శ్మశానం నుంచి శవాన్ని ఇంటికి తెచ్చేశాడు
పూడ్చిన శవాన్ని మళ్లీ ఇంటికి తెచ్చిన కుమారుడు
కోలారు : తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన నాలుగైదు రోజులకు మళ్లీ తండ్రి శవాన్ని ఇంటికి తీసుకువచ్చిన సంఘటన మాలూరు తాలూకా మాస్తి ఫిర్కా గొల్లపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన చోటా సాబ్ కుమారుడు ఇలియాజ్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇదిలా ఉంటే గత బుధవారం చోటాసాబ్ మృతి చెందాడు.
బంధువుల రోదిస్తుండగా తన తండ్రి మళ్లీ బతికి వస్తాడని ఎవరు ఏడవద్దని చెప్పాడు. ఆవేదనతో ఇలియాజ్ ఇలా మాట్లాడుతున్నాడని బంధువులు భావించారు. అయితే మంగళవారం రాత్రి భోజనం చేసిన ఇలియాజ్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానంకు వెళ్లి తండ్రి మృతదేహాన్ని తీసుకుని...భూజాన వేసుకుని ఇంటికి తీసుకువచ్చి అప్పులు ఎలా తీర్చాలి నాన్నా అంటూ రోదించడం మొదలు పెట్టాడు.
స్థానికులు ఈ సంఘటన చూసి అవాక్కయ్యారు. ఇలియాజ్కు తిరిగి సర్దిచెప్పి అర్ధరాత్రి మృతదేహాన్ని శ్మశానం తీసుకెళ్లి ఖననం చేశారు. ఇలియాజ్ గత కొద్ది కాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం.