incorrect
-
నిమ్స్ ఆసుపత్రికి లోకాయుక్త నోటీసులు
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. వార్షిక ఆదాయ వ్యయాలపై లెక్కలు సరిగా లేవని, ఆడిటింగ్‌కు సహకరించడం లేదని ఆడిట్ శాఖ ఈమేరకు లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో నిమ్స్ లెక్కలపై డొల్లతనం బయటపడుతోంది. ♦ నిమ్స్‌లో ఆదాయం-వ్యయాలపై యాజ మాన్యం ఆజమాయిషీ ఉండడం లేదు. దీంతో చెల్లింపులు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఒక అధికారికి ఒకే నెలలో రెండుమార్లు వేతనం జమ అయినట్లు తెలుస్తోంది. ♦ లాగే ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.5 లక్షలు రెండుమార్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ♦ మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా సరిగా ఉండడం లేదు. ఇప్పటికి నాలుగుసారు ఈ–టెండర్లు పిలవడం..రద్దు చేయడం ద్వారా వృథా ఖర్చులు పెంచుతున్నారు. ♦ ఇక వార్షిక గణాంకాలను సక్రమంగా నిర్వహించని కారణంగా టీడీఎస్ రూపంలో నిమ్స్ ఖజానాకు గండి పడుతోంది. సరైన లెక్కలు చూపిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 10 శాతం నిధులు టీడీఎస్ రూపంలో మిగిలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ♦ ఆస్పత్రికి ఏటా రూ.250 నుంచి 280 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుపై నియంత్రణ లేదు. ఆజమాయిషీ..రోజు వారి లెక్కలు చూసే నాథుడే లేడు. ♦ క్రమం తప్పకుండా లెక్కలు చూపితే.. టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదని, వాస్తవానికి ఆస్పత్రులకు టీడీఎస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, నిమ్స్‌లో మాత్రం టీడీఎస్ చెల్లిస్తున్నారని ఓ సీనియర్ అధికారి వాపోయారు. ♦ ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ శాఖ లెక్కల విషయంలో నిమ్స్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఆడిట్ నిర్వహణకు అధికారులు సహకరించడం లేదని ఆడిట్ అధికారిగా వ్యవహరిస్తున్న పి.కోటేశ్వరరావు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన (ఫిర్యాదు నెం.1771/14/బి1) లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు జమాఖర్చుల నివేదికతో హాజరు కావాల్సిందిగా నిమ్స్ యాజమాన్యానికి లోకాయుక్త నోటీసు(నెం.1771/2014/బి1/లోక్/5571/2021) జారీ చేసింది. ఆడిట్ అధికారుల వైఫల్యమా? ఇదిలా ఉండగా ఆడిట్ అధికారుల వైఫల్యం కారణంగానే నిమ్స్ లెక్కల వ్యవహారం అస్తవ్యస్థంగా తయారైందని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఓ అధికారి ఆరోపించారు. ఆడిట్ చేసేందుకు ముందుకు రాకుండా నిమ్స్ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆ అధికారి నిలదీయడం గమనార్హం. -
తప్పుడు అంచనాల వల్లే తీవ్ర ఇబ్బందుల్లో భారత్: ఆంటోని ఫౌసీ
వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తూ భారత ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా కట్టడి విషయంలో ముందస్తు అంచనాలు తప్పుగా వేయడంతోనే భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కారణమని అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ తెలిపారు. కరోనా అంతమైందన్న తప్పుడు అభిప్రాయంతో భారత్‌లో ప్రభుత్వాలు అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చాయి. దాని ఫలితమే ప్రస్తుత కరోనా వీర విహారానికి మూలమని ఆయన అన్నారు. మంగళవారం ఆయన సెనేట్ హెల్త్, ఎడ్యూకేషన్, లేబర్ పెన్షన్ కమిటీకి కొవిడ్‌పై విచారణ సందర్భంగా చెప్పారు. తప్పుడు అంచనాలే కొంప ముంచాయి క్లిష్ట పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని భారత్‌లో సెకండ్ వేవ్ విలయం ద్వారా ప్రపంచానికి కూడా అర్థమవుతుందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధతపై తెలుసుకోవచ్చునని, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటూ వెళ్లాలని అవసరాన్ని సైతం నొక్కి చెబుతుందన్నారు. ప్రపంచ మహమ్మారులపై పోరాటంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పోరాటం చేయలేదని.. ప్రపంచ దేశాలన్ని ఏకమై బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఏ దేశంలో వైరస్ ఆనవాళ్లు మిగిలి ఉన్నా.. తిరిగి ప్రపంచం మొత్తం విస్తరించే ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి విషయంలో అప్రమత్తత అవసరమని హెచ్చరించారు. ( చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌పై కీలక సూచనలు చేసిన డబ్యూహెచ్‌వో ) -
వారం పేరు తప్పేసి... అచ్చేశారు
సిడ్నీ: ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరం ముస్తాబైంది. అయితే ప్రారంభోత్సవ టికెట్లను అచ్చుతప్పులతో ముద్రించి నిర్వాహకులు అభాసుపాలయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ మొదలవుతున్న రోజు బుధవారమైతే గురువారం అని ముద్రించడం విమర్శలపాలైంది. ఏప్రిల్ 4న నిర్వహించ తలపెట్టిన ప్రారంభ వేడుకల్ని గురువారం అని 14 వేల టికెట్లలో ముద్రించారు. నిజానికి ఏప్రిల్ 4 బుధవారం. తప్పుదొర్లిన మాట నిజమేనని అంగీకరించిన నిర్వాహకులు తిరిగి సరిదిద్దుకొని ముద్రించే ఆలోచనేది లేదని స్పష్టం చేశారు. ‘అంతా సవ్యం గానే సాగుతున్న దశలో తప్పుగా టికెట్లు అచ్చువేయడం నిరాశపరిచింది. ప్రింటింగ్ సంస్థ ఇలాంటి తప్పు చేసి ఉండాల్సింది కాదు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సింది. అయితే ఇప్పటికే ఏప్రిల్ 4వ తేదీ ప్రారంభోత్సవమని పాకిపోయింది. మళ్లీ బుధవారమని ముద్రించాల్సిన అవసరం లేదు. ఈ టికెట్లే చెల్లుబాటవుతాయి ’ అని గేమ్స్ చీఫ్ పీటర్స్ మీడియాతో అన్నారు. -
ప్రభుత్వ గ్యాస్ ధరల ఫార్ములా సరికాదు
♦ ఈ ఫార్ములాను సమీక్షించండి ♦ కేంద్రాన్ని కోరిన ఓఎన్జీసీ న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యాస్ ధరల ఫార్ములా సరైనది కాదని ప్రభుత్వ రంగ సంస్థ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొ(ఓఎన్జీసీ) పేర్కొంది. కేజీ బేసిన్లో గ్యాస్ అన్వేషణల అభివృద్ధి ఈ ధరల ఫార్ములాతో సాధ్యం కాదని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఓఎన్జీసీ నివేదించింది. అందుకని ఈ ధరలను సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరామని ఓఎన్జీసీ సీఎండీ దినేశ్ కె. సరాఫ్ చెప్పారు. గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్న అమెరికా, రష్యా, కెనడా దేశాల్లోని ధరల ఫార్ములా ఆధారంగా 2014లో ప్రభుత్వం కొత్తగా ఈ ధరల ఫార్ములాను రూపొందించింది. ఈ ఫార్ములా ప్రకారం ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్‌కు ధర 4.24 డాలర్లుగా ఉంది. కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో బ్లాక్‌లు భారీ లోతులో ఉన్నాయని, వీటినుంచి గ్యాస్ అన్వేషణ, వెలికితీతకు భారీగా పెట్టుబడులు పెట్టాలని, ఈ పెట్టుబడుల పరంగా చూస్తే ప్రభుత్వం ప్రతిపాదించిన ధర సరిపోదని సరాఫ్ వివరించారు. కేజీ-డీ5 బ్లాక్‌లో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కోసం సవివరమైన ఫైల్డ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎఫ్డీపీ)ని చమురు రంగ నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ైెహ డ్రోకార్బన్స్(డీజీహెచ్)కు నివేదించామని తెలిపారు. అయితే ఈ ఎఫ్డీపీలో ఎలాంటి పెట్టుబడుల వివరాలను పొందుపరచలేదని తెలిపారు. 2018-19 కల్లా రోజులకు 77 వేల బ్యారెళ్ల చమురును, 14 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్ల గ్యాస్ ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని తెలిపారు. -
ద్రవ్యలోటు ఆధారిత వృద్ధి సరికాదు
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: ద్రవ్యలోటును పెంచుకుంటూ... అదనపు రుణాలు తీసుకునే ఆర్థిక వ్యవస్థ మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ద్రవ్య క్రమశిక్షణ నుంచి దూరం జరగడం ఆర్థిక స్థిరత్వానికే ముప్పు తెస్తుందని రాజన్ హెచ్చరించారు. శుక్రవారమిక్కడ సీడీ దేశ్‌ముఖ్ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలే ప్రపంచం ఆర్థిక అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశాన్ని ఇబ్బందికి గురిచేయరాదన్నారు. ద్రవ్యలోటు పెరగడం వల్ల బాండ్లకు సంబంధించి ప్రభుత్వంపై రుణ భారం పెరగడమే కాకుండా... భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సమస్యలను సైతం తెచ్చిపెడుతుందని విశ్లేషించారు. ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ కలిసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తగిన చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయోజనాలను పరిశీలించాలి... ప్రభుత్వ వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఎంతమేరకు లాభిస్తాయన్న విషయాన్ని సైతం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ఈ వ్యయాల వల్ల ప్రభుత్వ రుణ భారం పెరగరాదన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల మొత్తం ద్రవ్యలోటు 2014లో 7 శాతం ఉంటే... అది 2015లో 7.2 శాతానికి పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అమల్లోకి రానున్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీల పునరుద్ధరణ పథకం ఉదయ్ వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతుంది’’ అన్నారాయన. నిజానికి 2015-16లో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.6%కి తగ్గించాల్సి ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వాయిదా వేసింది. లక్యంలో 88 శాతానికి ద్రవ్యలోటు.. న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి (ఏప్రిల్-డిసెంబర్) లక్ష్యంలో 88 శాతానికి చేరింది. 2015-16లో ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.55 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం). అయితే డిసెంబర్ ముగిసే నాటికి ఈ మొత్తం రూ.4.88 లక్షల కోట్లకు చేరిందని తాజా గణాంకాలు వెల్లడించాయి.