
ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డులకెక్కిన అక్కాచెల్లెళ్లు ఉమెనొ సుమియామ, కౌమె కొడమ
టోక్యో: జపాన్‌కు చెందిన 107 ఏళ్ల అక్కాచెల్లెళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డులకెక్కారు. ఉమెనొ సుమియామ, కౌమె కొడమ అనే ఈ తోబుట్టువుల వయస్సు 107 ఏళ్ల 330 రోజులని ‘గిన్నిస్’సోమవారం తెలిపింది. వీరు ప్రపంచంలోనే జీవించి ఉన్న కవలల్లో అత్యంత వృద్ధులని పేర్కొంది. ఇప్పటి వరకు జపాన్‌కే చెందిన కిన్ నరిటా, జిన్ కానీ అనే కవలల పేరిట ఉన్న 107 ఏళ్ల 75 రోజుల రికార్డును ఈ సోదరీమణులు బద్దలు కొట్టారు. జపాన్‌లోని షొడొషిమా దీవిలో 1913 నవంబర్ 5వ తేదీన జన్మించిన వీరు చిన్నతనంలోనే వేరు పడిపోయారు.
(చదవండి: విస్కీ బాటిల్ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా)
దాదాపు 70 ఏళ్లు వచ్చే వరకు వేర్వేరు చోట్ల గడిపారు. అనంతరం ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేసి, 88 షికోకు ఆలయాలను సందర్శించుకున్నారు. ఎక్కువ రోజులు జీవించి, గత రికార్డులను బద్దలు కొట్టడంపై వీరిద్దరూ తరచు జోకులు వేస్తుంటారని కుటుంబసభ్యులు చెప్పారు. హాస్యచతురత, పెద్దరికం వీరిని 1990ల నుంచి పెద్ద సెలబ్రిటీలుగా మార్చేసింది. అందరూ వీరిని కిన్–సన్, జిన్–సన్ అని ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో ఉంటున్నారు. వీరి ఘనతను ప్రశంసిస్తూ గిన్నిస్ సంస్థ కొత్త రికార్డు సర్టిఫికెట్లను సోమవారం ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్‌డ్ డే’సందర్భంగా మెయిల్ ద్వారా పంపించింది. ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్‌డ్ డే’జపాన్‌లో జాతీయ సెలవుదినం. జపాన్ 12.5 కోట్ల జనాభాలో 29% మంది 65 ఏళ్లు, ఆపైని వారే.
Comments
Please login to add a commentAdd a comment