టంగ్స్టన్ వేటలో ఎన్ఎండీసీ
హైదరాబాద్: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఖరీదైన టంగ్స్టన్ ఖనిజం వేటలో పడింది. వియత్నాంలోని నూయి ఫావో పాలీమెటాలిక్ మైన్లో వాటా కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది. గని యజమాని మసన్ రిసోర్సెస్ అనే కంపెనీతో ఈ మేరకు ఎన్ఎండీసీ చర్చలు జరుపుతోంది. గనిలో సుమారు 6.6 కోట్ల టన్నుల టంగ్స్టన్ ముడి ఖనిజం నిల్వలున్నట్టు అంచనా. మసన్ రిసోర్సెస్ 2015 వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా టంగ్స్టన్ను ఉత్పత్తి చేస్తు న్న సంస్థగా ఈ కంపెనీ నిలిచింది. ప్రపంచ అవసరాల్లో 30% సరఫరా చేస్తోంది. ఈ ఖనిజం కోసం భారత్ ప్రస్తుతం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఎన్ఎండీసీ నుంచి టంగ్స్టన్ కొనుగోలుకు భారత రక్షణ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది కూడా.