పాకిస్తాన్ లో సతీ దేవి | Girl immolates self after rapist is set free | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ లో సతీ దేవి

Published Fri, Mar 14 2014 3:12 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

పాకిస్తాన్ లో సతీ దేవి - Sakshi

పాకిస్తాన్ లో సతీ దేవి

అవమానం సహించలేక సతీ దేవి దహనం చేసుకుందని పురాణాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ లో ఒక 18 ఏళ్ల అమ్మాయి అవమానంతో పాటు, అన్యాయాన్ని కూడా సహించలేక తనను తాను దహనం చేసుకుంది.

పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ముజఫర్ గఢ్ నగరం దగ్గర ఒక 18 ఏళ్ల అమ్మాయి కాలేజీ నుంచి వస్తూండగా ఒక కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన జనవరి 5 న జరిగింది. రేపిస్టు అరెస్టయితే అయ్యాడు కానీ తనదైన పద్ధతిలో పోలీసులను 'మేనేజ్' చేసుకున్నాడు. పోలీసులిచ్చిన రిపోర్టు ఆధారంగా మార్చి 13 న రేపిస్టుకి బెయిల్ వచ్చింది. దీంతో ఆ అమ్మాయి కుంగిపోయింది. అవమానాన్ని, అన్యాయాన్ని భరించలేక పోలీస్ స్టేషన్ కి వెళ్లి దర్యాప్తు అధికారి జుల్ఫికర్ అహ్మద్ పై ఫిర్యాదు చేసింది. ఆ తరువాత అదే స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకుని తనను తాను దహనం చేసుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ఆమె శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది.

ఈ సంఘటన పాకిస్తాన్ ను కుదిపేసింది. మానవ హక్కుల వాదులు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో మేల్కొన్న పాకిస్తాన్ సర్కారు పోలీసు అధికారి జుల్ఫికర్ అహ్మద్, మరో పోలీసు రాయ్ శహీద్ లను సస్పెండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement