IG office
-
ఐజీ సంతకం ఫోర్జరీపై విచారణాధికారిగా సురేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: నార్త్‌జోన్ ఐజీ కార్యాలయంలో వెలుగుచూసిన ఫోర్జరీ గ్యాంగ్ బాగోతంపై డీజీపీ కార్యాలయం స్పందించింది. కోవిడ్–19 కాలంలో ఐజీ కార్యాలయం నుంచి వెలువడిన 191 అధికారిక ఉత్తర్వుల్లో మొత్తం ఐదు ఉత్తర్వులను ఐజీ కిందిస్థాయి సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సురేశ్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. త్వరలోనే దీనిపై విచారణ జరుగుతుందని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐజీ నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. బదిలీలకు సంబంధించి సంబంధిత ఎస్పీలు, కమిషనర్లతో సంప్రదించాకే ముందుకెళతామని పేర్కొన్నారు. పిల్లల చదువు, అనారోగ్యం తదితర కారణాలకు మాత్రమే బదిలీలను పరిగణనలోకి తీసుకుంటామని, ఎలాంటి మధ్యవర్తిత్వాలు, లంచాలు డిమాండ్ చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. -
కర్నూలులోనే ఐజీ కార్యాలయం
► ఇకపై ఇక్కడి నుంచే కార్యకలాపాలు ► డీఐజీ క్యాంప్ ఆఫీస్‌పైన కార్యాలయం ► బాలాజీనగర్‌లో ఐజీ క్యాంప్ రెసిడెన్సీ కర్నూలు : పోలీసు శాఖలో సంస్కరణలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఐజీల పాలన సాగింది. డీజీపీగా నండూరి సాంబశివరావు ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. పాలనా సౌలభ్యం కోసం ఐజీలు హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించడంతో అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపి నార్త్ కోస్టల్గా వైజాగ్‌లోనూ.. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కష్ణా జిల్లాలు సౌత్ కోస్టల్ జోన్ కింద గుంటూరులోనూ.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కలిపి సౌత్ జోన్ కింద కర్నూలు కేంద్రంగా కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు ఐజీ కార్యాలయం డీఐజీ క్యాంప్ కార్యాలయంపైన ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు శివారులోని బాలాజీనగర్‌లో డూప్లెక్స్ ఇంటిలో ఐజీ క్యాంప్ రెసిడెన్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయలసీమ ఐజీ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని గత ఐజీ గోపాలకష్ణ ప్రతిపాదించారు. తిరుపతిని ఐటీ హబ్‌గా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి ఐజీ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అయితే తాజాగా కర్నూలులోనే ఐజీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించడంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1989లో రాయలసీమకు ఐజీ కార్యాలయం మంజూరైంది. ఫ్యాక్షన్ జోన్ ఐజీ పోలీస్ ఆఫీస్ పేరుతో బి.క్యాంప్‌లోని పోలీస్ గెస్ట్‌హౌస్‌పై రెండేళ్ల పాటు నిర్వహించారు. గెస్ట్‌హౌస్ పక్కనున్న బీసీ హాస్టల్ స్థానంలో 2001 నుంచి 2003 వరకు రాయలసీమ ఐజీ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే పాలనాపరమైన సౌలభ్యం కోసం 2003 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ పాలన సాగింది. కర్నూలు కేంద్రంగా ఐజీ పాలన కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కార్యాలయాల ఏర్పాట్లపై పోలీసు అధికారులు దష్టి సారించారు. -
‘ఆటోమ్యాటిక్’గా ఆస్తుల బదిలీ..!
కొత్తపేట(గుంటూరు) : రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖలో అధునాతన సాంకేతిక ప్రక్రియే ఆటోమ్యాటిక్ మ్యూటేషన్. అడంగళ్లు, ఇంటిపన్ను, ఆస్తుల సర్వహక్కులూ రిజిస్ట్రేషన్ రోజునే కొనుగోలుదారుని పేరు మీదకు బదిలీ అవటం ఈ విధానం విశిష్టత. ఈ నూతన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు పరచనున్నది. ప్రస్తుతం జిల్లాలో కొల్లిపర సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ రూపుదిద్దుకుంటుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారికంగా అమలు చేయనున్నారు. ఆస్తుల బదిలీ ఇక సులభం.. కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ మొదలు, ఆస్తులపై సర్వహక్కులు పొందేంత వరకు ప్రస్తుతం నానా తంటాలు పడాల్సి వస్తోంది. భూములు క్రయవిక్రయ దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకున్న పిదప, వీటి తాలుకా ఈసీలను రిజిస్ట్రారు కార్యాలయం నుంచి పొంది, పూర్తి ఆధారాలతో తహశీల్దార్ కార్యాలయంలో పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దీనికోసం అక్కడున్న గ్రామ రెవిన్యూ అధికారుల నుంచి తహశీల్దార్ వరకు అందరినీ ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. రోజుల తరబడి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప, పాసు పుస్తకాలు పొందలేని దుస్థితి. అయితే ఈ సమస్యలన్నింటికీ ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ త్వరలో చెక్ పెట్టనుంది. ప్రభుత్వం క్షేత్రస్థాయి క సరత్తుల అనంతరం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అయిన రోజునే కొనుగోలుదారుని పేరు అడంగల్‌లో ఆటోమ్యాటిక్‌గా నమోదు అవుతుంది. అడంగల్ కాపీని కొనుగోలుదారునికి సాఫ్ట్వేర్ ద్వారా అందజేస్తారు. ఫలితంగా భూమిని కొనుగోలు చేసిన మరుసటి రోజే విక్రయం చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఆస్తుల సత్వర బదిలీలకు ఇదొక సాంకేతిక విప్లవంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కొల్లిపరలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆటోమాటిక్ మ్యూటేషన్ ప్రక్రియ విజయవంతంగా పనిచేస్తుంది. 27 నుంచి మరిన్ని సేవలు.. ప్రస్తుతం భూముల తాలుకా అడంగల్‌లో పేరులు మార్పుకే కాకుండా త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో కొనుగోలు చేసిన ఆస్తులను కూడా ఆటోమ్యాటికి మ్యూటేషన్ ప్రక్రియలోకి క్రోడీకరించనున్నారు. స్థలాలు, భవనాలు వంటి ఆస్తులను కొనుగోలు చేసినా వెంటనే మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాలు చుట్టూ తిరగకుండానే ఈ సాఫ్ట్వేర్ ప్రక్రియతో కొనుగోలుదారుని పేరుమీదకు మొత్తం బదిలీ అవుతాయి. ఆస్తి విడుదల, పవర్ ఆఫ్ అటార్నీ , గిఫ్ట్ తదితర రిజిస్ట్రేషన్లు వంటివి కూడా ఆటోమ్యాటికి మ్యూటేషన్ ప్రక్రియలో పొందుపరుస్తున్నారు. సేవలు సరళీకృతమౌతున్నాయి.. - డీఐజీ బి.సూర్యనారాయణ ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ ప్రక్రి య ద్వారా ఆస్తుల సత్వర బదిలీలు, ప్రజాహిత సేవలు వంటివి ఎన్నో ప్రభుత్వం సరళీకృతం చేస్తోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అధునాతన సాంకేతిక నైపుణ్యంతో తయారు చేసినా సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రంలో 12 మంది సబ్ రిజిస్ట్రారులు ఐజీ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నారు. అడంగళ్లు, ఇంటి పన్ను, ఆస్తుల సర్వహక్కులూ రిజిస్ట్రేషన్ రోజునే కొనుగోలుదారు పేరున బదిలీ అవుతాయి.