
సారా అలీఖాన్
బాలీవుడ్‌లో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ‘కేదార్‌నాథ్’ సినిమాలో నటించి, ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్న సారా తాజాగా మరో అవకాశాన్ని బ్యాంకులో వేసుకున్నారు. ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే’ చిత్రాల ఫేమ్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందట. ‘కేదార్‌నాథ్’ సినిమా రషస్ చూసి, సారా నటనకు ఇంతియాజ్ ఇంప్రెస్ అయ్యారని టాక్.
లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగనుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఇంతియాజ్ దర్శకత్వంలో సారా తండ్రి సైఫ్ అలీఖాన్ ‘లవ్ ఆజ్ కల్’ (2009) అనే సినిమాలో నటించారు. ఇక అభిషేక్ కపూర్ దర్శకత్వంలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా రూపొందిన ‘కేదార్‌నాథ్’ డిసెంబర్ 7న విడుదల కానుంది. అలాగే టెంపర్ హిందీ రీమేక్ ‘సింబా’ డిసెంబర్ 28న విడుదల కానుంది. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకముందే వరస చాన్స్‌లను దక్కించుకుంటూ ‘ఔరా.. సారా’ అనిపించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment