iml Depot
-
రెండో రోజు రూ.3 కోట్ల మద్యం కొనుగోలు
కర్నూలు : నూతన మద్యం పాలసీలో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు సోమవారం రెండో రోజు రూ.3 కోట్లు విలువ చేసే మద్యం కొనుగోలు చేశారు. 6,211 బాక్సుల లిక్కర్, 2,950 బాక్సుల బీర్లను కొనుగోలు చేసి దుకాణాలకు తరలించారు. మొదటి రోజు 26 మంది దుకాణదారులు రూ.1.50 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయగా, రెండో రోజు రూ.3 కోట్ల మద్యాన్ని తీసుకోవడం గమనార్హం. కల్లూరు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపో రెండు రోజులుగా మద్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఇప్పటివరకు లైసెన్స్ పొందిన 57 మందిలో ఇంకా ఐదుగురు వ్యాపారులు మద్యం కొనుగోలుకు రాలేదు. -
అనంతలో భారీ అగ్నిప్రమాదం.. రూ.21 కోట్ల నష్టం
- భారీగా మద్యం కేసులు దగ్ధం - రూ.21 కోట్ల నష్టం (సాక్షిప్రతినిధి, అనంతపురం): అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్దనున్న మద్యం సరఫరా గోడౌన్ (ఐఎంఎల్ డిపో) పూర్తిగా తగలబడిపోయింది. మంగళవారం రాత్రి 9.45 గంటలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది పరుగు పరుగున బయటకు వచ్చేశారు. చూస్తుండగానే క్షణాల్లో డిపో పూర్తిగా తగలబడిపోయింది. నష్టం సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అంచనా. ఈ గోడౌన్ దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. ప్రతి నెలా రూ.65కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. 40 ఏళ్లకిందట చేసిన వైరింగే ఇప్పటిదాకా ఉంది. కరెంటు తీగలు డిపోలో ప్రమాదకరంగా ఉండటాన్ని సిబ్బంది ఇంతకుముందే గుర్తించారు. అయితే, కొత్తగా వైరింగ్ చేయడంపై శ్రద్ధ చూపలేదు. ఇదే ప్రమాదానికి కారణమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే డిపో తగలబడిపోయిందని తెలుస్తోంది. ముందు జాగ్రత్తలేవీ? మద్యం గోడౌన్లో మంటలు ఆర్పేందుకు కార్బన్ సిలిండర్లను ఏర్పాటు చేయలేదు. వీటిపై డిపో అధికారులు ఏనాడూ దృష్టి సారించలేదు. సిలిండర్లు ఉన్నాయా, లేదా అన్న విషయాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పట్టించుకోలేదు. సిలిండర్లు ఉండి ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే మంటలను ఆర్పే అవకాశం ఉండేదని డిపోలోని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. షార్ట్‌సర్క్యూట్ వల్లే జరిగిండొచ్చు - అనురాధ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చాం. తగలబడిన మద్యం విలువ దాదాపు రూ.5కోట్లు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం. -
సెలవు రోజూ మద్యం డెలివరీ
25 రోజుల్లో రూ.55 కోట్ల మద్యం బట్వాడా ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్, ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపో నుంచి సెలవు రోజైన ఆదివారం కూడా మద్యం డెలివరీ కొనసాగింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు 55 కోట్ల రూపాయల విలువైన మందును అధికారులు డెలివరీ చేశారు. రోజుకు రూ.మూడు నుంచి రూ. ఐదు కోట్లు వరకు మద్యం డెలివిరీ అవుతోంది. ఎన్నికల హడావుడి ముగిసినప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 24 నుంచి జూన్ ఆరో తేదీ వరకు ఐఎంఎల్ డిపోలు మూచేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఒక్కసారిగా మద్యం అమ్మకాలు పెరిగాయి. అయితే ప్రస్తుతానికి మూసివేతకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాక పోవటంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న నేపథ్యంలో సెలవు రోజైన ఆదివారం కూడా మద్యాన్ని డెలివరీ చేశారు. డిమాండ్ ఉన్న మద్యం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని వైన్ షాపులకు సంబంధిత యజమానుల ఇండెంట్‌పై కావల్సిన మద్యాన్ని అధికారులు సరఫరా చేస్తున్నారు.