Import company
-
కొనసాగుతున్న రూపాయి పతనం
ముంబై: అటు ఎగుస్తున్న ముడి చమురు ధరలు... ఇటు పెరుగుతున్న వాణిజ్య లోటు మొదలైన అంశాల దెబ్బతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే బుధవారం ఏకంగా 52 పైసలు క్షీణించి 66.90 స్థాయికి పతనమైంది. ఒకే రోజు ఈ స్థాయిలో పడిపోవడం ఈ ఏడాది ఇది మూడోసారి. అలాగే, ఇది 14 నెలల కనిష్టం కూడా. చివరిసారిగా 2017 ఫిబ్రవరి 22 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. కార్పొరేట్లు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు భారీ ఎత్తున డిమాండ్ నెలకొనడంతో దేశీ కరెన్సీ గణనీయంగా క్షీణించింది. ఒక దశలో ఆర్బీఐ జోక్యం చేసుకున్నట్లుగా కనిపించినప్పటికీ.. పతనానికి అడ్డుకట్ట పడలేదు. మొత్తంమీద గతేడాది ఆరు శాతం పైగా బలపడిన రూపాయి.. ఈ ఏడాది మాత్రం ఆసియా కరెన్సీలన్నింటిలోకెల్లా అత్యధికంగా క్షీణించింది. అటు పౌండు, యూరో, జపాన్ యెన్‌తో పోల్చి చూసినా రూపాయి బలహీనంగా క్లోజయ్యింది. -
4 వారాల కనిష్టానికి రూపాయి
33 పైసలు డౌన్; 64.08 వద్ద క్లోజ్ ముంబై: బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడంతో రూపాయి మారకం విలువ సోమవారం గణనీయంగా తగ్గింది. 33 పైసలు క్షీణించి 64.08 వద్ద ముగిసింది. ఇది నాలుగు వారాల కనిష్ట స్థాయి. విదేశీ నిధులు తరలిపోతుండటం వల్ల స్టాక్ మార్కెట్ క్షీణిస్తున్న ప్రభావం కూడా రూపాయిపై ఉంటోందని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానించారు. గత నెల అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు మెరుగుపడటంతో.. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు గణనీయంగా బలపడింది. జపాన్ యెన్‌తో పోలిస్తే 13 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ఆ ప్రభావం సోమవారం మిగతా మార్కెట్లలోనూ పడింది. చివరిసారిగా ఈ ఏడాది మే 12న డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 64.17 వద్ద క్లోజయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. స్పాట్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 63.75-64.40 శ్రేణిలో తిరుగాడవచ్చని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
3 నెలల కనిష్టానికి రూపాయి
50 పైసలు పతనం ముంబై: బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ మూడు నెలల కనిష్టానికి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 50 పైసలు పతనమై 63.32 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లు నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం కూడా దీనికి కారణమైంది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.82తో పోలిస్తే బలహీనంగా 62.95 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 63.34 స్థాయికి కూడా క్షీణించింది. చివరికి 50 పైసల నష్టంతో 63.32 వద్ద ముగిసింది. చివరిసారిగా జనవరి 6న 63.57 స్థాయి దగ్గర రూపాయి క్లోజయ్యింది. మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ సూచీ 0.03 శాతం మేర పెరిగింది.