సైకిల్ యాత్రకు వీడ్కోలు
గాంధీనగర్ : కృష్ణానది పరిరక్షణకు సైకిల్ యాత్ర చేపట్టిన గౌరీశంకర్‌ను ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అభినందించారు. గురువారం ప్రెస్‌క్లబ్ వద్ద సైకిల్‌యాత్రకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వీడ్కోలు పలికారు. అంబటి మాట్లాడుతూ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలనే సంకల్పంతో గౌరీశంకర్ యాత్ర చేపట్టారన్నారు. అధికార తెలుగుభాషలోనే పాలన జరిగితేనే పాలనా విధానం ప్రజలకు చేరుతుందన్నారు. అర్థం కానీ అంగ్లభాషలో పరిపాలించడంవలన తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సైకిల్‌యాత్రలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం మట్టి, నీరు, ఇటుకలు గౌరీశంకర్ అందించారన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.