impulsive
-
ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..
‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’.‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’.‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది....వీరంతా బతకాల్సిన వారే అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.రోజూ ఇద్దరు..ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.నివారిద్దాం ఇలా..నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి.గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి..ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ప్రతీ సమస్యకు పరిష్కారంఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మానసిక నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలో తమను నమ్ముకొని ఉన్న అమ్మనాన్నలు, భార్యాపిల్లలు, స్నేహితులను ఐదు క్షణాలు తలుచుకుంటే కొంతమేర మార్పు వస్తుంది.– రవివర్మ, మానసిక వైద్యనిపుణుడు, జీజీహెచ్ గోదావరిఖని (చదవండి: Cooking Oil: వంటనూనెలతో ఆ కేన్సర్ ప్రమాదం పొంచి ఉంది..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..
క్షణికావేశం నిండు జీవితాన్ని బలితీసుకుంటోంది. ఓ చోట ఎన్నోఆశలతో పెంచిన కొడుకు, మరోచోట కడవరకు తోడుంటానంటూ ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన భర్త, ఇంకోచోట అన్నీతానై కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటిపెద్ద... ఆత్మహత్యే తమ సమస్యకు పరిష్కారంగా భావించి తనువు చాలిస్తున్నారు. కుటుంబసభ్యులకు తీరని మనోవేదన మిగుల్చుతున్నారు. సాక్షి, వనపర్తి: చిన్నచిన్న కారణాలతో క్షణికావేశానికి లోనవుతూ...ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా..ప్రేమ విఫలమైనా కుటుంబంలో కలహాలు, పరీక్షల్లో తప్పడం.. వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయం...ఆ వ్యక్తి కుటుంబంలో పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తోంది. చనిపోతున్న వారిలో మహిళలు, పురుషులే కాకుండా యువకులే ఎక్కువగా ఉన్నారు. కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇవీ లక్షణాలు... ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధచూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఆందోళన, నిద్రలేకుండా ఉండటం, కంగారు పడటం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు.. ఉద్యోగం రాలేని నిరుద్యోగి... పరీక్షా తప్పానని వి ద్యార్థి... భర్త తిట్టాడని భార్య.. భార్య కాపురానికి రాలేదని భర్త... చేయని నేరానికి నిందమోపారని ఒకరు...ఆరోగ్యం బాగోలేదని మరోకరు ఇలా క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 18నుంచి 35 ఏళ్లలోపు వారే.. ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో 18 నుంచి 35ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారమార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, చిన్న చిన్నగొడవలు, భూసమస్యలు, ఆస్తి తగాదాలు, ఇలా కారణం ఏదైనా ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. 2017లో 82మంది క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోగా..అందులో 23మంది మహిళలు, 59మంది పురుషులు ఉన్నారు. అలాగే 2018లో 107 ఆత్మహత్య చే సుకోగా ..అందులో 33మంది మహిళ లు, 74మంది పురుషులు ఉండగా... 2019లో ఇప్పటివరకు 62మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 18మంది మహిళలు, 46మంది పురుషులు ఉన్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 74మంది మహిళలు, 173మంది పురుషులు ఉన్నారు. ఇందులో యువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ఆత్మహత్యలు.. 2019 నవంబర్ 3న వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలరాజు(28) గత కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురై మిషన్ భగీరథ ట్యాంకు దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8న మదనాపురం మండలం సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్(17) ల్యాబ్‌రూం ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవంబర్ 9 ఘనపురం మండలం అప్పారెడ్డిపల్లిలో బాష(24) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 18న ఘనపురం మండలం సల్కెలాపురంతండాలో పవన్(15) విద్యార్థి పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రితోపాటు ఊరు తీసుకెళ్లలేదనే మనస్థాపంతో విద్యార్థి పవన్ పురుగులమందు తాగాడని గ్రామస్తులు తెలిపారు. గమనించిన తండావాసులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెబంర్ 18న గోపాల్పేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన పద్మమ్మ (76) తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె భర్త కూడా చనిపోవడంతో తీవ్రవనస్థాపానికి గురైన పద్మమ్మ ఒంటిపై కిరోసిన్ నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గమనించి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో మృతిచెందింది. సెప్టెంబర్ 17న వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన వెంకటయ్య (40) తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపు మృతిచెందాడు. అప్పులబాధ ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సెప్టెంబర్ 10న వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి తిరుపతమ్మ కుటుంబసమస్యల కారణంగా పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించడంతో ఆమె కోలుకుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. వారి అభిరుచులు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం శ్రద్ధచూపాలి. సరైన సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో ఒంటరిగా ఫీలవుతారు. దీంతో సమాజంలో మెలిగే స్వభావాన్ని కోల్పోయి తన సమస్యను ఎవరికి చెప్పుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశానికి గురికాకుండా జీవితంలో ఎలా ఎదగాలో ఆలోచించాలి. – కిరణ్‌కుమార్, డీఎస్పీ, వనపర్తి -
స్మార్ట్ ఫోన్‌తో చిత్తవుతారు జాగ్రత్త!
వాషింగ్టన్: మీకు సెల్ ఫోన్ ఉందా అనే మాట మరీ పాతదై పోయి.. మీకు స్మార్ట్ ఫోన్ ఇంకా లేదా అనేంత కొత్త రోజులొచ్చాయి. ఇవి ఏ ఒక్క పట్టణానికో అంటే పొరపడ్డట్లే ఎందుకంటే.. గ్రామాల్లో కూడా వీధివీధిన స్మార్ట్ ఫోన్ల వీర విహారం చూస్తున్నాం. అయితే, వీటి వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు తీరుతున్నాయోకానీ, మానసికంగా మాత్రం బలహీనమైపోతారని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేపనిగా రోజంతా స్మార్ట్ ఫోన్లలో తలలు దూర్చి తెగ చూస్తుండిపోయేవారిలో సహజంగానే అసహనం, తొందరపాటు అనే అవలక్షణాలు అలవోకగా వచ్చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వారు దాదాపు 91మంది యువకులను తమ పరిశీలనకు తీసుకున్నారు. వారిలో ఎక్కువసేపు వీటిని ఉపయోగించేవారిని, తక్కువ సేపు ఉపయోగించేవారిని పలు రకాలుగా పరీక్షించారు. ఇందులో అతిగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారు చిరాకుగా ఉండటమేకాకుండా, చిందరంవందరగా ఉంటూ స్థిమితంగా లేకుండా ప్రవర్తించారట. ఇక తక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వాడేవారు మాత్రం అలా చేయలేదని స్పష్టం చేశారు.