పుష్కర పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
– మంత్రి జగదీశ్‌రెడ్డి
నాగార్జునసాగర్
పుష్కర పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్రవిద్యుత్శాఖమాత్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లో కృష్ణాతీరానగల శివాలయం,సురికివీరాంజనేయస్వామి ఘాట్లను సందర్శించారు. వీఐపీఘాట్ శివాలయంలో చేయాల్సిన మార్పులను అధికారులతో చర్చించారు. ఐదు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పాదన ద్వారా కృష్ణా నదిలోకి విడుదల చేస్తే ఏ ప్రాంతం వరకు నీళ్లు వస్తాయే అడిగి తెలుసుకున్నారు. అలాగే దుస్తులు మార్చుకునేందుకు మధ్యలో గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. సురికివీరాంజనేయ స్వామి ఘాట్ సమీపంలో నదికి అడ్డంగా కట్టవేసి ఘాట్‌లోకి నీటిని మళ్లించాలని ఎస్ఈ రమేశ్‌కు సూచించారు. భక్తులు అసౌకర్యాలకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు..
పాత వీఐపీ ఘాట్‌ను సందర్శించిన మంత్రి
గత పుష్కరాలలో సాగర్‌డ్యాంపై గల చిల్డ్రన్స పార్కు వద్ద నిర్మించిన వీఐపీ ఘాట్‌ను మంత్రి సందర్శించారు. నేటికీ టెయిల్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయని జలాశయంలోకి నీరు వచ్చి చేరితే ఈఘాట్ను వినియోగించుకోవచ్చని అధికారులకు సూచించారు. శివాలయం ఘాట్‌కు అత్యధిక సంఖ్యలో వీఐపీలు వచ్చిన సమయంలో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలుంటాయని జెడ్పీ వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి సూచించారు. దీంతో ఈ ఘాట్‌ను వినియోగంలోకి తేవడానికి ఉన్న అవకాశాలను చూడాలని అధికారులకు సూచనలు చేశారు. మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు గుత్తాసుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,యడవల్లి విజయేందర్‌రెడ్డి,ఎమ్.సీ.కోటిరెడ్డి, కర్నబ్రహ్మనందరెడ్డి,రమావత్ శంకర్‌నాయక్,మలిగిరెడ్డి లింగారెడ్డి,పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి,ఎస్ఈ రమేశ్,డీఈ విజయకుమార్,కృష్ణయ్య,నర్సింహారావు ఉన్నారు.