Independenceday celebrations
-
చైనా పేరెత్తడానికి భయమెందుకు?
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్న చైనా పేరును ఎత్తడానికి పాలకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా బలగాలను వెనక్కి పంపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేసింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని పేర్కొంది. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ తీసుకున్న నిర్ణయాలపై దేశమంతా ఏకతాటిపైకి వచ్చి పాలకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది. ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాలను హరిస్తున్న వాళ్లపై ఒక్కటిగా పోరాడటమే నిజమైన జాతీయవాదం అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాల శనివారం నరేంద్ర మోదీ సర్కారు తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చైనా పేరును ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.(ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) కాగా 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘‘ భారత ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసు బలగాల సేవల పట్ల మనమంతా గర్వపడుతున్నాం. శత్రువుల దాడి నుంచి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ రక్షణగా నిలుస్తున్నందున 130 కోట్ల మంది భారతీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని తలచుకుని గర్విస్తున్నారు. కానీ మన పాలకులు మాత్రం ఎందుకో చైనా పేరును ఎత్తడానికి చాలా భయపడుతున్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిన విషయాన్ని దాచిపెడుతున్నారు. దీని గురించి మనమంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. (కనీస వివాహ వయస్సు నిర్ధారణకై కమిటీ) అదే విధంగా ఆత్మనిర్భర్ గురించి ప్రసంగాలు చేస్తున్న వారు, దానికి పునాది వేసింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభబాయ్ పటేల్ సహా స్వాతంత్ర్య సమరయోధులు అని గుర్తు పెట్టుకోవాలి. రైల్వే, ఎయిర్‌పోర్టులు వంటి 32 ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారో మనం సర్కారును నిలదీయాలి. ఎల్ఐసీ, ఎఫ్‌సీఐని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో ప్రశ్నించాలి. స్వేచ్ఛను హరిస్తున్న వారిపై పోరాటానికి సిద్ధం కావాలి’’ అంటూ మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరు కారణంగా సీనియర్ నేత ఏకే ఆంటోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ, సూర్జేవాల తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న శత్రుదేశ సైన్యాలకు భారత జవాన్లు దీటుగా జవాబిస్తున్నారని, వారి త్యాగఫలితంగానే మనమంతా సురక్షితంగా ఉన్నామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలి: మోదీ
సాక్షి, ఢిల్లీ : ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ' రక్షణ దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనం. ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితిలో ఉంది. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కృషి చేస్తున్నారు. కరోనా వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నా.కరోనా ఒక్కటే కాదు.. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయి అంటూ తెలిపారు.' అంటూ మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలి : '75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో సాధించాం. ప్రాణత్యాగం చేసి మన పూర్వీకులు స్వాతంత్ర్యం తెచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలి.ఆధునిక కావాల్సిన వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన రైతులు నిరూపించి చూపారు. భారత్‌ను ఆకలిరాజ్యం నుంచి అన్నదాతగా మార్చారు. మన రైతులే స్ఫూర్తిగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ సాధిద్దాం. భారత్ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. మన శక్తిని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలి. చైనా వస్తువులను నిషేధిద్దాం : 'చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇతర దేశాల వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అని నిరూపిద్దాం. ఒక నాడు భారత వస్తువులు అంటే ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. కరోనా కష్టకాలంలో కూడా మనం కొత్తదారులు వెతుక్కుందాం. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం. భారత్‌లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఎఫ్‌డీఐల విషయంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టాం.' అంటూ పేర్కొన్నారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం : నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించనున్నాం.ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ ఐడీ ఇచ్చేలా ఏర్పాట్లు. కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాం. మూడు వ్యాక్సిన్లు తుది పరీక్షల దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తల కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఇతర దేశాల వస్తువులను పూర్తిగా నిషేధించాలి. మన ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం కల్పిద్దాం. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తీసుకొద్దాం. మేకిన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్లాలి. దేశ వ్యాప్తంగా 22 కోట్ల మంది మహిళలకు జన్‌థన్ ఖాతాలు ఉన్నాయి. మహిళల వివాహ వయస్సుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఒకే కార్డు.. ఒకే దేశం లాంటి పథకాలు తీసుకొచ్చాం. 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లో మహిళలకు హక్కులు లభించాయి. సరిహద్దులు దాటేవారికి సైన్యం గుణపాఠం నేర్పింది. దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఒకటే సమాధానం 'అంటూ మోదీ ప్రసంగించారు. కాగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. కరోనా నేపథ్యంలో 150 మందిని మాత్రమే వేడుకలకు అనుమతించారు. ఈ సందర్భంగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఇక, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందే.. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రధాని మోదీపై చిదంబరం ప్రశంసలు!
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలోని మూడు అంశాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రశంసించారు. జనాభా పెరుగుదల భవిష్యత్తు తరాలను ఏ విధంగా నాశనం చేస్తుందో మోదీ వివరించిన విధానం బాగుందన్నారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని చేసిన ఈ మూడు ప్రకటనలను మనమందరం స్వాగతించాలి. చిన్న కుటుంబాలను కలిగి ఉండటమే దేశభక్తి, ప్లాస్టిక్ నిషేధం దిశగా చర్యలు, సంపద సృష్టికర్తలను గౌరవించాలి’’ అన్న మోదీ మాటలను చిదంబరం ట్విటర్లో ఉటంకించారు. కాగా ఎర్రకోటలో తన ప్రసంగంలో భాగంగా జనాభా విస్పోటనం, ప్లాస్టిక్ నిషేదం, సంపద సృష్టి కర్తలను గౌరవించడం తదితర అంశాలపై మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. సంపద సృష్టి గొప్ప జాతీయ సేవ అని మోదీ అన్నారు. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుందని, దీనిపై ఆక్టోబర్ 2 నాటికి మార్పు తీసుకు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ మూడు అంశాలపైన ప్రధాని దృక్పథం బాగుందని చిదంబరం కొనియాడారు. మొదటి, చివరి సందేశాలను ఉద్ధేశించి ప్లాస్టిక్ నిషేదం, జనాభా నియంత్రణ అంశంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనికోసం వందలమంది వాలంటీర్లు క్షేత్ర స్థాయి నుంచి కృషి చేయాలని చిదంబరం సూచించారు. -
షూ తీయకుండానే జెండా ఎగురవేశారు
సాక్షి, చెన్నారావుపేట(వరంగల్) : భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరు జాతీయ జెండాను గౌరవించాల్సిందే.. ఓ దేవాలయానికి వెళితే దేవును ముందు చెప్పులు దూరంగా విడిచి మొక్కులు చెల్లించడం, పూజలు చేయడం జరుగుతుంది. అలాంటి దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో అన్ని మాతాలు గౌరవించే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టే సమయంలో ఏఎస్సై సాంబరెడ్డి వేసుకున్న షూ తీయకుండానే జాతీయ జెండాను అవమానించారు. పైగా అక్కడ ఉన్న పలువురు షూ తీయాలని చెప్పిన ఏమి కాదులే అని అమర్యాదగా మాట్లాడం పలువురిని విస్మయానికి గురిచేసింది. -
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, సిటీబ్యూరో: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో పోలీస్ విభాగం అప్రమత్తమైంది. గోల్కొండ కోటపై డేగకన్ను వేసింది. కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో నిఘా విభాగాల హెచ్చరికలతో ఈసారి భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. కోటతో పాటు చుట్టపక్కల ప్రాంతాలు, రహదారులను నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆయా మార్గాల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు కెమెరాలు ఏర్పాటు చేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బషీర్‌బాగ్ పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానించింది. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేసింది. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ నిఘా ఉపకరించనుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా గోల్కొండ కోట చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేసే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండే సీసీసీలోని అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరించేందుకు ఉపయోగించనున్నారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే గోల్కొండ కోటతో పాటు గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు నగర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్‌కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్‌బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్‌బాటిళ్లు తదితర తీసుకురావడం నిషేధించారు. ఈ మేరకు అంజనీకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసరమై ఎవరైనా తీసుకొచ్చినా కచ్చితంగా సోదా చేయాలని నిర్ణయించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. లాడ్జిలు, అనుమానిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. 900 మంది సిబ్బంది... వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ విభాగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. గురువారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు 900 మంది ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి అక్కడి నుంచి ముఖ్యమంత్రి గోల్కొండలో జరిగే వేడుకలకు వెళ్లే అవకాశం ఉంది. వేడుకలు జరిగే సమయాలలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత వంటివి ఆయా రూట్లలో చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. గోల్కొండ కోటలో జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో వీఐపీలు, ప్రజలు హాజరవుతున్నారని అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ విభాగాలుగా చేసి ప్రభుత్వం నుంచి పాసులు జారీ అవుతున్నాయి. ఆయా పాసులు కల్గి ఉన్న వారికి పాస్ వెనకాల పార్కింగ్ స్థలం, గోల్కొండలో జరిగే వేడుకలకు వచ్చే మార్గం వంటి సూచనలు కూడా ఉన్నాయి. పార్కింగ్ స్థలాల నుంచి వేడుకల వరకు దూరం ఎక్కువగా ఉంటే అక్కడి పరిస్థితులను బట్టి బస్సులను కూడా ఆయా విభాగాలు ఏర్పాటు చేయనున్నాయి. వర్షం పడితే ఇబ్బందులు ఎదురుకాకుండా వచ్చే వారి కోసం కావాల్సిన గొడుగులను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తేనుంది. పాస్‌లు కలిగిన వారు పోలీసులకు స్పష్టంగా కన్పించే విధంగా దాన్ని కారుకు ముందుభాగంలో ఎడమవైపు అద్దాలకు అంటించుకోవాలని, విధి నిర్వహణలో ఉండే పోలీసులకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని కోరుతున్నారు. వేడుకలు పూర్తయిన తరువాత వారికి సూచించిన మార్గంలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. ♦ గురువారంఉదయం7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలకు మాత్రమే ఉదయం 7:30 గంటల నుంచి 10 గంటల వరకు ఈ రూట్లోకి అనుమతిస్తారు. ♦ సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలా నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని, బాలిక భవన్, ఆంధ్రా ఫ్లోర్ మిల్స్, ప్లైఓవర్, లంగర్‌హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బాండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయి. సీఎస్ పరిశీలన గోల్కొండ: సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులకు సూచించారు. మంగళవారం గోల్కొండ కోటలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి సీఎం కాన్వాయ్ రీహార్సల్స్‌ను పర్యవేక్షించా రు. అనంతరం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కాన్వాయ్ వచ్చే మార్గానికి ఇరువైపులా భద్రతా సిబ్బందికి తప్ప మిగతా ఎవరూ ఉండకూడదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధిపతి ఎం.కె.సింగ్ ఆధ్వర్యంలో జరిగిన పతావిష్కరణ రిహార్సల్స్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సెక్యూరిటీ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
మహాత్ముని స్పూర్తితో వైఎస్సార్సీపీ ముందుకెళ్తుంది
-
అన్నిరంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది
-
వివాదస్పదంగా మారిన జెండా వందనం
-
సాగర తీరంలో స్వాతంత్య్రదిన వేడుకలపై సమీక్ష
విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖ సాగర తీరంలో నిర్వహిస్తున్న స్వాతంత్య్రదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి (పొలిటికల్) ముకేష్‌కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బుధవారం విశాఖ నగరంలో పర్యటించారు. తొలుత వేడుకలు నిర్వహించనున్న బీచ్‌రోడ్డు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో కలసి ఏర్పాట్లను సమీక్షించారు. విశాఖలో తొలిసారిగా జరుగుతున్న రాష్ర్ట స్థాయి స్వాతంత్య్ర వేడుకలను చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు సహా సుమారు వెయ్యి మందికి పైగా వీఐపీలు, వీవీఐపీలు పాల్గోనున్న ఈ మహా వేడుకలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదన్నారు. ప్రజలందరూ ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. ఈ సమీక్షలో జేసీ జే.నివాస్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకుడు డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.