immolation
-
నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో..
బెంగళూరులో భార్యభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుగుపొరుగు వారు, పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి వాళ్లను నిప్పంటించుకోకుండా ఆపగలిగారు. మహిళ చేతిలోనుంచి అగ్గిపెట్టె లాక్కుని బకెట్లతో నీళ్లు పోశారు. భర్తను కూడా పోలీసులు పట్టుకుని ఆపారు. అనంతరం భార్యాభర్తలపై ట్యాంకర్‌తో నీళ్లు పోశారు. క్షణం ఆలస్యమైన వారు అగ్నికి ఆహుతయ్యుండేవారు. VIDEO : #Bengaluru में घर तोड़ने पर खुद को आग लगाने लगे पति-पत्नि pic.twitter.com/Tp3L2QJDIh — NDTV India (@ndtvindia) October 12, 2022 ఏం జరిగిందంటే? బెంగళూరులో డ్రైనేజీని బ్లాక్ చేసేలా ఉన్న అక్రమ నిర్మాణాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ పురంలోని ఎస్ఆర్ లేఅవుట్లో మురికి కాలువ పక్కనే నిర్మించిన అక్రమ నివాసాన్ని కూల్చేందుకు బుల్డోజర్తో వెళ్లారు. అయితే ఈ ఇంటి యజమానులపైన భార్యాభర్తలు దీన్ని అడ్డుకున్నారు. బుల్డోజర్కు ఎదురుగా నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలు ఉన్నాయని భార్యాభర్తలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఇది కచ్చితంగే అక్రమంగా కట్టిందే అని పేర్కొన్నారు. మురుగు, వర్షం నీరును బ్లాక్ చేసేలా డ్రైనేజీ కాలువపై దీన్ని నిర్మించారని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
సమాధి అవుతా.. సహకరించండి!
భోపాల్: సజీవ సమాధి అయ్యేందుకు అనుమతించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన స్వామి వైరాగ్యానంద ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దిగ్విజయ్ సింగ్ విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. డిగ్గీరాజా గెలవకుంటే సజీవ సమాధి అవుతానని ఆయన ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ చేతిలో దిగ్విజయ్ 3.60 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైరాగ్యానందను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన సజీవ సమాధికి అనుమతి కోరుతూ భోపాల్ కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ‘ప్రస్తుతం నేను కామాఖ్యధామంలో ఉంటున్నాను. మాట నిలబెట్టుకునేందుకు జూన్ 16న మధ్యాహ్నం 2.11 గంటలకు సజీవ సమాధిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. స్థానిక యంత్రాగం నాకు సహకరిస్తుందని నమ్ముతున్నాను’ అని దరఖాస్తులో వైరాగ్యానంద పేర్కొన్నారు. దీనికి అనుమతి ఇవ్వొద్దని తాను భోపాల్ డీఐజీకి లేఖ రాసినట్టు కలెక్టర్ తరుణ్‌కుమార్ పిథోడ్ తెలిపారు. వైరాగ్యానందను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. కంప్యూటర్ బాబాగా గుర్తింపుపొందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి కూడా ఎన్నికల సమయంలో దిగ్విజయ్ సింగ్‌కు మద్దతుగా యజ్ఞయగాదులు, రోడ్‌షోలు నిర్వహించారు. దిగ్విజయ్ స్వయంగా వీటిల్లో పాల్గొన్నారు. -
పాకిస్తాన్ లో సతీ దేవి
అవమానం సహించలేక సతీ దేవి దహనం చేసుకుందని పురాణాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ లో ఒక 18 ఏళ్ల అమ్మాయి అవమానంతో పాటు, అన్యాయాన్ని కూడా సహించలేక తనను తాను దహనం చేసుకుంది. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ముజఫర్ గఢ్ నగరం దగ్గర ఒక 18 ఏళ్ల అమ్మాయి కాలేజీ నుంచి వస్తూండగా ఒక కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన జనవరి 5 న జరిగింది. రేపిస్టు అరెస్టయితే అయ్యాడు కానీ తనదైన పద్ధతిలో పోలీసులను 'మేనేజ్' చేసుకున్నాడు. పోలీసులిచ్చిన రిపోర్టు ఆధారంగా మార్చి 13 న రేపిస్టుకి బెయిల్ వచ్చింది. దీంతో ఆ అమ్మాయి కుంగిపోయింది. అవమానాన్ని, అన్యాయాన్ని భరించలేక పోలీస్ స్టేషన్ కి వెళ్లి దర్యాప్తు అధికారి జుల్ఫికర్ అహ్మద్ పై ఫిర్యాదు చేసింది. ఆ తరువాత అదే స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకుని తనను తాను దహనం చేసుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ఆమె శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. ఈ సంఘటన పాకిస్తాన్ ను కుదిపేసింది. మానవ హక్కుల వాదులు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో మేల్కొన్న పాకిస్తాన్ సర్కారు పోలీసు అధికారి జుల్ఫికర్ అహ్మద్, మరో పోలీసు రాయ్ శహీద్ లను సస్పెండ్ చేసింది.