వరంగల్: నిజాం పాలనలో దొరలు పేదల భూములను కొల్లగొట్టినట్లుగానే.. నేడు ప్రధాని మోదీ పేదల భూములను లాక్కొని పెద్ద పెట్టుబడి దారులకు కట్ట బెట్టాలని చూస్తున్న విధానాలను వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో ఎదిరించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం తెలంగాణ ఐక్య కళాకారుల వేదిక కన్వీనర్ పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో బృందాకరత్ మాట్లాడారు.
పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ర్టంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ గిరిజనులు భూములకు పట్టాలివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వంగా ఉందని తెలిపారు. దళితులకు మూడెకరాలు భూమి, పేదలకు డబుల్ బెడ్ రూం, ఇంటికో ఉద్యోగం, సాగు నీరు అందిస్తామని ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శించారు. సంపన్న వర్గాలకు మేలు చేస్తూ పేదలకు అన్యాయం తలపెడుతున్న సర్కార్‌పై ఐలమ్మ స్ఫూర్తిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
'ఐలమ్మ స్ఫూర్తితో మోదీపై పోరాటం'
Published Thu, Sep 10 2015 9:39 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement