ఐదేళ్ల బాలుడికి గౌరవ డాక్టరేట్ | Five-year-old boy with an Honorary Doctorate | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాలుడికి గౌరవ డాక్టరేట్

Published Mon, Sep 29 2014 1:44 AM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM

ఐదేళ్ల బాలుడికి గౌరవ డాక్టరేట్ - Sakshi

ఐదేళ్ల బాలుడికి గౌరవ డాక్టరేట్

చెన్నై: అసాధారణ తెలివితేటలతో మూడు సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్న బాలమేధావి కిరణం ధీరజ్(5)కు వరల్డ్ రికార్డు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. సోమవారం ఢిల్లీలోని ఈ వర్సిటీలో అతనికి దీన్ని ప్రదానం చేయనున్నారు. తెలుగు దంపతులు కల్యాణ్, వీణల కుమారుడైన ధీరజ్ చెన్నైలో యూకేజీ చదువుతున్నాడు. అతడు రెండో ఏటే 2 నిమిషాల 19 సెకన్లలో 215 జాతీయ పతాకాలను గుర్తుపట్టాడు. మూడున్నరేళ్లప్పుడు 83 మంది శాస్త్రవేత్తల పేర్లను, వారి ఆవిష్కరణలను ఒక నిమిషంలో చెప్పాడు. వరల్డ్ మ్యాప్ పజిల్‌ను 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement