IIT Bhubaneswar
-
ఐఐటీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ.. తగ్గనున్న ఎలక్ట్రికల్ వాహన ధరలు!
IIT Researchers Develop New Tech: కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా పరుగులు పెడుతున్న రంగం ఏదైనా ఉంది అంటే? అది, ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. ఈ రంగంలో తమ మార్క్ చూపించేందుకు దిగ్గజ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు, ఐఐటీ విశ్వవిద్యాలయాలు పోటీ పడుతున్నాయి. తాజాగా మన దేశంలోని రెండు ప్రముఖ ఐఐటీలకు చెందిన పరిశోధకులు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఆన్-బోర్డ్ ఛార్జర్ టెక్నాలజీలో సగం ఖర్చు అవుతుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల్లో ఒక కంపెనీ ఈ కొత్త టెక్నాలజీపై ఆసక్తి చూపినట్లు పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ టెక్నాలజీ వినియోగించడానికి, పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ బృందం పేర్కొంది. ఐఐటీ గౌహతి & ఐఐటీ భువనేశ్వర్ నిపుణులతో కలిపి వారణాసిలోని ఐఐటి(బిహెచ్‌యు) వద్ద ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. "దేశంలో పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధర పెరగడం, కాలుష్య స్థాయి అసాధారణ రీతికి పెరగడం మధ్య, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు) సంప్రదాయ ఐసీ వాహనలకు ఉత్తమ ప్రత్యామ్నాయం. కానీ, అధిక ధరల వల్ల వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు " అని ఐఐటీ బిహెచ్‌యు చీఫ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ రాజీవ్ కుమార్ సింగ్ అన్నారు. ఈ టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం ఉన్న దానితో పోలిస్తే ఆన్ బోర్డ్ ఛార్జర్ ఖర్చు దాదాపు 40-50 తగ్గుతుందని సింగ్ వివరించారు. దీనివల్ల అంతిమంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. (చదవండి: బేర్ దెబ్బకు కుదేలైన దలాల్ స్ట్రీట్.. ఒక్కరోజులో రూ.10లక్షల కోట్లు ఆవిరి) -
దేశీయ సెమీకండక్టర్ చిప్‌లను అభివృద్ధి చేసిన ఆ ఐఐటీ..!
టెక్నాలజీ పరంగా దేశంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఐఐటీ-భువనేశ్వర్ క్యాంపస్ అత్యాధునిక యాప్స్ కోసం రెండు సెమీకండక్టర్ చిప్‌లను అభివృద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్(ఐసీ) చీప్ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్(ఐఓఎంటి)లో శక్తివంతమైన సురక్షిత బయోమెడికల్ డేటా ప్రసారానికి సహాయపడితే, మరో చీప్ స్వల్ప-శ్రేణి తక్కువ శక్తి గల ఆర్ఎఫ్ ఫ్రంట్ ఎండ్ఐసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) యాప్స్ వంటి వాటిలో శక్తిని ఆదా చేస్తుంది. డాక్టర్ ఎంఎస్ మణికందన్, డాక్టర్ శ్రీనివాస్ బొప్పు నేతృత్వంలోని పరిశోధకుల బృందం అల్ట్రా-లో పవర్ కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీకండక్టర్(సీఎంఓఎస్) డేటా మార్పిడి ఐసీని రూపొందించి అభివృద్ధి చేసింది. "ఈ ఐసీ వేగంగా బయోమెడికల్ డేటాను ప్రసారం చేస్తుంది, తక్కువ శక్తిని ఎడ్జ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ కంప్యూటింగ్ పరికరాలకు వినియోగిస్తుంది" అని మణికందాన్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ మ్యాన్ పవర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ ఐసీ అభివృద్ధి చేశారు. మొహాలీలోని సెమీ కండక్టర్ లేబొరేటరీ(ఎస్ సిఎల్)లో ఫ్యాబ్రికేట్ చేసినట్లు తెలిపారు. డాక్టర్ విజయ శంకర రావు, పసుపురేడి నేతృత్వంలోని మరో బృందం డిజిటల్ ఇంటెన్సివ్ సబ్ శాంపులింగ్ షార్ట్ రేంజ్ గల పవర్ ఆర్ఎఫ్ ఫ్రంట్ ఎండ్ ఐసీని రూపొందించి అభివృద్ధి చేసింది. చిప్‌లో అనేక డిజైన్ ఆవిష్కరణలు ఉన్నాయి. దీనిని తైవాన్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలో ఫ్యాబ్రికేట్ చేశారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ వి రాజా కుమార్ మాట్లాడుతూ.. "గత నాలుగు సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేసిన తర్వాత ఈ సెమీకండక్టర్ చిప్స్ అభివృద్ధి చేసినట్లు" తెలిపారు. (చదవండి: 2021లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!) -
తుపాను అంచనా కోసం...
భువనేశ్వర్: తీరప్రాంతాల్లో వాతావరణాన్ని ముందుగా అంచనా వేసేందుకు ఓ నూతన పద్ధతిని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ భువనేశ్వర్‌లోని పరిశోధకులు కృషి చేస్తున్నా రు. భూ, సముద్రపు వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ఐఐటీ శాస్త్రవేత్తలు అమెరికా పరిశోధకుల బృందంతో కలసి రూపొందిస్తున్నట్లు ప్రొఫెసర్ మహంతి చెప్పారు. వాతావరణ తీవ్ర పరిస్థితులతోపాటు తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా కచ్చితత్వంతో అంచనా వేసే సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఈ నూతన వ్యవస్థ తోడ్పడుతుందన్నారు.