india players
-
భారత పురుషుల స్క్వాష్ టీమ్ కొత్త చరిత్ర
భారత పురుషుల స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పసిడి పతకం సాధించింది. కువైట్‌తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోషల్ దుమ్మురేపారు. తొలి మ్యాచ్‌లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో సౌరవ్ ఘోషల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్ ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్‌ను మట్టికరిపించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా గతంలో ఈ టోర్నీలో భారత్ రెండుసార్లు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్‌ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్ లో మలేషియాపై 2-1తో గెలిచి ఫైనల్ చేరింది. కాగా ఇదే చాంపియన్‌షిప్ భారత మహిళల స్క్వాష్ బృందం క్యాంస్యం పతకం గెలుచుకుంది. -
CWG 2022 3rd Day: భారత ఆటగాళ్ల మ్యాచ్ షెడ్యూల్.. పూర్తి వివరాలు
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆదివారం భారత్ ఆటగాళ్ల షెడ్యూల్.. పూర్తి వివరాలు ►1:00 PM: తానియా చౌదరి vs షానా ఓ నీల్ (నార్తర్న్ ఐలాండ్) (లాన్ బాల్స్) ►1:30 PM: యోగేశ్వర్ సింగ్ - పురుషుల ఆల్ అరౌండ్ ఫైనల్ (జిమ్నాస్టిక్స్) ►2:00 PM: జెరెమీ లాల్రిన్నుంగా - పురుషుల 67 KG (వెయిట్ లిఫ్టింగ్) ►2:00 PM: పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (టేబుల్ టెన్నిస్) ►2:32 PM: ఎసోవ్ అల్బెన్, రొనాల్డో లైటోంజమ్, డేవిడ్ బెక్హాం – పురుషుల స్ప్రింట్ క్వాలిఫైయింగ్ (సైక్లింగ్) ►3:07 PM: సజన్ ప్రకాష్ – పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్ 3 (ఈత) ►3:27 PM: పురుషుల స్ప్రింట్ 1/8 ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►3:30 PM: భారత్ vs పాకిస్థాన్ (క్రికెట్) ►3:31 PM: శ్రీహరి నటరాజ్ – పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్ 6 ►4:00 PM: భారతదేశం vs ఇంగ్లాండ్ - లాన్ బౌల్ పురుషుల పెయిర్స్ ►4:04 PM: పురుషుల స్ప్రింట్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►4:20/4:59 PM: వెంకప్ప కెంగళగుత్తి, దినేష్ కుమార్ – పురుషుల 15KM స్క్రాచ్ రేస్ క్వాలిఫైయింగ్ (సైక్లింగ్) ►4:45 PM: నిఖత్ జరీన్ vs హెలెనా ఇస్మాయిల్ బాగూ (MOZ) – 48 – 50KG (రౌండ్ ఆఫ్ 16) (బాక్సింగ్) ►5:15 PM: శివ థాపా vs రీస్ లించ్ (SCO) – 60 – 63.5KG (రౌండ్ ఆఫ్ 16) ►6:00 PM: జోష్నా చినప్ప vs కైట్లిన్ వాట్స్ (NZL) - మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (స్క్వాష్) ►6:30 PM: పాపీ హజారికా - మహిళల 59KG (వెయిట్ లిఫ్టింగ్) ►6:45 PM: సౌరవ్ ఘోసల్ vs డేవిడ్ బైలార్జన్ (CAN) - పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (స్క్వాష్) ►7:00 PM: మహిళల ఆల్ అరౌండ్ ఫైనల్ ►7:30 PM: మహిళల నాలుగు క్వార్టర్ ఫైనల్స్ (లాన్ బాల్స్) ►7:40 PM: పురుషుల స్ప్రింట్ సెమీఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►8:30 PM: భారతదేశం vs ఘనా - పురుషుల పూల్ A (హాకీ) ►9:02 PM: త్రియషా పాల్, మయూరి లూట్ - మహిళల 500M టైమ్ ట్రయల్ ఫైనల్ (సైక్లింగ్) ►10:00 PM నుండి: మిక్స్డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (బ్యాడ్మింటన్) ►10:12 PM: పురుషుల స్ప్రింట్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►10:30 PM: పురుషుల పెయిర్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (లాన్ బాల్స్) ►10:30 PM: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే) (లాన్ బాల్స్) ►11:00 PM: అచింత షెయులీ - పురుషుల 73 KG (వెయిట్ లిఫ్టింగ్) ►11:12 PM: పురుషుల 15KM స్క్రాచ్ రేస్ ఫైనల్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►11:37 PM: శ్రీహరి నటరాజ్ – పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్ (స్విమ్మింగ్) ►11:58 PM: సజన్ ప్రకాష్ – పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఫైనల్ (స్విమ్మింగ్) ►12:15 AM (AUG 1): సుమిత్ vs కల్లమ్ పీటర్స్ (AUS) – 71 – 75KG కంటే ఎక్కువ (రౌండ్ ఆఫ్ 16) ►1:00 AM (AUG 1): సాగర్ vs మాక్సిమ్ యెగ్నాంగ్ ఎన్జీయో (కామెరూన్) - 92KG కంటే ఎక్కువ ►1:30 AM (AUG 1): మహిళల టీమ్ సెమీఫైనల్స్ (టేబుల్ టెన్నిస్) -
శ్రీకాంత్ ఐదో‘సారీ’...
కౌలూన్ (హాంకాంగ్): బ్యాడ్మింటన్ సీజన్లో చివరి సూపర్ సిరీస్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో భారత క్రీడాకారులు చేతులెత్తేశారు. బరిలోకి దిగిన అందరూ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, 21వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్, 25వ ర్యాంకర్ అజయ్ జయరామ్... మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు... మహిళల డబుల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ జంట గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్పలకు పరాజయం తప్పలేదు. ఈ సీజన్లో తనకు కొరకరాని కొయ్యగా మారిన చైనా ప్లేయర్ తియాన్ హువీ అడ్డంకిని అధిగమించడంలో భారత నంబర్‌వన్ శ్రీకాంత్ ఐదోసారీ విఫలమయ్యాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 16-21, 21-15, 22-24తో ప్రపంచ పదో ర్యాంకర్ తియాన్ హువీ చేతిలో ఓడిపోయాడు. గంటా 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను వదులుకోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 17-21, 12-21తో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో... ప్రణయ్ 15-21, 21-18, 6-21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. సింధు పరాజయం ఇక మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధుకు పరాజయం తప్పలేదు. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 17-21, 9-21తో ఓడిపోయింది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో మారిన్‌ను బోల్తా కొట్టించిన సింధు ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 12-21, 15-21తో జంగ్ క్యుంగ్ యున్-షిన్ సియెంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. -
మరో ముగ్గురిపై అనర్హత...
న్యూఢిల్లీ: ఆసియా యూత్ క్రీడల నుంచి భారత క్రీడాకారుల తిరుగుముఖం పట్టడం ఇంకా ఆగడంలేదు. నిర్వాహకుల తప్పిదమో లేక మన క్రీడాధికారుల పొరపాటు తెలియదు కానీ భారత ఆటగాళ్లు బరిలోకి దిగకుండానే ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు నిర్ణయించిన వయస్సుకంటే ఎక్కువగా ఉన్నందుకు ఇప్పటికే భారత్‌కు చెందిన 24 మంది క్రీడాకారులపై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. తాజాగా ఈ జాబితాలో ముగ్గురు వెయిట్‌లిఫ్టర్లు చేరారు. చంద్రిక తరఫ్దార్ (48 కేజీలు), జ్యోతి మాల్ (53 కేజీలు), అక్షయ్ భగవాన్ (62 కేజీలు)లు నిర్ణీత వయస్సుకంటే ఎక్కువగా ఉండటంతో వీరిపై వేటు పడింది. చైనాలోని నాన్జింగ్లో జరుగుతోన్న ఆసియా యూత్ క్రీడల్లో అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్ అంశాల్లో 1997 జనవరి 1 తర్వాత జన్మించిన వారికే పాల్గొనే అర్హత ఉంది. చంద్రిక, జ్యోతి, అక్షయ్ 1996లో జన్మించడంతో వారు అనర్హతకు గురయ్యారు. అయితే మిగతా క్రీడాంశాల్లో మాత్రం 17 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న వారు పాల్గొనవచ్చు. ‘భారత్‌కు చెందిన ముగ్గురు వెయిట్‌లిఫ్టర్ల ఎంట్రీలను తిరస్కరించారు. అయితే కారణాలు ఇంకా తెలియరాలేదు’ అని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధికారి ఒకరు తెలిపారు.