుపు తీసి ఉండటంతో అక్కడకు వెళ్లి చూసింది.. కానీ కనిపించలేదు. కింద జనాలు గుంపులుగా చేరడం చూసి అక్కడకు వెళ్లింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం చూసి ఒక్కనిమిషం ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. (చదవండి: వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ) కింద రక్తపు మడుగులో తన ఇద్దరు కుమారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. బిడ్డల మృతదేహాలను పట్టుకుని గుండెలవిసేలా ఏడ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి.. కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సత్య, సూర్యల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాల్కనీలో మాకు ప్లాస్టిక్ చైర్, దాని మీద ఓ కూర్చి కనిపించింది. చంద్రుడిని చూడాలని భావించి.. ఇలా ఏర్పాటు చేసుకుని ఉంటారు. కానీ దురదృస్టవశాత్తు పైనుంచి కిందపడి మరణించి ఉంటారని భావిస్తున్నాం. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి’’ అని తెలిపాడు. చదవండి: 70 ఏళ్ల తర్వాత కలుసుకుని.. అరుదైన రికార్డు సృష్టించిన కవలలు -
70 ఏళ్ల తర్వాత కలుసుకుని.. అరుదైన రికార్డు సృష్టించిన కవలలు
టోక్యో: జపాన్‌కు చెందిన 107 ఏళ్ల అక్కాచెల్లెళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డులకెక్కారు. ఉమెనొ సుమియామ, కౌమె కొడమ అనే ఈ తోబుట్టువుల వయస్సు 107 ఏళ్ల 330 రోజులని ‘గిన్నిస్’సోమవారం తెలిపింది. వీరు ప్రపంచంలోనే జీవించి ఉన్న కవలల్లో అత్యంత వృద్ధులని పేర్కొంది. ఇప్పటి వరకు జపాన్‌కే చెందిన కిన్ నరిటా, జిన్ కానీ అనే కవలల పేరిట ఉన్న 107 ఏళ్ల 75 రోజుల రికార్డును ఈ సోదరీమణులు బద్దలు కొట్టారు. జపాన్‌లోని షొడొషిమా దీవిలో 1913 నవంబర్ 5వ తేదీన జన్మించిన వీరు చిన్నతనంలోనే వేరు పడిపోయారు. (చదవండి: విస్కీ బాటిల్ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా) దాదాపు 70 ఏళ్లు వచ్చే వరకు వేర్వేరు చోట్ల గడిపారు. అనంతరం ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేసి, 88 షికోకు ఆలయాలను సందర్శించుకున్నారు. ఎక్కువ రోజులు జీవించి, గత రికార్డులను బద్దలు కొట్టడంపై వీరిద్దరూ తరచు జోకులు వేస్తుంటారని కుటుంబసభ్యులు చెప్పారు. హాస్యచతురత, పెద్దరికం వీరిని 1990ల నుంచి పెద్ద సెలబ్రిటీలుగా మార్చేసింది. అందరూ వీరిని కిన్–సన్, జిన్–సన్ అని ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో ఉంటున్నారు. వీరి ఘనతను ప్రశంసిస్తూ గిన్నిస్ సంస్థ కొత్త రికార్డు సర్టిఫికెట్లను సోమవారం ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ డే’సందర్భంగా మెయిల్ ద్వారా పంపించింది. ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ డే’జపాన్‌లో జాతీయ సెలవుదినం. జపాన్ 12.5 కోట్ల జనాభాలో 29% మంది 65 ఏళ్లు, ఆపైని వారే. చదవండి: అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్ ట్విన్స్ -
ఏకరూప కవలల వేలిముద్రలు మారిపోతాయా?
సాక్షి, న్యూఢిల్లీ: వేలిముద్రలు లేదా ఫింగర్ ప్రింట్స్ మన జీవన విధానంలో వీటికున్న ప్రాధాన్యత చాలా కీలకం. జీవి గుర్తింపుకు ప్రతీకలివి. అందుకే నేరస్తులను పట్టుకోవడంలో వేలిముద్రలు ప్రధాన సాక్క్క్ష్యాలుగా మారిన ఉదాహరణలు ఎన్నో..ఎందుకంటే ఈ భూమిపై ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. మరి ఒకే డీఎన్ఏను పంచుకున్న ఏక రూప కవలల ఫింగర్ ప్రింట్స్ మాటేమిటి? లేదా వేరు వేరుగా ఉంటాయా? మధ్యలో మారిపోతాయా? ఈ వేలిముద్రల ఆసక్తికర విషయాలగురించి తెలుసుకుందాం.. ఆధునిక సమాజంలో వ్యక్తి గుర్తంపునుంచి ఆఫీస్ అటెండెన్స్ నుంచి..అంతా ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టంతోనే నడుస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకరితో ఒకరికి సరిపోలవు. అంతేకాదు ఒకే వ్యక్తికి సంబంధించిన ఏ రెండు వేళ్ళ ముద్రలు కూడా ఒకేలా ఉండవు, వాటిని ఎవరూ దొంగిలించలేరు కూడా. ఎందుకో తెలుసా..! జన్యుపరమైన నిర్మాణాన్ని అనుసరించి వేళ్లపై ఉండే గీతలు రూపొందుతాయి కాబట్టి. మరి ఒకే డీఎన్ఏను పంచుకునే ఏక రూప కవలల ఫింగర్ ప్రింట్స్ విషయమేంటి? వారి వేలి ముద్రలు ఒకేలా ఉంటాయా? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా..ఏక రూప కవలలను మోనోజెనెటిక్ ట్విన్స్ అనికూడా అంటారు. అంటే ఒకే అండం (జైగోట్) నుంచి అభివృద్ధి చెంది, పెరెంట్స్ నుంచి దాదాపుగా ఒకే జన్యువులను పంచుకుని ఒకేలా కనిపించే కవలలు అన్నమాట! సమరూపజీవులకు ఒకే గర్భం సమానంగా స్థలాన్ని పంచినా, జెనెటిక్ నిర్మాణాన్ని మాత్రం వంద శాతం సమానంగా ఒకేలా పంచదని పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైవ్ సైన్స్ విభాగం గతంలో వెల్లడించింది. ఏదిఏమైనప్పటికీ.. ఏకరూపకవలల ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవని ఫోరెన్సిక్ సైంటిస్ట్ సిమోనా ఫ్రాన్సిస్ (షిఫీల్డ్ హల్లామ్ యూనివర్సిటీ ) స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉన్నట్టు నిరూపించబడలేదు. వేళ్ళపై ఉండే రిడ్జ్ ప్యాట్రన్ మార్పుకు కేవలం డీఎస్ఏ మాత్రమే కారణం కాదు. గర్భంలోని భిన్న వాతావరణ కారకాలు కూడా వేలి ముద్రల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా అభివృద్ధి చెందిన గర్భస్థ శిశువుకు 13 నుంచి 19 వారాల వ్యవధిలో వేలి ముద్రలు రూపొందుతాయి. ఈ సమయంలో గర్భం వైశాల్యం, బొడ్డు తాడు పొడవు, తల్లి నుంచి సంక్రమించే పోషకాల స్థాయి.. వేలి ముద్రల నిర్మాణంలో ప్రభావం చూపుతాయి. కవలలు పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేలి ముద్రలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మారే అవకాశం కూడా ఉంది. అంటే.. చర్మ స్వభావం, మచ్చలు, కాలిన గాయాలు, వాడే మందులు వంటి అరుదైన పరిస్థితుల్లో వేలి ముద్రలు మారతాయని ఫ్రాన్సిస్ తెలిపారు. ఏకరూప కవలలు తమ పేరెంట్స్‌ను, ఫ్రెండ్స్‌ను.. ఇతరులను మోసం చేయవచచ్చునేమో కానీ, వేలి ముద్రలు మాత్రం పట్టించేస్తాయి. -
అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్ ట్విన్స్
బ్రెజిల్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఐడెంటికల్ ట్విన్స్.. జెండర్ కన్ఫర్మేషన్ సర్జరీ(లింగమార్పిడి సర్జరీ)తో ఆడవాళ్లుగా మారారు. ఈ సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆగ్నేయ బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ మాల్యా, సోఫియాలు పుట్టుకతో అబ్బాయిలు. అయితే పెరుగుతున్న కొద్ది వారిలో మార్పులు చోటు చేసుకోసాగాయి. అబ్బాయిలుగా కంటే అమ్మాయిలుగా తమను గుర్తించుకోవటానికే ఇష్టపడేవారు. తమను అమ్మాయిలుగా మార్చేయమని దేవుడ్ని ప్రార్థించేవారు. లింగమార్పిడి సర్జరీ ద్వారా అమ్మాయిలుగా మారాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇందుకు వారి ఫ్యామిలీనుంచి కూడా సపోర్ట్ దొరికింది. వీరి తాతయ్య ఆపరేషన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు సహాయం చేశాడు. వారం క్రితం వీరిద్దరికీ ఓ రోజు తేడాతో లింగమార్పిడి సర్జరీ జరిగింది. దీనిపై మాల్యా మాట్లాడుతూ.. ‘‘నాకు నా శరీరం అంటే చాలా ప్రేమ, కానీ, నా జననాంగాన్ని ఇష్టపడేదాన్ని కాదు. నన్ను అమ్మాయిగా మార్చేయమని దేవుడ్ని ప్రార్ధించే దాన్ని’’ అని పేర్కొంది. చదవండి : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి.. కోపంతో నా ఫ్రెండ్ ముక్కు పగులగొట్టా: ఒబామా -
ఆ కవలలు సెంచరీ కొట్టేశారు..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన కవల సోదరులు సెంచరీ కొట్టేశారు. ఈ కవలలు క్రికెటర్లు అని భావించారంటే మీరు తప్పులో కాలేసినట్లే. సాధారణంగా అన్నదమ్ముళ్లు కొన్నేళ్ల వరకు కలిసి ఉండటం, ఆ తర్వాత ఆస్తితగాదాల వంటి విషయాలతో వేరు పడి ఉండటం చూస్తుంటాం. అయితే అమెరికా కొలరెడోకు చెందిన ఈ ఏకరూప కవలలు అల్బర్ట్, ఎల్మర్ వందేళ్లు గడుస్తున్నప్పటికీ ఎంతో అప్యాయతతో ఉంటున్నారు. మార్చి 15న తమ 100వ జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకున్నారు. దేవుడు తమకు చూపించిన దారిలో నడుస్తున్నామని, చిన్నప్పుడు గోల్ఫ్ కోర్టులో ఎక్కవ టైం గడిపేవారిమని చెప్పారు. మిచిగాన్ లోని సాగినౌలో మార్చి15, 1916లో వీరు జన్మించారు. ఈ ఇద్దరిలో అల్బర్ట్ పెద్దవాడు. ఎల్మర్ కంటే 15 నిమిషాల ముందే ఈ ప్రపంచంలోకి వచ్చేశాడు. అల్బర్ట్ కొలరెడోలో నివాసం ఉంటుండగా, ఎల్మర్ అరిజొనాలో నివసిస్తున్నాడు. తమ 100వ బర్త్ డే సందర్భంగా ఈ అన్నదమ్ములు కలిసి సంబరాలు జరుపుకున్నారు. స్కూలుకు వెళ్లే రోజుల్లో ఒకరికి బదులు మరొకరం వెళ్లి టీచర్లను కంగారు పెట్టేవాళ్లమని కవలలు చెబుతున్నారు. డ్రైవింగ్ కూడా ఒకే కారుతో, ఒకే సమయంలో నేర్చుకున్నామంటూ తమ అనుభవాలను, చిన్ననాటి జ్ఞాపకాలు, తమ అల్లరిని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. అల్బర్ట్ కు సంతానం ముగ్గురు కాగా, 7 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండగా.. 14 మంది ముని మనవడు, వారి వారసులు కూడా ఇద్దరు ఉన్నారు. ఎల్మర్ కు కూడా సంతానం ముగ్గురు ఉండగా, మనవడు-మనవరాళ్లు కలిపి ఆరుగురు, ముని మనవళ్లు నలుగురు ఉన్నట్లు వారు తమ వివరాలను చెప్పుకొచ్చారు.