ilamma
-
ఇద్దరు భార్యల ఘాతుకం
పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్యలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తిరుమలయ్యపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత మార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిజాంను ఎదిరించిన తొలి మహిళ ఐలమ్మ
మిర్యాలగూడ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి పోరాడిన తొలి మహిళ చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలోని సాగర్ రోడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాస్కర్‌రావు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మిభార్గవ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ నాగలక్ష్మి, రజక సంఘం నాయకులు నాగభూషణం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్‌రెడ్డి, నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, మగ్దూమ్‌పాష తదితరులు పాల్గొన్నారు. -
'ఐలమ్మ స్ఫూర్తితో మోదీపై పోరాటం'
వరంగల్: నిజాం పాలనలో దొరలు పేదల భూములను కొల్లగొట్టినట్లుగానే.. నేడు ప్రధాని మోదీ పేదల భూములను లాక్కొని పెద్ద పెట్టుబడి దారులకు కట్ట బెట్టాలని చూస్తున్న విధానాలను వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో ఎదిరించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం తెలంగాణ ఐక్య కళాకారుల వేదిక కన్వీనర్ పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో బృందాకరత్ మాట్లాడారు. పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ర్టంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ గిరిజనులు భూములకు పట్టాలివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వంగా ఉందని తెలిపారు. దళితులకు మూడెకరాలు భూమి, పేదలకు డబుల్ బెడ్ రూం, ఇంటికో ఉద్యోగం, సాగు నీరు అందిస్తామని ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శించారు. సంపన్న వర్గాలకు మేలు చేస్తూ పేదలకు అన్యాయం తలపెడుతున్న సర్కార్‌పై ఐలమ్మ స్ఫూర్తిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
వీరనారి.. ఐలమ్మ
- ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలి - పాలకుర్తిలో వర్థంతి వేడుకలు - నివాళులర్పించిన కుటుంబ సభ్యులు పాలకుర్తి టౌన్ : వీరనారి ఐలమ్మ భూపోరాటం చారిత్రకమైంది.. ఆమె విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రాంచంద్రం, సీపీఎం మండల కార్యదర్శి మామిండ్ల రమేష్‌రాజా అన్నారు. ఐలమ్మ 29వ వర్ధంతిని పుస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని ఆమె స్మారక స్థూపం వద్ద సీపీ ఎం, విగ్రహపత్రిష్ఠ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విస్నూరు దేశ్‌ముఖ్ ఆగడాలను ఎదిరించిన వీరవనిత ఐలమ్మ పోరాటాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆమె ఉద్యమ స్ఫూర్తితో ప్రతి నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐలమ్మతోపాటు దొడ్డి కొమురయ్య, షేక్ బందగి కాంస్య విగ్రహలను ట్యాంక్ బాండ్‌పై ఏర్పా టు చేయాలని, యూనివర్సిటీలకు వారి పేర్లు పెట్టాల న్నారు. జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారి కంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వీరతెలంగా ణ ఉద్యమంలో నాలుగువేల మంది అమరులయ్యారని, 10లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జీడీ సోమయ్య, కె.కుమారస్వామి, చిట్యాల సమ్మయ్య, కొంతం కొముర య్య, జీడి సత్యనారాయణ, కొమురుమల్లు,సెక్రటరీ యాకయ్య, వెంకన్న, చిట్యాల యాకయ్య, మామిండ్ల సోమచందర్, దాసరి యాదగిరి, చిదురాల ఎల్లయ్య, ఐలమ్మ కుటుంబ సభ్యులు, దాసరి యాదగిరి, చిదురాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ పోతుగంటి నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్రాజాతోపాటు తెలుగు ఉపాధ్యాయుడు పి.బాలమల్లు మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఐలమ్మ పోరాట చరిత్ర తెలుసుకోవాల న్నారు. కార్యక్రమంలో పోషబోయిన రవి, డి.వెంకటేశ్వర్లు, కె.సోమయ్య, గందె రమేష్, టి.కమలాకర్, జానకి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.