India Companies established in 1920
-
భారత ‘ఎ’ జట్టులో షబ్నమ్, యశశ్రీ
ముంబై: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత ‘ఎ’ జట్టుకు కేరళకు చెందిన ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్, హైదరాబాద్ అమ్మాయి సొప్పదండి యశశ్రీలకు కూడా భారత ‘ఎ’ జట్టులో చోటు లభించింది. ఆగస్టు 7 నుంచి 25 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో టీమిండియా మూడు టి20లు, మూడు వన్డేలు, ఒక నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతుంది. భారత ‘ఎ’ జట్టు: మిన్న మణి (కెప్టెన్ ), శ్వేత సెహ్రావత్ (వైస్ కెప్టెన్ ), ప్రియా పూనియా, శుభ సతీశ్, తేజల్ హసబీ్నస్, కిరణ్ నవ్‌గిరే, సజన, ఉమా చెత్రి, శిప్రా గిరి, రాఘవి బిష్త్, సైకా ఇషాక్, మన్నత్ కశ్యప్, తనుజా కన్వర్, ప్రియా మిశ్రా, మేఘన సింగ్, సయాలీ సట్గరే, షబ్నమ్ షకీల్, యశశ్రీ. -
భారత జట్టుకు నిరాశ
కౌలాలంపూర్: మూడోసారి జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సుదీప్ చిర్మాకో (11వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. జర్మనీ జట్టు తరఫున బెన్ హాస్బాష్ (8వ ని.లో, 30+వ ని.లో) రెండు గోల్స్ చేయగా... పాల్ గ్లాండర్ (41వ ని.లో), ఫ్లోరియన్ స్పెర్లింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో జర్మనీ జట్టు తొమ్మిదోసారి ఈ మెగా ఈవెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత జట్టుకు సెమీఫైనల్లో ఏకంగా 12 పెనాల్టీ కార్నర్లు వచ్చినా ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మూల్యం చెల్లించుకుంది. -
6 నుంచి జీపీఎఫ్ఐ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్థికాంశాల్లో అందరినీ భాగస్వాములను చేసే లక్ష్యంతో సిద్ధం చేసిన యూపీఐ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని జీ20 సదస్సు చీఫ్ కో–ఆర్డినేటర్ హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. జీ20 సదస్సు వేదికగా యూపీఐ సహా ఇతర అంశాల్లో భారత్ అనుభవాలు, మేలైన పద్ధతులు, వనరులను అందించేందుకు సిద్ధమని, దీనివల్ల పేద దేశాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్‌నర్‌షి ప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్ (జీపీఎఫ్ఐ) రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. దానికంటే ముందు శని, ఆదివారాల్లో ‘నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్’సమావేశాలు నిర్వహించనున్నారు. జీ20 దేశాలతోపాటు ఆసక్తిగల ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఇందులో పాల్గొననున్నాయి. ఆర్థిక అంశాల్లో అందరికీ చోటు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టనష్టాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అనుభవాలను పంచుకొనేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమావేశం ప్రాముఖ్యత ఇతర వివరాలను వెల్లడించారు. భారత్ తయారీ యూపీఐ పేమెంట్లపై సర్వత్రా ఆసక్తి... భూదక్షిణార్ధ గోళంలోని దేశాలతో ప్రధాని మోదీ ఇప్పటికే ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’పేరుతో చర్చలు జరిపారని, ప్రజోపయోగం కోసం డిజిటల్ టెక్నాలజీ వాడకం అవసరాన్ని నొక్కి చెప్పారని హర్షవర్ధన్‌శ్రింగ్లా తెలిపారు. గ్లోబల్ సౌత్ ప్రాథమ్యాలు, గళం భారత్ గళమవుతుందని ప్రధాని స్పష్టం చేసినట్లు వివరించారు. ఈ నెల 6న చెల్లింపులు, రెమిటెన్సెస్‌లలో డిజిటల్ ఇన్నొవేషన్స్ అంశంపై జీపీఎఫ్ఐ సదస్సును నిర్వహించనున్నామని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల అమలుకు పెట్టే పెట్టుబడుల వల్ల ఉత్పాదకత పెంపుతోపాటు ఖర్చులు కూడా తగ్గుతాయని అభివృద్ధి చెందుతున్న దేశాలు గుర్తించాయని, ఈ నేపథ్యంలోనే భారత్ సిద్ధం చేసిన యూపీఐ పేమెంట్ల పద్ధతులపై సర్వత్రా ఆసక్తి నెలకొందన్నారు. ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో నిర్వహించిన తొలి జీపీఎఫ్ఐ సమావేశాల ద్వారా కొన్ని సత్ఫలితాలను సాధించామని, ప్రపంచ దేశాల రుణభారాన్ని తగ్గించడం, స్వదేశాలకు చేసే చెల్లింపులకు అయ్యే ఖర్చులు తగ్గించడం, ఆయా దేశాలకు మేలు జరగాలంటే సక్రియాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాల అవసరం వంటి అంశాల్లో సభ్యుల మధ్య అంగీకారం కుదిరిందని శ్రింగ్లా తెలిపారు. కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్ 3700 కోట్ల డాలర్ల మొత్తాన్ని మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందజేయడంపై అంతర్జాతీయ సంస్థలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు చంచల్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్ములావన్ టెస్టుకు భారత రేసర్ జెహాన్
భారత యువ రేసర్ జెహాన్ దారూవాలా తన ఫార్ములావన్ కలను సాకారం చేసుకునే పనిలో మొదటి అడుగు వేస్తున్నాడు. ఎఫ్1 సర్క్యూట్లో ఎనిమిది సార్లు కన్స్ట్రక్టర్స్ చాంపియన్ అయిన మెక్లారెన్ జట్టులో 23 ఏళ్ల రేసర్ రెండు రోజుల టెస్టులో పాల్గొంటున్నాడు. సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్) ట్రాక్‌పై నేడు, రేపు ‘ఎంసీఎల్–35’ ఫార్ములావన్ కారును టెస్టు డ్రైవ్ చేస్తాడు. ప్రస్తుతం జెహాన్ మూడో సీజన్ ఫార్ములా–2లో పోటీపడుతున్నాడు. చదవండి: వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి -
గుండెజబ్బుతో అకాల మరణాలు ఎందుకంటే?
కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. గుండెపైన కిరీటం ఆకృతిలో కీలకమైన ధమనులుంటాయి. (అందుకే ఈ ధమనులను ‘కరోనరీ’ ధమనులంటారు). ఈ రక్తనాళాలే గుండెకు పోషకాలను (రక్తం, ఆక్సిజన్) సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఈ ధమనులు సన్నబడి, రక్త సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. దీంతో 50 – 55 ఏళ్ల వారిలో గుండెపోటు వస్తుంది. కానీ 25%లో ఇది 40లోపు వాళ్లలో కూడా గుండెపోటు వస్తుంటుంది. ఇదీగాక కొందరు యువకుల్లో హఠాన్మరణాలు కనిపిస్తుంటాయి. దానికి రక్తసంబంధీకుల్లో జరిగే పెళ్లిళ్ల వంటి అంశాల కారణంగా జన్యుపరమైన కారణాలతో ఈ అకస్మాత్తు మరణాలు సంభవిస్తుంటాయి. ఇటీవల ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందుకు ముఖ్యమైన కారణం... వయసు పెరుగుతున్నకొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్క్లిరోసిస్ అంటారు. కొందరిలో ఈ అథెరో స్క్లిరోసిస్ మొదలైన ఏడాదిలోనే గుండెపోటు కనిపించవచ్చు. ఈ ముప్పునకు మరో ప్రధాన కారణం రక్తనాళాల్లో పేరుకునే కొలెస్ట్రాల్. ఇది క్రమంగా, నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటుంది.. కానీ కొందరిలో ఇది చాలా వేగంగా జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లేక్స్’ అంటారు. ఈ ప్లేక్స్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల అవి సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లేక్స్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరాను తగ్గించవచ్చు. దాంతోనూ గుండెపోటు రావచ్చు. ఇది ఛాతీలో నొప్పి రూపంలో కనిపించవచ్చు. ఈ కండిషన్‌ను ‘యాంజినా పెక్టోరిస్’ అంటారు. తగినంత రక్తం అందని కారణంగా గుండె కండరాలు చచ్చుపడిపోవడం ప్రారంభమవుతుంది. దాన్నే ‘హార్ట్ ఎటాక్’ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ (ఏఎమ్ఐ) అంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్ వివిధ రూపాల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు... స్వల్పంగా అనిపించే ఛాతీ నొప్పి మొదలుకొని... తీవ్రమైన నొప్పి నుంచి అకస్మాత్తు మరణం వరకు ఏదైనా జరగవచ్చు. స్టెంట్లు కూడా కాపాడలేక పోవచ్చు... ఎందుకంటే? అంతా ఆరోగ్యంగానే ఉండి కూడా... అకస్మాత్తుగా మృతిచెందిన చాలామందిని పరిశీలిస్తే వారికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనే కండిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. కొందరిలో ఏదో కారణంతో దాన్ని కనుగొని (డయాగ్నోజ్ చేసి) ఉండవచ్చు లేదా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించనందున మరికొందరిలో దీన్ని కనుగొని ఉండకపోవచ్చు. అయితే గతంలో గుండెపోటు వచ్చి ఉండి, అది బయటకు కనిపించకుండా గుండె పంపింగ్ వ్యవస్థ బలహీనపడటంతో ఈ హఠాన్మరణాలు సంభవించే అవకాశం ఉంది. ధమనులు మూసుకుపోవడంతో గుండెకు తగినంత రక్తం సరఫరా జరగడం లేదని గుర్తించినవారికి యాంజియోప్లాస్టీ చేయడం, స్టెంట్ అమర్చడం చేస్తారు. కానీ అలాంటి చికిత్స అందించినవారిలోనూ... చాలా అరుదుగానే అయినా కొందరు మృతిచెందుతుంటారు. స్టెంట్ వంటివి గుండెకు అవసరమైన రక్తసరఫరాను తప్పక పెంచుతాయి. అందులో సందేహం లేదు. కానీ అవి అమర్చేనాటికే... వారికి తెలియకుండానే గుండెపోటు వచ్చిన సందర్భాల్లో గుండె కండరాలు అప్పటికే బలహీనమై ఉండవచ్చు. బలహీనపడ్డ గుండె భాగాల్లో గుండెకు గాయమై (స్కార్ వచ్చి) ఉండవచ్చు. అలాంటి వారిలో... స్పందనలకు కారణమయ్యే గుండె తాలూకు ‘ఎలక్ట్రిక్ కరెంట్ సర్క్యూట్’ అసాధారణంగా (అబ్–నార్మల్‌గా) మారవచ్చు. దాంతో గుండె స్పందనలు, గుండెవేగం విపరీతంగా పెరగవచ్చు. ఫలితంగా గుండెదడ (వెంట్రిక్యులార్ టాచీకార్డియా), వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ వంటి కండిషన్ల వల్ల అకస్మాత్తు మరణం (సడన్ కార్డియాక్ డెత్) సంభవించవచ్చు. ఇలాంటి రోగుల్లో వాస్తవమైన గుండెపోటు ఎప్పుడో 10 – 20 ఏళ్ల కింటే వచ్చి ఉండవచ్చు. ఇలాంటివారికి మరోమారు గుండెపోటు వచ్చిందంటే వారిలో కేవలం 30% – 40% మాత్రమే బతికేందుకు అవకాశముంటుంది. మొదటిసారి గుండెపోటు వచ్చాక... గుండె కండరం బలహీనమైన వారికి ‘డయలేటెడ్ కార్డియోమయోపతి’ అనే కండిషన్ ఉంటుంది. అలాగే మరికొందరికి ఎలాంటి గుండెపోటూ రాకపోయినప్పటికీ గుండె కండరం బలహీనంగా ఉంటుంది. మరికొందరికి వంశపారంపర్యంగానే జన్యుపరంగా గుండెకండరం బలహీనంగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలోని వారు హఠాన్మరణాలకు గురవుతుంటారు. ఇప్పుడు గుండెస్పందనల్లో కరెంటుకు సంబంధించిన అసాధారణతలకు కారణమయ్యే సమస్యలను (కార్డియాక్ ఎలక్ట్రికల్ డిజార్డర్స్)ను గుర్తించి తక్షణం చికిత్స అందించే ఎలక్ట్రోఫిజియాలజీ అనే అత్యాధునిక వైద్యవిభాగం చాలా బాగా అభివృద్ధి చెందింది. లక్షణాల ఆధారంగా ‘కాథ్’ లాబ్‌లలో ఎలక్ట్రో ఫిజియలాజికల్ స్టడీస్ ద్వారా బాధితులకు కలగబోయే ముప్పును కచ్చితంగా అంచనావేయవచ్చు. అంతేకాదు... అంతకు మునుపు లక్షణాలేమీ లేకుండా గుండెపోటు వచ్చినందున... అది ఎప్పుడో ఏదో సందర్భంలో ఈసీజీ తీసినప్పుడు తెలిసిపోయి, ఇతర పరీక్షలు నిర్వహించి సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేయడం కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. తద్వారా అవాంఛిత అకస్మాత్తు /హఠాన్మరణాలను తేలిగ్గా నివారించవచ్చు. నిర్ధారణ /నివారణ / చికిత్స ఇక చికిత్స విషయానికి వస్తే... ‘ఇంప్లాంటబుల్ కార్డియోవెక్టార్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)’ అనే ఉపకరణాన్ని బాధితుల దేహంలోనే అమర్చడం ద్వారా ఆకస్మిక మరణాలను నివారించవచ్చు. దేహంలోని ఈ ఉపకరణం నుంచి వచ్చే కొన్ని వైర్లను రక్తనాళాల ద్వారా గుండె కుడివైపు కింది గదిలో అమర్చుతారు. అదో మినీ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. మంచి సమర్థత ఉన్న ఎలక్ట్రో కార్డియాక్ నిపుణుల కచ్చితమైన నైపుణ్యంతో కూడిన ప్రోగ్రామింగ్ వల్ల అది... గుండె ఎలక్ట్రిక్ సర్కుట్స్లో తేడాలు గ్రహించి, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉంటుంది. ఈ పరిజ్ఞానం హఠాన్మరణాల నివారణలో విప్లవాత్మకమైన ముందడుగు అని చెప్పవచ్చు. సీపీఆర్ ప్రాధాన్యత... ఇలా అకస్మాత్తుగా గుండె సమస్య వచ్చి కొద్దిక్షణాలపాటు గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వారికి సీపీఆర్ ఇవ్వడం ద్వారా హాస్పిటల్‌కు తీసుకు వచ్చేముందరే గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. ఇందుకు గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కుతుంటారు. ఈ ప్రక్రియనే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అంటారు. గుండె కండరాలు ఆగిన (కార్డియాక్ అరెస్ట్ జరిగిన) కొద్ది క్షణాల్లోపు ఈ ప్రక్రియను అనుసరిస్తే ఆ కీలకమైన క్షణాల్లో బాధితుడిని రక్షించవచ్చు. సీపీఆర్ వల్ల గుండె కండరాలనీ ఉత్తేజపరచి, మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందడం ప్రారంభమయ్యేలా చేయవచ్చు. దాంతో బాధితుడిని కాపాడే అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పుడున్న అత్యాధునిక పురోగతి వల్ల గుండెలో విద్యుత్ వ్యవస్థ కారణంగా వచ్చే తేడాలను సరిదిద్దేందుకు ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గుండెదడ (టాకికార్డియా) / వెంట్రిక్యులార్ డీ ఫిబ్రిలేషన్ బాధితులను రక్షించే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) పరికరాన్ని ఆంబులెన్సుల్లో అమర్చి వాటిని పోలీస్ స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ స్థలాల్లో ఉంచడం వల్ల చాలామందిని రక్షించడానికి వీలవుతుంది. మన దేశంలో పరిస్థితి... మన దేశంలో హఠాన్మరణాలు చాలా ఎక్కువ. ఇతర దేశాల్లో ఈ సమస్య చాలా వయసు పైబడినవారిలోనే వస్తుంది. కానీ మన దేశంలో ఇది యువతలోనూ చాలా సాధారణంగా / ఎక్కువ గా కనిపిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం మొత్తం మరణాల్లో ఇలాంటివి 10% పైబడే ఉండవచ్చని అంచనా. తగిన సమయంలోనే చికిత్సలు అందించగలిగితే కీలకమైన మెదడు కండరాలు చచ్చుబడేలోపే బాధితులను సమర్థంగా కాపాడవచ్చు. డాక్టర్ హైగ్రీవ్ రావు సీనియర్ కార్డియాలజిస్ట్ – ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తేనె అంటే ఇష్టపడని వారుండరు. సహజసిద్ధమైంది కావడం, ఔషధ గుణాలు బోలెడు ఉడడం, అలాగే రుచిలో మేటి కారణంగా దీని స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ నిండుగా ఉండడంతో ఫుడ్ సప్లిమెంట్స్, సౌందర్య సాధనాలతోపాటు ఔషధాల తయారీలో కూడా తేనెను విరివిగా వాడుతున్నారు. ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పాదనకు డిమాండ్ 365 రోజులూ ఉంటుంది. భారత్‌లో తేనె వ్యాపారం విలువ 2018లో సుమారు రూ.1,560 కోట్లు నమోదైంది. ఏటా 10.2 శాతం వృద్ధితో 2024 నాటికి ఇది రూ.2,806 కోట్లకు చేరుకోనుందని మార్కెట్ వర్గాల సమాచారం. వందకుపైగా రకాలు.. తేనెటీగలు 300–350 రకాల పూల నుంచి హనీని సేకరిస్తాయి. ఫ్లవర్స్ నాణ్యతనుబట్టి రంగు, రుచి, వాసన, టెక్స్చర్ మారుతుంది. తెలుపు, పసుపు, నలుపు, గోధుమ తదితర వర్ణాల్లో తేనె లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా రకాల హనీ తయారవుతోంది. ‘మూడు నుంచి ఆరు వారాల జీవిత కాలం ఉండే తేనెటీగ సుమారు 10 గ్రాముల తేనెను ఉత్పత్తి చేస్తుంది. 40 లక్షల పూల నుంచి సేకరించిన మకరందంతో 4 కిలోల తేనెతుట్టె సిద్ధమవుతుంది. దీని నుంచి 1 కిలో తేనె వస్తుంది’ అని జీనోమ్‌ల్యాబ్స్ బయో ఈడీ అశోక్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తేనెను వేరు చేయగా వచ్చే నీరు, పుప్పొడిని ఫుడ్ సప్లిమెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, మెడిసిన్స్‌లో వాడుతున్నారు. ‘అరుదైన తేనెతో విభిన్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్లోనీ బ్రాండ్‌లో ప్రీమియం వెరైటీలను ఇప్పటికే ప్రవేశపెట్టాం’ అని తెలిపారు. వినియోగం, తయారీలోనూ..: వినియోగం పరంగా యూఎస్, యూరప్, చైనా, భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ప్రీమియం హనీ ఉత్పత్తికి యూరప్‌లోని హంగేరీ పెట్టింది పేరు. యూఎస్, న్యూజీలాండ్, కెనడా, చైనా, భారత్‌లో తేనె పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. వినియోగం, తయారీ పరంగా భారత్ ప్రధాన దేశాల్లో ఒకటిగా నిలిచింది. రూ.1,560 కోట్ల భారత హనీ విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.1,200 కోట్లుంది. డాబర్, పతంజలి, జంఢు, ఏపిస్, రస్న తదితర బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఇవేగాక ఆర్గానిక్ విభాగంలో 24 లెటర్ మంత్ర, ప్రో నేచుర్, ఆర్గానిక్ తత్వ, నేచుర్ ల్యాండ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. పేరుకు తగ్గట్టే రాయల్.. మనుక, అకేషియా, లిండేన్, మిల్క్‌వీడ్, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, క్లోవర్ వంటి పూలు చాలా ఖరీదైనవి. పలు దేశాల్లో ఈ పూల మొక్కలతో ప్రత్యేక తేనె ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ మొక్కలను పెంచుతున్నారు. వీటి తేనె ఖరీదు కిలోకు రూ.1 లక్షకుపైగా ఉంటోంది. హనీ రకాల్లో అత్యంత ఖరీదైంది రాయల్ జెల్లీ. ఇతర వెరైటీలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా పేస్ట్ మాదిరి గా ఉంటుంది. క్వీన్ బీ నుంచి సేకరించిన 30 ప్లస్ గ్రేడ్ వెరైటీ కిలో ధర రూ.1.5 లక్షల పైమాటే. ఇది వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఈ స్థాయి ఖరీదు ఉంది. -
ఏ ఊరైనా... ఏ ఇల్లయినా..వందేళ్ల మందు ‘జిందా తిలిస్మాత్'
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు... ఇలా ఏదైనా కావచ్చు. మందు మాత్రం ఒక్కటే. ఆ మందు కూడా ఇప్పటిదేమీ కాదు. దాదాపు వందేళ్ల కిందటిది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 94 ఏళ్ల కిందటిది. ఇదంతా ‘జిందా తిలిస్మాత్’ గురించేనని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నిజమే! దాని గురించే. పల్లెటూళ్లోని పచారీ కొట్టు మొదలు సిటీలోని డిపార్ట్మెంటల్ స్టోర్ వరకు ఎక్కడైనా దొరికే ఔషధమిది. ఔరంగాబాద్ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి చేతుల్లో తయారైన ఈ మందు... ఇపుడొక బ్రాండ్‌గా, ఓ పెద్ద కంపెనీగా ఎదిగిందంటే మాటలు కాదు. ఇదంతా ఎలా సాధ్యమైందని అడిగిన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి జిందా తిలిస్మాత్ పార్టనర్ మహ్మద్ ఓవైసుద్దీన్ ఫారూఖీ చెప్పిందొక్కటే. జనానికి తమపై ఉన్న నమ్మకం వల్లేనని. అంతేకాదు. ఆ నమ్మకాని తమ తండ్రి ఎలా సంపాదించారో కూడా వివరించారు. ‘‘నాన్నగారి పేరు హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. చిన్నప్పటి నుంచీ ఆయనకు పరిశోధనలంటే ఇష్టం. పేదల జీవితాలను దగ్గర్నుంచి చూశారాయన. రోగం ముదిరి చనిపోవడం వేరు.. దానికి చికిత్స చేయించుకునే స్థోమత లేక చనిపోవడం వేరు... అని గట్టిగా నమ్మేవారు. యునానీ కోర్సు చేశారు. షికాగో మెడికల్ కాలేజీ ఆఫ్ హోమియోపతి నుంచి హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు చేశారు. తర్వాత పరిశోధనలు మొదలెట్టారు. హైదరాబాద్ మోతీ మార్కెట్లోని మా ఇంట్లోనే ఆసుపత్రిని ఆరంభించారు. ఒకవైపు పేదలకు వైద్యం చేస్తూనే మరోవైపు ఔషధ తయారీకి శ్రమించారు. మందు కనిపెట్టడం ఒక ఎత్తయితే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం మరో ఎత్తు. ఫలితాలను అంచనావేసి మందు తయారీలో మార్పులు చేర్పులు చేసేవారు. అలా సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి ఫార్ములాలు కనిపెట్టారు నాన్న. వినూత్నంగా ప్రచారం... అప్పట్లో ఏ వస్తువుకైనా ప్రచారమంటే అంత తేలిక కాదు. పగలంతా వైద్యం చేసి చీకటి పడగానే ఏదో గ్రామానికి వెళ్లేవారు నాన్న. ఈ మందు వాడండి. మీ ఇంటిల్లిపాదికీ సర్వరోగ నివారిణి... అంటూ ఇంటింటా ప్రచారం చేసేవారు. గ్రామాల్లో గోడలపై ఆయనే ప్రకటనలు రాసేవారు. ప్రయాణాల్లో పక్కనున్నవారికి ఉచితంగా జిందా తిలిస్మాత్ ఇచ్చేవారు. గాలిపటాలపై కూడా రాయించేవారు. ఆయన శ్రమ ఫలించింది. ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన సర్వరోగ నివారిణిగా జిందా తిలిస్మాత్ అవతరించింది. జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి మందులకు తయారీదారు.. ప్రకటనకర్త.. అమ్మకందారు.. కార్మికుడు.. యజమాని అన్నీ మొయిజుద్దీన్ ఫారూఖీగారే. నీగ్రో బొమ్మ ఎందుకంటే... జిందా తిలిస్మాత్ బాటిల్‌పై ఆఫ్రికన్ నీగ్రో బొమ్మ ఉంటుంది. అది చూసి అప్పట్లో... ఎవరో ఒక ఆఫ్రికన్ మా నాన్నగారికి ఈ ఫార్ములా చెప్పి ఉంటారనే ప్రచారం జరిగింది. అది కరెక్టు కాదు. నీగ్రో బొమ్మ పెట్టడం వెనుక ఓ కారణముంది. అప్పట్లో నిజాం ఆర్మీలో ఆఫ్రికన్లుండేవారు. వాళ్లు చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు. అప్పట్లో ఆరంభించిన సంస్థ కాబట్టి వీళ్ల బొమ్మనే ముద్రిస్తే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని నాన్నగారి ఆలోచన. మా ఉత్పత్తులైన జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి, జింట్ లాజిస్టర్స్కు మన రాష్ట్రంతో పాటు మధ్య ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, యూఎస్, సౌదీ, దుబాయ్, అబుదాబిలలో కూడా మార్కెట్ ఉంది. యంత్రాలుండవ్.. మా కంపెనీలో మెషిన్లు లేవు. వీలైనంత మందికి ఉపాధి కల్పించాలని నాన్నగారు చెప్పిన మాటలు ఎప్పటకీ మేం మరిచిపోలేం. మా సంస్థలో 85 మంది పనిచేస్తున్నారు. అప్పట్లో నాన్నగారితో పనిచేసిన వారి మూడో తరం వారసులే ఇప్పుడు మా దగ్గర ఉద్యోగులు. అంతా ఒకే కుటుంబంలా ఉంటాం. మేమూ ఉద్యోగుల్లానే ఉంటాం. మా కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.12 కోట్లే. మేం నిజంగా దీన్నో వ్యాపారంలా చూడటం లేదు. ఇదో సేవా కార్యక్రమం. ప్రకతి వైపరీత్యాలు జరిగినప్పుడు మా సాయంగా జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి ఉచితంగా పంపిణీ చేస్తాం. ఏటా హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా దీన్ని ఇస్తుంటాం’’.