illegal income
-
ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/ మొయినాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని.. పైగా వారిపై దాడులు మరింతగా పెరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళిత సీఎం అని చెప్పి, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. గిరిజనులకు పోడు భూములు దక్కలేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి, అక్రమ సంపాదనకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.లక్ష కోట్ల ఆస్తులను, రూ.పదివేల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం మాట్లాడారు. మూడో విజయం తెలంగాణలోనే.. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ తొలి విజయం హిమాచల్‌ప్రదేశ్‌లో, రెండో విజయం కర్ణాటకలో సాధించిందని.. మూడో విజయం తెలంగాణలో సాధించబోతోందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛతోపాటు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని.. మంత్రి వర్గంలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులతో సరిపెట్టార న్నారు. దేశంలోని మోదీ, తెలంగాణలోని కేసీఆర్, పాతబస్తీలోని అసదుద్దీన్ ముగ్గురూ ఒక్కటేనని.. వీరిలో ఎవరికి ఓటేసినా కేసీఆర్‌కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో అమర వీరుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ వాదులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ అవినీతి, అణచివేత, కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనన్నారు. కాగా.. ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి: దామోదర తెలంగాణలో భూమి కోసం, హక్కులకోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని.. అది గుర్తించే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇందిరాగాంధీ 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో పేదల భూములను గుంజుకుని, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దొర అహంకారం మితిమీరిందని.. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పదవులు: సీతక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఏదో చేసిందని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప.. చేసిందేమీ లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వందల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఉన్న పెద్దలకే రైతుబంధు సొమ్ము ఎక్కువగా అందుతోందని.. భూమి లేని పేదలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తాయన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చరిత్రాత్మకం: భట్టి రాష్ట్ర సంపదలో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎల్పినేత భట్టి విక్రమార్క చెప్పారు. చేవెళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేపట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని.. అదే సీఎల్పీ నేతగా తాను చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని వివరించారు. వాటిపై కాంగ్రెస్ పెద్దలంతా చర్చించి పేదలకు ఇంటి స్థలం, భూమి, ఆర్థిక సాయం అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తీసుకొచ్చారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీ నెరవేర్చకపోగా, పేదలకిచ్చిన లక్షల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకిచ్చిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని.. లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు. -
తమ్ముళ్ల వెతుకులాట
పదేళ్లుగా అధికారం కోసం ఆవురావురమని ఎదురుచూసి రైతన్న పుణ్యమో.. నమో మంత్రమో గానీ ఎట్టకేలకు పవర్లోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు అడ్డంగా సంపాదించడం కోసం అక్రమ మార్గాల వెతుకులాటలో ఉన్నారు. ‘నేనొచ్చానంటే చాలు. చక్రం తిప్పేస్తా. కేంద్రం మెడలు వంచేస్తా’ అంటూ బీరాలు పలికిన చంద్రబాబు తీరా అధికారంలోకి రాగానే ‘నేను కూర్చోడానికే కుర్చీ లేదు.. పైసల్లేవ్.. ఖజానా ఖాళీ’ అంటూ రాజధాని నిర్మాణం పేరిట విరాళాలు సేకరించే పనిలో నిమగ్నమైపోయారు. దీంతో సర్కారీ పనులు, కాంట్రాక్టుల కోసం ఎదురుచూసిన తమ్ముళ్లు ఇప్పట్లో అవి దక్కేలా లేవని భావించి అక్రమ ఆదాయం కోసం సెటిల్మెంట్లు, భూదందాలపై పడుతున్నారు. ఎక్కడో.. ఏమో గానీ.. మన జిల్లా కేంద్రం ఏలూరులో మాత్రం కొందరు పచ్చచొక్కా నేతలు ప్రస్తుతం ఇవే పనులపై దృష్టి కేంద్రీకరించారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేయడమనేది ఇప్పటివరకు మనం చూస్తున్న పాత పద్ధతి. ఇళ్లు కట్టుకుని నివాసముంటున్న వాళ్లను కూడా ఖాళీ చేయించి ఆయా స్థలాల్లో పాగా వేయడమే ప్రస్తుత తెలుగు తమ్ముళ్లనయా ‘రియల్’ కల్చర్. పొరుగునే ఉన్న బెజవాడే రాజధాని అని తేలడంతో ఏలూరు శివారు కాలనీలపై బడాబాబుల కన్నుపడింది. బీ.ఫారాలతో ఇళ్ల పట్టాలు పొందిన వారిని నయానో భయానో బెదిరించి ఆ ప్లాట్లను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మంచిగా పట్టాలు అప్పగిస్తే బదులుగా ఎక్కడో మరో మూలన స్థలం కేటాయిస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు. ఇందుకు అధికారుల సాయం కూడా తీసుకుంటున్నారు. ఏలూరులో బీ.ఫారం పట్టాలతో ఇళ్లు ఉన్న కాలనీలు ఎక్కడెక్కడున్నాయి.. ఖాళీ చేయించి వారిని ఎక్కడికి తరలించొచ్చు అంటూ అధికారులతో సమగ్ర సర్వే చేయిస్తున్నారట. మొత్తంగా ఏలూరు శివారులోని బీ.ఫారం పట్టాలు ఉన్న ఇళ్లన్నీ తొలగించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్నదే తెలుగు తమ్ముళ్ల లక్ష్యమట. ఇలానే వదిలేస్తే.. శివారు ప్రాంతాలే కాదు ఏలూరు నగరంలో మురుగునీరు, ముళ్లకంపలన్న ఖాళీ స్థలాలు కూడా సర్వాంగసుందరమైన వెంచర్లుగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. అయితే ఇవన్నీ హేలాపురి ప్రజ సిత్రాలుగా చూస్తుందా.. పోరుబాటతో తెలుగుతమ్ముళ్లకు ‘సినిమా’ చూపిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. పైడికొండల.. ఇలాగైతే ఎలా? హయవేగంలోనూ హలో హలో అంటూ అన్ని వ్యవహారాలూ ఫోన్లలోనే చక్కబెడు తున్న ఈ రోజుల్లో మన మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఆ వేగాన్ని ఒంటపట్టించుకున్నట్టు కనిపించడం లేదు. సచివులు, చాలామంది ప్రజాప్రతినిధులు ఫోన్లలో అందుబాటులోకి రావడం లేదు. ఫోన్‌చేస్తే నేరుగా మంత్రులు మాట్లాడకపోయినా వాళ్ల సీసీలు, పీఏలు స్పందించి, ఆ తర్వాత విషయాన్ని బట్టి సచివులు లైన్లోకి వస్తుం టారు. కనీసం సీసీలు, పీఏలు కూడా ఎత్తి సరైన సమాధానం, సమాచారం చెప్పని స్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఎమ్మెల్యేనే రెండురోజుల కిందట సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన మంత్రులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారట. ఇక మన మంత్రుల విషయానికి వస్తే దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఫోన్లకు దొరకరనే విమర్శలున్నాయి. ఇటీవల దేవాదాయ శాఖలో అవినీతిపై నేరుగా మంత్రికి ఫోన్‌చేసి సమాచారం చెబుదామనుకున్న నగరానికి చెందిన ఓ ఔత్సాహికుడు ఎలాగోలా ఫోన్ నంబర్ పట్టుకుని రింగ్ చేశారు. రోజంతా ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయలేదట. కనీసం ఎవరు చేశారో.. అని తిరిగి ఫోన్ రాకపోవడంతో చేసేదిలేక సదరు యువకుడు మిన్నకుండిపోయాడట. రెండోరోజైనా ఎవరు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశారో తెలుసుకుందామన్న కనీస స్పృహ కూడా సదరు మంత్రి సీసీలు, పీఏలకు పట్టలేదట. మంత్రి పదవి పొందిన తొలినాళ్లలో తాడేపల్లిగూడెంలో ఓ మహిళ కరెంటు సమస్యపై పొద్దుపోయాక ఫోన్ చేసినా స్పందించి ధర్నా చేసిన మాణిక్యం పలుకు ఇప్పుడు ఫోన్లలో బంగారమైపోయిందా!? - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
కదిలితే ఒట్టు!
వాణిజ్యపన్నుల శాఖలో బదిలీల తంతు ఫోకల్ పోస్టింగ్‌ల కోసం పైరవీలు ఏళ్ల తరబడి కదలని అధికారులు పదోన్నతుల పోస్టింగ్‌లోనూ నిబంధనలకు నీళ్లు విజయవాడ : రాష్ట్ర తాత్కాలిక రాజధాని, వాణిజ్య కూడలి విజయవాడ కేంద్రంగా కొలువుల కోసం వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, సిబ్బంది ఎవరిస్థాయిలో వారు చక్రం తిప్పుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా అక్రమ ఆదాయం వచ్చిపడే వాణిజ్యపన్నుల శాఖలో కుర్చీల కోసం పైరవీలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో హడావుడి మొదలైంది. ముఖ్యంగా గెజిటెడ్ అధికారులకు జోనల్‌స్థాయి బదిలీలు జరగాల్సి ఉండగా... ప్రతీ ఏటా ఒకే కార్యాలయంలో కుండమార్పిడీల రీతిలో అక్కడికక్కడే సర్దుకుంటున్నారు. డీసీటీవో, సీటీవోస్థాయి అధికారులు రెండేళ్లకోసారి, కనీసం మూడేళ్లకోసారైనా బదిలీ అవాల్సి ఉంది. ఏలూరు, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు గెజిటెడ్ అధికారులు బదిలీ కావల్సి ఉండగా ఎవరికి కావాల్సింది వారికి ముట్టజెప్పి విజయవాడను వదలడం లేదని చెబుతున్నారు. రికార్డు అసిస్టెంట్ నుంచి డీసీటీవో క్యాడర్ వరకు విజయవాడలో ఒకే కార్యాలయంలో పనిచేసే వారు పలువురు తాజాగా మళ్లీ ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నోఏళ్లుగా తిష్టవేసిన కొందరు అధికారులు ఆ సీట్లను వదలకపోవటంతో, నగరానికి బయట పని చేసే వారు అక్కడే మగ్గిపోతున్నామని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా విజయవాడలో 1డివిజన్, 2వడివిజన్లతోపాటు 16 సర్కిళ్లు ఉన్నాయి. ఎనిమిది సర్కిళ్లకు 16మంది డీసీటీవోలు, 48 మంది సీటీవోలు (ఇన్స్పెక్టర్లు)పనిచేస్తుంటారు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు దాదాపు మరో140 మంది ఉన్నారు. వీరంతా తమ పలుకుబడితో విజయవాడ వదిలి వెళ్లకుండా ఉంటున్నారు. పదోన్నతుల పోస్టింగ్‌లోనూ నిబంధనలకు నీళ్లు ... రెండు రోజుల క్రితం వాణిజ్యపన్నుల శాఖలో 1, 2,డివిజన్ కార్యాలయాల్లో పని చేసే 20 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంటెంట్లుగా పదోన్నతి వచ్చింది. నిబంధనల ప్రకారం ఒక సర్కిల్లో పనిచేసిన వ్యక్తిని తిరిగి అదే డివిజన్లో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించటానికి నిబంధనలు ఒప్పుకోవు.అయితే సంబంధిత అధికారులు ఆ నిబంధనలు గాలికి వదిలి పలువురిని గతంలో పనిచేసిన సర్కిల్లోనే పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి.