IIT-JEE advanced
-
‘సూపర్’ 30..!
- ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 30 మందికి 30 మంది అర్హత - దేశవ్యాప్తంగా విస్తరిస్తాం: ఆనంద్ కుమార్ పట్నా: ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సూపర్ 30 మరోసారి సత్తా చాటింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో బిహార్‌లోని సూపర్ 30లోని మొత్తం 30 మంది విద్యార్థులకుగానూ 30 మంది అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. ‘‘ఈ ఏడాది ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 30 మందికి 30 మంది అర్హత సాధించడం సంతోషంగా ఉంది. సూపర్ 30ని విస్తరించేందుకు ఇప్పుడు సమయం వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఇకపై పరీక్షలు నిర్వహిస్తాం. పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం’’ అని సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్ ప్రకటించారు. ఐఐటీ జేఈఈ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష సూపర్ 30 విజయానికి కారణమని చెప్పారు. ఆనంద్‌కుమార్ సూపర్ 30 సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ అందజేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి ఉచితంగా ఆహారం, వసతి సదుపాయం కల్పిస్తోంది. సూపర్ 30 స్థాపించి ఇప్పటికి 15 ఏళ్లు పూర్తయ్యింది. మొత్తం 450 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తే అందులో 396 మంది విద్యార్థులు ఐఐటీలకు ఎంపికయ్యారు. ఈసారి ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల్లోనూ స్ఫూర్తినిచ్చే గాథలు ఎన్నో ఉన్నాయి. సూపర్ 30లో చదివిన కెవ్లిన్ తండ్రి దీపక్‌కు ఉద్యోగం లేదు. యోగా నేర్పుతుంటాడు. అయినా కుటుంబ పోషణకు తగ్గ ఆదాయం మాత్రం రావడం లేదు. అయితే పేదరికం నుంచి బయటపడాలంటే.. చదువే మార్గమని గుర్తించిన అతడు.. కుమారుడిని ఆ దిశగా ప్రోత్సహించాడు. పదేళ్ల క్రితం తాను సూపర్ 30 గురించి విన్నానని, తన కలను నిజం చేయడానికి తన కుమారుడు ఇక్కడికి రావాలని కోరుకున్నానని, ఇప్పుడు తన కుమారుడు నిజంగానే తన కల నిజం చేశాడంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు దీపక్. తన కల నిజం చేసినందుకు ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇతనిలాగే.. అర్బాజ్ ఆలమ్ కోడిగుడ్ల వ్యాపారి కొడుకు, అభిషేక్.. భూమి లేని నిరుపేద రైతు పుత్రుడు.. అర్జున్ రైతు కూలీ కుమారుడు.. పేదరికాన్ని, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి.. తమలాంటి ఎందరికో ప్రేరణగా నిలిచారు. అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ ఐఐటీల్లో 58 మందికి సీట్లు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠ శాలల నుంచి 58మంది విద్యార్థులు ప్రతిభ కనబ ర్చారని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 25 మంది విద్యార్థులు, గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి 33 విద్యార్థులు ఉన్నారన్నారు. వీరందరికీ ఐఐటీల్లో సీట్లు దక్కను న్నాయన్నారు. ఎస్టీ కేటగిరీలో దేవేంద్ర నాయక్ ఆలిండియా స్థాయిలో 167 ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో ఎం.కార్తీక్ 430 ర్యాంకు సాధించారన్నారు. ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రవీణ్‌కుమార్ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీఎస్ లాసెట్‌లోనూ గురుకుల విద్యార్థులు సత్తా చాటారన్నారు. -
సూపర్ 30 అరుదైన రికార్డు
- ఐఐటీ జేఈఈ ఫలితాల్లో మరోసారి హవా - శిక్షణ పొందిన అందరూ అర్హతసాధించారు పట్నా: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(ఐఐటీ-జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో సూపర్ 30 సంస్థ మరోసారి సాహో అనిపించింది. బిహార్‌లోని పట్నా కేంద్రంగా నడిచే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన 30 మంది విద్యార్థుల్లో నూటికి నూరుశాతం మంది జేఈఈ అర్హత సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. వీరంతా అట్టడుగు వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. సరైన అవకాశాలు కల్పిస్తే పేద కుటుంబాల పిల్లలు కూడా ఐఐటీలలో సీట్లు సాధించగలరని మరోసారి నిరూపితమైందని అన్నారు సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్. 2002లో ప్రారంభించిన సూపర్ 30 విద్యా సంస్థ ద్వారా ఏటా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్‌తోపాటు భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏయేటికాయేడు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోన్న సూపర్30ని ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ద బెస్ట్ ఆఫ్ ఆసియా 2010’ జాబితాలో పొందుపర్చడం తలిసిందే. గతేడాది 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా 28 మంది జేఈఈలో అర్హత సాధించారు. సీట్ల సంఖ్య పెంచుతాం: ఆనంద్‌కుమార్ ఆదివారం ఐఐటీ-జేఈఈ ఫలితాలు వెల్లడైన అనంతరం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘సరైన సహకారం అందిస్తే పేద, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు సైతం అద్భుతాలు సృష్టించగలని సూపర్ 30 ద్వారా ఎన్నో ఏళ్లుగా నిరూపిస్తున్నాం. అలాంటి మట్టిలోమాణిక్యాలు ఇంకా ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ల కోసమే సీట్ల సంఖ్య పెంచాలనే నిర్ణయానికి వచ్చాం. తద్వారా ఇప్పటికంటే మరింత మందికి సేవలు అందించినట్లవుతుంది’ అని ఆనంద్ కుమార్ చెప్పారు. -
జేఈఈలో అమ్మాయిల వెనుకంజ
టాప్-100లో ఐదుగురే అర్హత సాధించిన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 11శాతమే రాజస్థాన్ విద్యార్థి చిత్రాంగ్ ముర్దియాకు టాప్ ర్యాంకు బాలికల్లో అదితికి తొలి స్థానం ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల దేశవ్యాప్తంగా 27,151 మందికి అర్హత కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్) ఫలితాలు గురువారం విడుదల య్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన తొలి వంద మంది విద్యార్థుల్లో కేవలం ఐదుగురు మాత్రమే బాలికలు ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణుల్లో అమ్మాయిలు 11 శాతం మాత్రమేనని జేఈఈ ఇన్చార్జి, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఎం.కె.పాణిగ్రాహి వెల్లడించారు. జేఈఈ(అడ్వాన్స్డ్)లో రాజస్థాన్‌కు చెందిన చిత్రాంగ్ ముర్దియా 360 మార్కులకు గాను 334 మార్కులు సాధించి టాప్ ర్యాంకును దక్కించుకున్నాడు. బాలికల్లో టాపర్‌గా నిలిచిన ఐఐటీ రూర్కీ జోన్‌కు చెందిన అదితి.. కామన్ మెరిట్ లిస్ట్ (సీఎంఎల్)లో ఏడో ర్యాంకు సాధించింది. ఈ పరీక్ష కు దేశవ్యాప్తంగా మొత్తం 1,26,997 మంది నమోదు చేసుకోగా.. 27,151 మంది అర్హత సాధించినట్టు పాణిగ్రాహి తెలిపారు.మొత్తమ్మీద కామన్ మెరిట్ లిస్ట్‌లో 19,416 మంది ఉండగా.. 6వేల మంది ఓబీసీ, 4,400 మంది ఎస్సీ, 1,250 మంది ఎస్టీ మెరిట్ జాబితాల్లో ఉన్నారు. 243 మంది వికలాంగులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సీఎంఎల్లో దాదాపు 3,500 మంది అధికంగా అర్హత సాధించడం విశేషం. అంతేకాకుండా అన్ని కేటగిరీ ల్లోనూ అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. జేఈఈ (అడ్వాన్స్డ్)లో విజయం సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 16 ఐఐటీలతోపాటు ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో ప్రవేశాలు పొందడానికి అర్హులవుతారు. సత్తా చాటిన ‘సూపర్ 30’ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 27మందికి అర్హత పాట్నా: ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్)లో ‘సూపర్-30’ సంస్థ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రతి ఏటా 30 మంది అత్యంత పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఈ సంస్థ నుంచి ఈసారి 27 మంది అర్హత సాధించడం విశేషం. వీరిలో రోజు కూలీ, చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు పక్కన తినుబండారాలు విక్రయించుకునే వారి పిల్లలు ఉన్నారు. పేదరికం కారణంగా ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లలేకపోయిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి.. పేద విద్యార్థులకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపిం చారు. 2001లో ప్రారంభమైన సూపర్-30 నుంచి ఇప్పటివరకు 360 మంది విద్యార్థులు ఐఐటీ-జేఈఈ పరీక్షకు హాజరుకాగా, వారిలో 308మంది అర్హత సాధించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పరిశోధకుడిని కావాలనుకుంటున్నా ‘‘ఇది ఎంతో ఆనందకరమైన రోజు. ఈ విజయానికి కారణం.. నా తల్లిదండ్రులు, కోటాస్ ప్రైవేటు ఇన్స్టిట్యూట్ అధ్యాపకులే. వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాకు కార్పొరేట్ ఉద్యోగం కంటే పరిశోధనలంటేనే ఇష్టం. ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధకుడు కావాలనుకుంటున్నా. మనదేశం పరిశోధనల్లో బాగా వెనకబడి ఉంది. పారిశ్రామిక రంగం పురోభివృద్ధికి పరిశోధనలు ఎంతో కీలకం. అణగారినవర్గాలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవ డం ద్వారా సమాజానికి సేవ చేయాలని ఉంది. ముంబై ఐఐటీలోనే చేరాలనుకుంటున్నా’’ - చిత్రాంగ్ ముర్దియా, ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్) టాపర్ అమ్మాయిలకు ప్రోత్సాహం లేదు ‘‘ఇంజనీరింగ్ వైపు వెళ్లేలా బాలికలను వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడంలేదు. ఐఐటీ-జేఈఈ(అడ్వాన్స్డ్)లో అమ్మాయిలు వెనుకబడటానికి అదే కారణం. నేను ఇంజనీరింగ్ చదివేందుకు నా కుటుంబం పూర్తిగా ప్రోత్సహించింది. కానీ నా స్నేహితుల్లో చాలామంది మెడికల్ లేదా కామర్స్‌ను ఎంచుకున్నారు. ఇంజనీరింగ్‌లో తక్కువ మంది బాలికలు ఉండటానికి అదే కారణం. అంతమాత్రాన అమ్మాయిలు మంచి ఇంజనీర్లు కాలేరని కాదు’’ - అదితి, ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్) బాలికల టాపర్