యూవీసీ లైట్ల కాంతితో నాణ్యమైన ద్రాక్ష
రసాయన పురుగుమందులకు బదులు అల్ట్రావయోలెట్ లైట్లను ఉపయోగించి ద్రాక్ష చెట్ల సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో స్పెయిన్లోని అండలూసియా వ్యవసాయ పరిశోధన శిక్షణా సంస్థ (ఐఎఫ్ఏపీఏ) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. చెట్లకు ఉన్న ద్రాక్ష కాయలను మూడు రోజుల పాటు.. రోజూ 5 నిమిషాలు యూవీసీ లైట్ల ప్రభావానికి గురయ్యేలా చేశారు. వీటిని కేవలం ఐదు నిమిషాలు యూవీసీ లైట్ల కాంతికి గురైన ద్రాక్షతో పోల్చి చూసినప్పుడు.. మొక్కల పెరుగుదలకు ముఖ్యమైన స్టిల్బెనాయిడ్ అనే జీవరసాయనం సాంద్రతలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అంతేగాక కాయల ఆకృతి, రంగు కూడా బావున్నట్టు పరిశోధకులు గుర్తించారు.