Imtiaz Ali (director
-
ఔరా.. సారా
బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ‘కేదార్నాథ్’ సినిమాలో నటించి, ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్న సారా తాజాగా మరో అవకాశాన్ని బ్యాంకులో వేసుకున్నారు. ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే’ చిత్రాల ఫేమ్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందట. ‘కేదార్నాథ్’ సినిమా రషస్ చూసి, సారా నటనకు ఇంతియాజ్ ఇంప్రెస్ అయ్యారని టాక్. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగనుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఇంతియాజ్ దర్శకత్వంలో సారా తండ్రి సైఫ్ అలీఖాన్ ‘లవ్ ఆజ్ కల్’ (2009) అనే సినిమాలో నటించారు. ఇక అభిషేక్ కపూర్ దర్శకత్వంలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా రూపొందిన ‘కేదార్నాథ్’ డిసెంబర్ 7న విడుదల కానుంది. అలాగే టెంపర్ హిందీ రీమేక్ ‘సింబా’ డిసెంబర్ 28న విడుదల కానుంది. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకముందే వరస చాన్స్‌లను దక్కించుకుంటూ ‘ఔరా.. సారా’ అనిపించుకుంటున్నారు. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మిథున్ చక్రవర్తి (నటుడు); ఇంతియాజ్ అలి (దర్శకుడు, రచయిత) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరమంతా సంతోషాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారు. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలలో పట్టు సాధిస్తారు. సద్గురువుల సాంగత్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రచయితలు, వక్తలు, సంగీత గురువులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు అనుకూలించవు కాబట్టి, వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పడి సంసార జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు సూచనలు: కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వటం, గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, గురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు