India Book of Record
-
పాలమ్మినా..పూలమ్మినా...రికార్డుల్లోకెక్కినా...
-
పిట్ట కొంచెం.. కూత ఘనం
కడప అర్బన్: కేవలం రెండు సంవత్సరాల 11 నెలల పసిప్రాయంలోనే చిన్నారి లక్షర ఆద్య సోమలరాజు అరుదైన రికార్డును సాధించింది. వివరాల్లోకెళితే.. కడప చిన్నచౌక్ శ్రీనగర్‌కాలనీలో నివసించే సోమలరాజు జగదీష్‌రాజు, హిమబిందు దంపతుల కుమార్తె లక్షర ఆద్య ఏకసంథాగ్రహి. తల్లిదండ్రులు ఏదైనా ఒక్కసారి చెబితే గుర్తుంచుకుని వెంటనే అప్పచెప్పేది. చిన్నారి ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు పాపకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల పలువురి ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గురించి తెలుసుకుని ప్రతిభను నిర్వాహకులకు వివరించారు. దేశ వ్యాప్తంగా వేలాదిమంది పోటీపడ్డారు. అందులో అతి పిన్నవయసులో విజేతగా నిలిచి వైఎస్సార్ జిల్లా కీర్తిని పతాకను ఎగరేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పాప ఏం చేసిందంటే.. 8 గ్రహాలు, విష్ణువు అవతారాలు, రాష్ట్రాలు, రాజధానులు, ప్రముఖ వ్యక్తులు, శరీర భాగాలు, కూరగాయలు, పండ్లు, 118 వివిధ రకాల వస్తువుల పేర్లు, క్యాలెండర్లో నెలలు, వారంలో రోజులు, 16 జాతీయ చిహ్నాలు, 17 రంగులు, 19 మ్యాథమేటికల్ షేప్స్, 22 క్రీడలు, నిర్వాహకులు అడిగిన 26 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను అనర్గళంగా చెప్పింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులను, పోటీపడిన వారిని అబ్బురపరుస్తూ ఘనతను చాటింది. చినానరికి జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందన చిన్నారి లక్షర ఆద్య తల్లిదండ్రులు జగదీష్ రాజు, హిమబిందు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కలిశారు. చిన్నారికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అందజేసిన సర్టిఫికెట్, జ్ఞాపికలను చూపారు. జిల్లా ఎస్పీ లక్షర ఆద్య ప్రతిభను అభినందించి ఆశీర్వదించారు. -
నాలుగేళ్లకే 198 రాజధానుల పేర్లు చెప్పి...రికార్డు సృష్టించింది
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): నాలుగేళ్లకే 198 దేశాలు.. వాటి రాజధానులు టకటకా చెప్పేసింది. అదీ కేవలం రెండున్నర నిమిషాల్లో.. చాలా మందికి అసాధ్యమనుకునే ఈ ఘనతను సాధించి రికార్డులకెక్కింది. స్కూల్ ముఖం కూడా చూడని ఆ వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు లిఖించుకుంది. ఆమే ఎండాడకు చెందిన దత్తు ప్రకాష్, దత్తు అపర్ణల ముద్దుబిడ్డ దత్తు శ్రీ నందన. శ్రీనందన చిన్నప్పటి నుంచి టీవీ, మొబైల్‌కు వంటి వాటికి ఆకర్షణకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించారు. చిన్నారిలో అంతర్లీనంగా దాగి ఉన్న తెలివితేటలు, జ్ఞాపకశక్తిని గుర్తించి.. కథలో పాటు జనరల్ నాలెడ్జ్ అంశాలు వివరించే ప్రయత్నం చే శారు. అలా 198 దేశాల పేర్లు, రాజధానులు నేర్పించారు. నాలుగేళ్లకే అవన్నీ గుర్తుకు పెట్టుకున్న నందన కేవలం రెండున్నర నిమిషాల్లోనే దేశాలు– రాజధానులు టకటకా చెప్పి.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం చిన్నారి వయసు ఏడేళ్లు. ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం దేశాలు వాటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సరిహద్దులను ఠక్కున చెబుతోంది. ఈ చిన్నారి తన మైండ్‌లో గ్లోబ్ మొత్తం గుర్తుకు పెట్టుకుంది. ప్రపంచ దేశాలు, నాలుగు సరిహద్దులకు సంబంధించి దాదాపు 800 ప్రశ్నలకు సమాధానాలను కొన్ని సెకన్లలో చెప్పేస్తోంది. ఇది కేవలం మైండ్ మ్యాపింగ్ అనే పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యమని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఈవెంట్‌తోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం ప్రయత్నం చేసింది. ఇటీవల పిక్ ఏ బుక్ వేదికపై జరిగిన ఈవెంట్లో న్యాయనిర్ణేతల సమక్షంలో శ్రీనందన ప్రదర్శనను రికార్డ్ చేసి.. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నాటి కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ మొదలు స్థానిక నాయకులు, గాయకులు, ప్రముఖులు ఇలా ఎందరో శ్రీనందనను ప్రశంసించారు. పలు టీవీ షోలు, ఎఫ్‌ఎంలలో శ్రీనందన తన అనుభవాలను పంచుకుంది. (చదవండి: ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ) -
ఐదేళ్ల బాలుడికి గౌరవ డాక్టరేట్
చెన్నై: అసాధారణ తెలివితేటలతో మూడు సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్న బాలమేధావి కిరణం ధీరజ్(5)కు వరల్డ్ రికార్డు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. సోమవారం ఢిల్లీలోని ఈ వర్సిటీలో అతనికి దీన్ని ప్రదానం చేయనున్నారు. తెలుగు దంపతులు కల్యాణ్, వీణల కుమారుడైన ధీరజ్ చెన్నైలో యూకేజీ చదువుతున్నాడు. అతడు రెండో ఏటే 2 నిమిషాల 19 సెకన్లలో 215 జాతీయ పతాకాలను గుర్తుపట్టాడు. మూడున్నరేళ్లప్పుడు 83 మంది శాస్త్రవేత్తల పేర్లను, వారి ఆవిష్కరణలను ఒక నిమిషంలో చెప్పాడు. వరల్డ్ మ్యాప్ పజిల్‌ను 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేశాడు.