Illeness
-
కలుషిత ఆహారం.. 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం అల్పాహారంగా తాలింపు అటుకులు, రవ్వతో పాయసం అందించారు. అటుకులు, పాయసంలో పురుగులు రావ డంతో వాటిని తిన్న విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ పాఠశాలలో కుప్పకూలారు. దాన్ని గమనించిన మిగతా విద్యార్థినులు తినడం మానేశారు. పాఠశాల ప్రత్యేక అధికారి, వార్డెన్, వంట సిబ్బంది ఆ పదార్థాలను పడేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినుల్లో 25 మందిని మాత్రమే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. తహసీల్దార్ మురళీధర్, ఆర్ఐ మాధవరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డిలు పాఠశాలకు చేరుకుని మిగతావారిని పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. డీఈవో నాంపల్లి రాజేశ్ ఆస్పత్రిలో విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. బాధ్యులైన ప్రత్యేక అధికారితో పాటు నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. -
రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్‌కు చార్లెస్
లండన్: రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. ఆయన తల్లి రాణి ఎలిజబెత్–2 వృద్ధాప్యంతో గురువారం స్కాట్లాండ్లో మరణించడం తెలిసిందే. దాంతో నిబంధనల ప్రకారం ఆ మరుక్షణం నుంచే చార్లెస్ బ్రిటన్ రాజయ్యారు. శుక్రవారం స్కాట్లండ్ నుంచి లండన్ చేరుకున్న ఆయనకు ప్రజలు ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ జాతీయ గీతం పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రాజు హోదాలో చార్లెస్ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని లిజ్ ట్రస్‌తో భేటీ అయ్యారు. అంత్యక్రియలపై అస్పష్టత ఎలిజబెత్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా తేలలేదు. రెండు వారాల్లోపు చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబేలో అంత్యక్రియలు జరుగుతాయని బీబీసీ వెల్లడించింది. పార్లమెంటు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై రాణికి నివాళులర్పించింది. 96 ఏళ్లపాటు జీవించిన రాణి గౌరవార్థం సెంట్రల్ లండన్‌లో 96 రౌండ్ల గన్ సెల్యూట్ జరిగింది. శనివారం హౌజ్ ఆఫ్ కామన్స్ ప్రత్యేక భేటీలో ఎంపీలంతా కింగ్ చార్లెస్–3కి విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై చార్లెస్‌ను రాజుగా లాంఛనంగా ప్రకటించనుంది సంతాపాల వెల్లువ ఎలిజబెత్ అస్తమయం పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భా్రంతి వెలిబుచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతులు వాషింగ్టన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ నివాళులర్పించారు. ‘‘రాణిది అరుదైన, గొప్ప వ్యక్తిత్వం. అమెరికన్లందరి తరఫున మా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సంతాపాల పుస్తకంలో రాశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితరులు కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో 11న ఆదివారం ఒక్కరోజు సంతాప దినంగా పాటించనున్నారు. -
సురేశ్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు: అనురాగ్ శర్మ
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన ఇంటిలిజెన్స్ డీఎస్పీ సురేష్‌రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని డీజీపీ అనురాగ్ శర్మ మీడియాకు తెలిపారు. యశోదా ఆస్పత్రిలో సురేశ్ రావు భౌతికకాయానికి నివాళులర్పించిన తర్వాత మీడియాతో అనురాగ్ శర్మ మాట్లాడారు. 15 రోజుల క్రితమే యశోదలో చికిత్స తీసుకున్నారని, ఈరోజే సురేష్‌రావు డ్యూటీకి వచ్చాడు అని అనురాగ్‌శర్మ తెలిపారు. కేసీఆర్ కు గతంలో భద్రతాధికారిగా పనిచేసిన సురేశ్ రావు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం సురేశ్ రావు ఇంటలిజెన్స్ డీఎస్పీగా సేవలందిస్తున్నారు. ఆయన మృతికి కేసీఆర్, ఇతర పోలీసు అధికారులు సంతాపం తెలిపారు.