ఢిల్లీ మంత్రికి బెయిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: ఓ వ్యక్తిని హత్య చేస్తానని బెదిరించిన కేసులో ఢిల్లీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్‌కు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. ఓ వ్యక్తిని చంపుతానని, రూ. 30 లక్షలు ఇవ్వకుంటే ఆ వ్యక్తి చేపట్టే నిర్మాణాన్ని కూల్చేస్తానని మంత్రి హుస్సేన్ బెదిరించారంటూ నమోదైన కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మంత్రి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఆరోపణలు చాలా బలమైనవి, క్షమార్హమైనవి కాకపోవడం వల్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి సిద్ధార్థ్ శర్మ తేల్చి చెప్పారు. ఆరోపణలు చేసిన వ్యక్తికి, మంత్రికి మధ్య రాజీ కుదిరిందన్న న్యాయవాది వాదనలను జడ్జి కొట్టిపారేశారు. విషయం చాలా తీవ్రమైనది కావున ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.