India-Bangladesh border
-
59th Raising Day : పాక్, బంగ్లా సరిహద్దుల్లో పటిష్ట భద్రత
హజారీబాగ్: భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సరిహద్దులను దుర్భేద్యంగా మార్చబోతున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో అసంపూర్తిగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శుక్రవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) 59వ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేళ్లలో భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కంచెలో అక్కడక్కడా ఖాళీలు ఉండేవని, ఆ ఖాళీల గుండా చొరబాటుదారులు, స్మగ్లర్లు సులభంగా మన దేశంలోకి ప్రవేశించేవారని గుర్తుచేశారు. ఆ ఖాళీల్లోనూ కంచె నిర్మాణం పూర్తయ్యిందని, తూర్పు, పశి్చమ సరిహద్దుల్లో మరో 60 కిలోమీటర్లే కంచె ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. -
Womens empowerment: ఉక్కు దళం
ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం... పచ్చని అడవి... చల్లని నది ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే చాప కింద నీరులా సంఘవిద్రోహశక్తులు వికటాట్టహాసం చేస్తుంటాయి. తమకు ఎదురు లేదని కొమ్ములు విసురుతుంటాయి. సంఘవిద్రోహశక్తుల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి ‘ఓన్లీ ఉమెన్’ దళం రంగంలోకి దిగింది. స్త్రీ సాధికారతకు పట్టం కట్టేలా బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో మరో అడుగు పడింది. తాజాగా ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు విధులు నిర్వహించనున్నారు. ప్రసిద్ధ సుందర్ బన్ అడవుల్లో కొంత భాగం మన దేశంలో, కొంత భాగం బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సరిహద్దును ఆనుకొని ఉన్న అడవులు, చిన్న దీవులు, నదులు అనేవి సంఘ విద్రోహశక్తులకు అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అయింది. దీనికోసం బీఎస్ఎఫ్ సట్లెజ్, నర్మద, కావేరి, సబర్మతి, క్రిష్ణ, గంగ పేర్లతో బీవోపి (బార్డర్ ఔట్ పోస్ట్) లను ఏర్పాటు చేసింది. ‘బీవోపి’కి చెందిన ‘గంగ’ మహిళా జవానులు తొలిసారిగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన నిఘా విధులలో భాగం అవుతున్నారు. మనుషుల అక్రమ చొరబాటు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు దొంగల నుంచి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి జాలర్లను రక్షించే బాధ్యతలు కూడా ‘బీవోపి–గంగ’పై ఉన్నాయి. స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజలను సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాల్సి ఉంటుంది. ‘బీవోపి–గంగ’కు ఉపయోగించే మోటర్ బోట్‌ను కొచ్చిలో తయారుచేశారు. దీనిలో 35 మంది జవాన్లకు చోటు ఉంటుంది. అత్యాధునిక రాడార్, కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. ‘బీవోపీ–గంగ తన సత్తా చాటబోతోంది. పోరాట పటిమ ప్రదర్శించబోతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాల్లో కొందరు స్త్రీలు కూడా భాగం అవుతున్నారు. ఇకముందు వారిని అదుపులోకి తీసుకోవడం సులభం అవుతుంది’ అంటున్నారు సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్ఎఫ్ డిఐజీ అమ్రిష్ ఆర్యా. -
భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్ గోడలు
కోల్‌కతా: భారత్–బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో చొరబాట్లను నియంత్రించేందుకు లేజర్ గోడలను, స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదీతీర ప్రాంతాలు, భౌతికంగా కంచె వేయలేని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేస్తారు. మరికొన్ని నెలల్లో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని బీఎస్ఎఫ్ అనుకుంటోంది. ఇప్పటికే భారత్–పాకిస్తాన్ సరిహద్దులో పారామిలిటరీ దళాలు ఫర్హీన్ లేజర్ గోడలను ఏర్పాటు చేయగా అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు 4,096 కిలోమీటర్లు కాగా ఇందులో 2,216.7 కిలోమీటర్ల భూభాగం పశ్చిమ బెంగాల్లో ఉంది. బెంగాల్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 81.7 కిలోమీటర్ల పాటు కంచె నిర్మాణం కోసం భూమిని బీఎస్ఎఫ్కు కేటాయించేందుకు బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ‘లేజర్ గోడలు నిర్మించడానికి అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నాక ప్రయోగాత్మకంగా మరికొన్ని నెలల్లోనే ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాం. లేజర్లు, సెన్సార్లు ఉంచాల్సిన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామ’మని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. -
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భూకంపం
కోల్‌కతా: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. బంగ్లాదేశ్‌లో చిట్టాగాంగ్‌కు ఈశాన్య ప్రాంతంలో 27 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీట్లర లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.