ఇద్దరు భార్యల ఘాతుకం | Two wives kill husband with axe | Sakshi
Sakshi News home page

ఇద్దరు భార్యల ఘాతుకం

Published Thu, Apr 13 2017 10:05 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

Two wives kill husband with axe

పెద్దపల్లి: ఇద్దరు భార్యలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన జిల్లాలోని కమాన్‌పూర్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి తిరుమలయ్య(65)ను ఆయన ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. తిరుమలయ్య అతని ఇద్దరు భార్యలు మదునమ్మ, ఐలమ్మలను గత కొన్నేళ్లుగా తీవ్రంగా హింసిస్తున్నాడు. 

భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్యలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తిరుమలయ్యపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత మార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement