ప్రసాద్ రెడ్డి హత్యపై పోలీసు అధికారుల్లో చలనం
అనంతపురం: జిల్లాలోని రాప్తాడులో సంచలనం సృష్టించిన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల్లో చలనం మొదలైంది. దీనిలో భాగంగా జిల్లా పోలీసు అధికారులతో ఐజీ వీవీ గోపాలకృష్ణ గురువారం అనంతలో అత్యవసర సమావేశం అయ్యారు.
హత్య కేసు నిందితులను పట్టుకోవటంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారంటూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయిదే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.